సమంత చేసుకున్న భూత శుద్ధి వివాహం గురించి తెలుసా? అసలు ఏం చేస్తారో చూడండి

సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలుసు కదా. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సోమవారం (డిసెంబర్ 1) ఆమె పెళ్లి జరిగింది. తమిళనాడులోని ఈషా ఫౌండేషన్ లో ఉన్న లింగభైరవి దేవి ఆలయంలో భూత శుద్ధి వివాహం చేసుకున్నారు.

Dec 1, 2025, 15:31:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు, పాపులర్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కోయంబత్తూరులోని సద్గురు ఈషా యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి దేవి సన్నిధిలో సోమవారం (డిసెంబర్ 1) ఉదయం వీరి వివాహం అత్యంత పవిత్రంగా జరిగింది. అయితే వీళ్లు చేసుకున్న భూత శుద్ధి వివాహం ఏంటి? అసలు ఏం చేస్తారన్న వివరాలు ఇక్కడ చూడండి.

సమంత చేసుకున్న భూత శుద్ధి వివాహం గురించి తెలుసా? అసలు ఏం చేస్తారో చూడండి
సమంత చేసుకున్న భూత శుద్ధి వివాహం గురించి తెలుసా? అసలు ఏం చేస్తారో చూడండి

సమంత, రాజ్ భూత శుద్ధి వివాహం

సమంత, రాజ్ నిడిమోరు తమ రిలేషన్షిప్ ను ఏకంగా పెళ్లితోనే కన్ఫమ్ చేసేశారు. అంతేకాదు వీళ్లు భూత శుద్ధి పెళ్లితో ఒక్కటయ్యారు. పంచభూతాల సాక్షిగా.. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక నిరాడంబరంగా జరిగింది. ప్రాచీన యోగ సంప్రదాయంలో విశేషమైన ‘భూతశుద్ధి వివాహ’ క్రతువు ద్వారా వీరిద్దరూ ఒక్కటయ్యారు.

సాధారణ పెళ్లి తంతులా కాకుండా.. ఇది ఆలోచనలు, భావోద్వేగాలు, శారీరక అంశాలకు అతీతంగా దంపతుల మధ్య లోతైన అనుబంధాన్ని ఏర్పరిచే ఒక విశిష్ట ప్రక్రియ. లింగ భైరవి ఆలయాల్లో లేదా ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో మాత్రమే ఈ క్రతువును నిర్వహిస్తారు. దంపతుల శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసి, వారి దాంపత్య జీవితంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మిక పరిపూర్ణత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ఇది ప్రసాదిస్తుందని ప్రతీతి.

లింగ భైరవి గురించి

ఈ సందర్భంగా సమంత, రాజ్ జంటకు ఈషా ఫౌండేషన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. "లింగ భైరవి దేవి ఆశీస్సులతో, అపరిమితమైన కృపతో వీరి ప్రయాణం ఆనందంగా సాగాలి" అని ఆకాంక్షించింది.

సద్గురు జగ్గీ వాసుదేవ్ స్వయంగా ప్రాణ ప్రతిష్ట చేసిన లింగ భైరవి.. దివ్యమైన స్త్రీత్వానికి ప్రతిరూపం. ఆమె ఒకే సమయంలో ఉగ్రరూపిణిగానూ, కరుణామయిగానూ దర్శనమిస్తారు. ఈషా యోగా సెంటర్‌లోని ఆమె సన్నిధి, జీవితాన్ని సుసంపన్నం చేసే అనేక ఆచారాలకు వేదిక.

ఎనిమిది అడుగుల ఎత్తులో ఉండే ఈ శక్తి స్వరూపం.. సృష్టిలోని సృజనాత్మక శక్తికి నిదర్శనం. భక్తుల జీవితంలోని ప్రతి దశలోనూ.. అంటే జననం నుంచి మరణం వరకు.. వారి శరీరం, మనస్సు, శక్తులను స్థిరంగా ఉంచడంలో ఆమె తోడ్పడతారు. సమంత చాలా కాలంగా ఈ లింగ భైరవి సన్నిధికి వెళ్తోంది. గతంలోనూ ఎన్నోసార్లు ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More