Samantha: మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి స్టార్ హీరోయిన్ సమంత రెడీ అయింది. యాక్షన్ తో అదరగొట్టేందుకు ‘మా ఇంటి బంగారం’ మూవీతో థియేటర్లలోకి రాబోతోంది. సోమవారం (జూన్ 15) రాత్రి హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సమంత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా సామ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఏడాదికి కనీసం రెండు సినిమాలు

ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న ప్రేమకు సమంత ఎమోషనల్ అయింది. "మూడు సంవత్సరాలు అయింది. అయినా మీరు అదే సపోర్ట్, అదే ప్రేమ చూపిస్తున్నారు. మీకు ఎంతో రుణపడి ఉంటా" అని సామ్ పేర్కొంది. అభిమానుల కోరిక తనకు అర్థమైందని, ఇకపై ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానని సామ్ ప్రామిస్ చేసింది.
మూవీ సక్సెస్ పై
ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయాలని సమంత చెప్పింది. అయితే అది సాధ్యమేనా అన్నది ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సామ్ తెలుగు సినిమా చేసి మూడేళ్లవుతోంది. ప్రొడ్యూసర్ గా మారిన సామ్, ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో సామ్ మరోసారి బిజీ హీరోయిన్ గా మారడం అనేది ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ పైనే డిపెండ్ అయి ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి
ప్రొడ్యూసర్ కష్టాలు
మా ఇంటి బంగారం సినిమాకు సమంత నిర్మాతగానూ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. "ఒక ప్రొడ్యూసర్‌గా స్ట్రెస్ ఎంతలా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఈ మూవీ కోసం టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు. జూన్ 19న ఈ సినిమాను మీరు చూస్తారు. ఈ మూవీ సక్సెస్ పూర్తిగా టెక్నీషియన్స్‌కే చెందాలి" అని సమంత తెలిపింది.
భర్త గురించి సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సమంతకు మా ఇంటి బంగారమే తొలి సినిమా కావడం విశేషం. ఈ ఈవెంట్లో తన భర్త రాజ్ నిడిమోరు గురించి సామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "రాజ్ అండ్ డీకే లైఫ్‌లో లక్ ఏం లేదు. కష్టపడాలి అంతే. వాళ్లు ఎక్కువగా మాట్లాడరు.. పని చేస్తూనే ఉంటారు. నేను వాళ్ల నుంచి అదే నేర్చుకున్నా" అని చెప్పుకొచ్చింది.
చీరలో యాక్షన్ సీన్స్
{{/usCountry}}రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సమంతకు మా ఇంటి బంగారమే తొలి సినిమా కావడం విశేషం. ఈ ఈవెంట్లో తన భర్త రాజ్ నిడిమోరు గురించి సామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "రాజ్ అండ్ డీకే లైఫ్‌లో లక్ ఏం లేదు. కష్టపడాలి అంతే. వాళ్లు ఎక్కువగా మాట్లాడరు.. పని చేస్తూనే ఉంటారు. నేను వాళ్ల నుంచి అదే నేర్చుకున్నా" అని చెప్పుకొచ్చింది.
చీరలో యాక్షన్ సీన్స్
{{/usCountry}}ఇప్పటికే విడుదలైన ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్‌లో సామ్ యాక్షన్ సీన్లు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా చీరలో చేసిన ఫైటింగ్ సీక్వెన్స్‌పై సమంత స్పందిస్తూ.. "చీరలో యాక్షన్ చేయడం చాలా కష్టం. కానీ ఈ సినిమా కోసం రిస్క్ చేసి చేశా" అని ఉత్సాహంగా చెప్పింది సామ్.
‘మా ఇంటి బంగారం’ మూవీ హైలైట్స్
- 2023లో వచ్చిన ‘ఖుషీ’ తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న సినిమా ఇదే. (గతేడాది 'శుభమ్' సినిమాలో క్యామియో చేసింది).
- ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ నందిని రెడ్డి - సమంత కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
- వాస్తవానికి ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ వల్ల ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది.
- భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలోకి రానుంది.