స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్) వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో డిసెంబర్ 1న వీరిద్దరూ 'లింగ భైరవి దేవి' సన్నిధిలో భూత శుద్ధి విధానంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? నిశ్చితార్థం ఎప్పుడు జరిగింది? అనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. తాజాగా సోషల్ మీడియా డిటెక్టివ్స్ సమంత వేలికి ఉన్న భారీ ఉంగరాన్ని గమనించి.. వారి ఎంగేజ్మెంట్ టైమ్‌లైన్‌పై ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
ఆ ఉంగరం కథేంటి?

సమంత, రాజ్‌లు తమ బంధం గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. కానీ పెళ్లి తర్వాత సమంత షేర్ చేసిన ఫోటోలలో రాజ్ ఆమె వేలికి ఒక భారీ ఉంగరాన్ని తొడుగుతున్న దృశ్యం ఉంది. ఈ ఫోటోను నిశితంగా గమనించిన నెటిజన్లు.. ఆ ఉంగరం తమకు ముందే తెలుసు అని గుర్తించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 13న (వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు) సమంత తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. పింక్ డ్రెస్సులో ఉన్న ఆ ఫోటోలో ఆమె ఉంగరపు వేలికి అదే ఉంగరం ఉంది. అంటే వీరి నిశ్చితార్థం బహుశా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగి ఉండవచ్చని రెడిట్ (Reddit) వేదికగా చర్చ జరుగుతోంది.
అప్పుడే హింట్ ఇచ్చారా?
ఫిబ్రవరిలో సమంత ఆ ఫోటో పెట్టినప్పుడే చాలామంది అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. "ఆమె ఎంగేజ్మెంట్ అయిపోయిందని నాకొక్కడికే అనిపిస్తుందా?" అని అప్పట్లోనే కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు పెళ్లి ఫోటోలు చూశాక అది నిజమే అని తేలిపోయింది.
ఒక నెటిజన్ ఆ పాత ఫోటోను పోస్ట్ చేస్తూ.. "ఇప్పుడు అంతా అర్థమవుతోంది. వారి ఎంగేజ్మెంట్ జరిగి చాలా కాలం అయ్యింది" అని రాసుకొచ్చారు. ఆ ఉంగరం డిజైన్, మెటీరియల్ గురించి కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరొకరు సరదాగా స్పందిస్తూ.. "మనందరం రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ రింగ్ చూస్తూ బిజీగా ఉండిపోయాం.. సమంత రింగ్‌ను మిస్ అయ్యాం" అని కామెంట్ చేయడం విశేషం.
సమంత రెండో పెళ్లి విశేషాలు
సమంత, రాజ్ నిడిమోరు సోమవారం అంటే డిసెంబర్ 1 కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో ఉన్న లింగ భైరవి దేవి సన్నిధిలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. భూత శుద్ధి విధానంలో వీళ్ల పెళ్లి జరిగింది. ఇక గతంలో సమంత 2017 నుండి 2021 వరకు నాగ చైతన్యతో వివాహ బంధంలో ఉంది.
{{/usCountry}}సమంత, రాజ్ నిడిమోరు సోమవారం అంటే డిసెంబర్ 1 కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో ఉన్న లింగ భైరవి దేవి సన్నిధిలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. భూత శుద్ధి విధానంలో వీళ్ల పెళ్లి జరిగింది. ఇక గతంలో సమంత 2017 నుండి 2021 వరకు నాగ చైతన్యతో వివాహ బంధంలో ఉంది.
{{/usCountry}}అటు రాజ్ నిడిమోరు 2015లో శ్యామలి డేని వివాహం చేసుకోగా, 2022లో విడిపోయారని సమాచారం. 2024లో సమంత, రాజ్ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు మొదలయ్యాయి. మొత్తానికి ఇన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచిన తమ ప్రేమ బంధాన్ని.. సమంత-రాజ్ ఇప్పుడు అధికారికంగా పెళ్లితో ధృవీకరించారు.