50 కిలోల బరువున్న సమంత తినే ప్రొటీన్ 100 గ్రాములు.. సగటు భారతీయ మహిళ ఎంత తినాలో చెప్పిన న్యూట్రిషనిస్ట్

బ్యూటిపుల్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు 100 గ్రాములు ప్రొటీన్ తీసుకుంటానని ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పింది. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రాశి చౌదరితో జరిగిన ఈ పాడ్‌కాస్ట్‌లో సగటు భారతీయ మహిళ ఎంతవరకు ప్రొటీన్ తీసుకోవాలో చర్చించారు. మరి ఆ విషయాలపై లుక్కేద్దాం.

Published on: Oct 20, 2025, 20:26:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శక్తి, కండరాల ఆరోగ్యం, మొత్తం శ్రేయస్సుకు ప్రోటీన్ చాలా అవసరం. అయితే, చాలా మంది మహిళలకు రోజూ ఎంత తినడం అవసరమో కచ్చితంగా తెలియదు. అయితే, ఇటీవల హీరోయిన్ సమంత రూత్ ప్రభు పాల్గొన్న ఓ పాడ్‌కాస్ట్‌లో ప్రముఖ పోషకాహార నిపుణురాలు రాశి చౌదరి న్యూట్రిషన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

50 కిలోల బరువున్న సమంత తినే ప్రొటీన్ 100 గ్రాములు.. సగటు భారతీయ మహిళ ఎంత తినాలో చెప్పిన న్యూట్రిషనిస్ట్
50 కిలోల బరువున్న సమంత తినే ప్రొటీన్ 100 గ్రాములు.. సగటు భారతీయ మహిళ ఎంత తినాలో చెప్పిన న్యూట్రిషనిస్ట్

ఎంత ప్రొటీన్ తింటారు

మహిళలకు అనువైన ప్రోటీన్ తీసుకోవడం గురించి, ప్రొటీన్ లోపాన్ని ఎలా సమర్థవంతంగా తీర్చాలో రాశి చౌదరి మాట్లాడారు. సగటు భారతీయ మహిళకు నిజంగా ఎంత ప్రోటీన్ అవసరం అనే విషయాన్ని న్యూట్రిషనిస్ట్ రాశి చౌదరి చెప్పుకొచ్చారు. అయితే, ముందుగా సమంతను ఎంత ప్రొటీన్ తింటారు అని రాశి చౌదరి అడిగారు.

60 నుంచి 80 గ్రాముల ప్రొటీన్

దానికి "నేను 100 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటాను. అలాగే, నా బరువు 50 కిలోలు" సమంత చెప్పింది. దానికి "మరి 55-60 కిలోల బరువున్న సగటు భారతీయ మహిళ సంగతేమిటి?" అని రాశి అన్నారు. రాశి చౌదరి ప్రకారం.. 55–60 కిలోల బరువున్న సగటు భారతీయ మహిళకు 60–80 గ్రాముల ప్రోటీన్ అవసరం అని చెప్పారు.

చాలా సులభం అవుతుంది

ఈ 80 గ్రాముల ప్రొటీన్‌తో మీరు రోజంతా చురుకుగా ఉండొచ్చు అని రాశి చౌదరి తెలిపారు. అలాగే, మంచి నాణ్యత గల ప్రోటీన్ పౌడర్‌ను తీసుకుంటే 80 గ్రాముల వరకు ప్రొటీన్ పొందడం చాలా సులభం అవుతుందని ఆమె చెప్పుకొచ్చారు.

పిండి పదార్థాలతో

"మాంసహారం, శాకాహార వనరుల నుంచి వచ్చే ప్రొటీన్ లో ఎక్కువగా కార్బ్స్, కొవ్వు పదార్థాలే ఉంటాయి. కాబట్టి తదనుగుణంగా మీ ప్లేట్‌లో ఆహారం ఉండాలి. దానికి మీ గట్ సిద్ధంగా లేకపోతే మీరు అధిక ప్రోటీన్ తీసుకోగలరా" అని రాశి చౌదరి ప్రశ్నించారు.

50 గ్రాములు కూడా తినలేరు

"నా క్లయింట్లలో కొందరు 50 గ్రాములు కూడా తినలేరు. ఎందుకంటే ప్రోటీన్ సమస్య కాదు. కానీ అది తీసుకునేందుకు గట్ సిద్ధంగా లేనందున. అందుకే గట్ లైనింగ్‌ను పునర్నిర్మించడంలో సహాయపడటానికి నేను మొదట గట్ ప్రక్షాళనను సిఫార్సు చేస్తున్నాను. ఇది చివరికి ప్రోటీన్ అందడానికి సహాయపడుతుంది" అని రాశి చౌదరి వెల్లడించారు.

గట్ బలహీనంగా ఉంటే

"బలహీనమైన గట్‌కు ఎక్కువ ప్రొటీన్‌ను జోడించడం అనేది అగ్నికి ఇంధనం జోడించడం లాంటిది. ఇది ఉబ్బరం లేదా మలబద్ధకం వంటి మంట, గట్ సమస్యలకు దారితీస్తుంది" అని రాశి చౌదరి వివరించింది.

సమంత సినిమాలు

ఇకపోతే బ్యూటిఫుల్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. చివరిగా ఆమె ఖుషీ, శాకుంతలం, సిటాడెల్ వెబ్ సిరీస్‌తో అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం అయితే రక్త బ్రహ్మాండ్ ఓటీటీ సిరీస్‌లో నటిస్తోంది సమంత రూత్ ప్రభు. దీనిని డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More