...
...
Next Story

Maa Inti Bangaram Twitter Review: మా ఇంటి బంగారం ట్విట్టర్ రివ్యూ.. సమంత ఊరమాస్ జాతర.. కమ్ బ్యాక్ మూవీ ఎలా ఉందంటే?

Maa Inti Bangaram Twitter Review: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కంప్లీట్ మాస్ యాక్షన్ అవతార్‌లో నటించిన మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ డ్రామా 'మా ఇంటి బంగారం'. ఈ మూవీ ఇవాళ రిలీజైంది. ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ, లైవ్ టాక్ ఎలా ఉందో ఇక్కడ చూసేయండి.

Published on: Jun 19, 2026, 06:12:03 IST
Advertisement

Maa Inti Bangaram Twitter Review: ఇప్పటివరకు సౌత్ స్క్రీన్స్‌పై గ్లామరస్, ఎమోషనల్, కల్ట్ పాత్రలతో మెప్పించిన సమంత.. మొదటిసారి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ మసాలా కథతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. తెలుగులో ఆమె కమ్ బ్యాక్ సినిమా అయిన మా ఇంటి బంగారం ఇవాళ (జూన్ 19) రిలీజైంది.

మా ఇంటి బంగారం ట్విట్టర్ రివ్యూ

మా ఇంటి బంగారం ట్విటర్ రివ్యూ (x/PrathyangiraUS)
మా ఇంటి బంగారం ట్విటర్ రివ్యూ (x/PrathyangiraUS)

మూడేళ్ల తర్వాత సమంత తెలుగులో హీరోయిన్ మళ్లీ నటించిన మూవీ ‘మా ఇంటి బంగారం’. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ సందర్భంగా శుక్రవారం ఉదయపు షోల నుంచే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం మొదలైంది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలను పంచుకుంటున్నారు.

వన్ విమెన్ షో.. సమంత ఊరమాస్ జాతర!

మా ఇంటి బంగారం మూవీ ట్విట్టర్ రివ్యూల ప్రకారం.. ఈ సినిమాను పూర్తిగా సమంత వన్ విమెన్ ఆర్మీలా నడిపించింది. సాధారణంగా టాలీవుడ్ అగ్ర హీరోలు చేసే భారీ ఫైట్లు, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీని సమంత తనదైన మేకోవర్‌తో స్క్రీన్‌పై పండించి థియేటర్లలో పూనకాలు తెప్పించిందని నెటిజన్లు చెబుతున్నారు.

ఫస్ట్ హాఫ్:

క్యారెక్టర్ ఇంట్రడక్షన్, పక్కా లోకల్ హ్యూమర్, హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లతో ఎంతో వేగంగా సాగిపోతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్ ట్విస్ట్ సినిమాకే మేజర్ హైలైట్.

సెకండ్ హాఫ్:

ద్వితీయార్థంలో సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ డోస్ కాస్త ఎక్కువైనప్పటికీ.. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాను ఒక హై నోట్‌లో ముగిస్తుంది.

ఓవరాల్ గా చూసుకుంటే మా ఇంటి బంగారం మూవీకి ట్విట్టర్ లో మిక్స్ డ్ టాక్ వస్తోంది. ‘‘మా ఇంటి బంగారం మూవీ ఓ ఫ్యామిలీ స్టోరీ. కానీ ఎగ్జిక్యూషన్ పూర్ గా ఉంది. విలన్ వీక్ గా ఉన్నాడు. ఎంగేజింగ్ మూమెంట్స్ అంతగా లేవు. సమంత మాత్రం తన రోల్ ను బాగా ప్లే చేసింది’’ అని ఓ నెటిజన్ తన రివ్యూ పంచుకున్నాడు.

సామ్ అదుర్స్

కొందరు నెటిజన్లు ఏమో మా ఇంటి బంగారం మూవీలో సామ్ అదరగొట్టిందని, మస్ట్ వాచ్ మూవీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ‘‘మా ఇంటి బంగారంతో సామ్ తిరిగొచ్చింది. టాలీవుడ్ కు కావాల్సిన బ్లాక్ బస్టర్ ఇది. సినిమాలో సమంత అదరగొట్టింది’’ అని ఓ యూజర్ పేర్కొన్నాడు.

సమంత 'మాస్' ప్లాన్

ట్రేడ్ ఈక్వేషన్స్ ప్రకారం.. హీరోయిన్ సెంట్రిక్ సినిమాలకు మార్కెట్ పెరిగినప్పటికీ, అవి చాలా వరకు హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ లేదా మైండ్ గేమ్స్ జోనర్లకే పరిమితం అవుతున్నాయి. కానీ సమంత తన పాన్-ఇండియా ఇమేజ్‌ను మైండ్ లో పెట్టుకుని ఈ కమర్షియల్ రూట్ ఎంచుకుంది. సినిమా కథ రొటీన్‌గా ఉన్నా.. కేవలం సమంత స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్స్ వల్లే మాస్ బి అండ్ సి సెంటర్స్ లో ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చేలా ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks