Samantha Maa Inti Bangaram 2 Days Box Office Collection: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా చిత్రం 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. కొంతకాలం పాటు వెండితెరకు దూరంగా ఉన్న సమంత, ఈ ఫ్యామిలీ డ్రామాతో మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకుంది.
ఫ్యామిలీ ఆడియెన్స్ సందడి

ఈ సినిమాకు విమర్శకుల నుంచి ఆరంభంలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ప్రేక్షకుల నుంచి అందుతున్న సానుకూల మద్దతుతో వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. మొదటి రోజు కంటే రెండో రోజు శనివారం (జూన్ 19) కావడంతో థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ సందడి భారీగా పెరిగింది.
ప్రముఖ ట్రేడ్ విశ్లేషక సంస్థ 'శాక్నిల్క్' (Sacnilk) తాజా నివేదికల ప్రకారం.. ‘మా ఇంటి బంగారం’ చిత్రం రెండో రోజు ఏకంగా రూ. 7.50 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. మొదటి రోజు రూ. 5.35 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, శనివారం నాడు పెరిగాయి.
2 రోజుల కలెక్షన్స్
దీంతో రెండు రోజుల్లో మా ఇంటి బంగారం సినిమాకు ఇండియా వ్యాప్తంగా మొత్తం రూ. 12.85 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండు రోజుల మొత్తం దేశీయ గ్రాస్ వసూళ్లు రూ. 14.90 కోట్లకు చేరడం విశేషం.
సమంత గత చిత్రాలైన ‘యశోద’, అలాగే ఇటీవల వస్తున్న మహిళా ప్రధాన చిత్రాలు ‘ఘాటి’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ల మొదటి రోజు కలెక్షన్ల రికార్డులను కూడా ఈ సినిమా అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొదటి రోజే ఈ చిత్రం రూ. 13 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
మా ఇంటి బంగారం వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఇక రెండో రోజున వరల్డ్ వైడ్‌గా మా ఇంటి బంగారం సినిమా రూ. 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా ఓవర్సీస్లో నాలుగు కోట్లు వసూలు చేసింది. ఈ లెక్కన రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మా ఇంటి బంగారం సినిమాకు రూ. 28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
ఆకట్టుకుంటున్న ‘స్వర్ణ’ పోరాటం..
{{/usCountry}}ఇక రెండో రోజున వరల్డ్ వైడ్‌గా మా ఇంటి బంగారం సినిమా రూ. 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా ఓవర్సీస్లో నాలుగు కోట్లు వసూలు చేసింది. ఈ లెక్కన రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మా ఇంటి బంగారం సినిమాకు రూ. 28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
ఆకట్టుకుంటున్న ‘స్వర్ణ’ పోరాటం..
{{/usCountry}}ఈ సినిమా కథాంశం మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో సాగుతుంది. స్వర్ణ (సమంత) ప్రేమించి పెళ్లి చేసుకున్న అనిరుధ్ (దిగంత్) తల్లిదండ్రులను మొదటిసారి కలవడానికి వెళ్తుంది. ఇంట్లో వంట పనులు, గృహిణిగా బాధ్యతలు అస్సలు తెలియని స్వర్ణ, అత్తమామల ముందు మంచి మార్కులు కొట్టేయాలని పడే తపన థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది.
అయితే, సరిగ్గా ఇదే సమయంలో స్వర్ణ జీవితంలోకి కరుణ (గుల్షన్ దేవయ్య) అనే వ్యక్తి ప్రవేశించి, ఆమె సంతోషకరమైన సంసారాన్ని ముక్కలు చేయాలని చూస్తాడు. తన పాత జీవితం, రహస్యాలు భర్త కుటుంబానికి తెలియకుండా స్వర్ణ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది అనేదే ఈ చిత్ర ముఖ్య కథాంశం.
నందినీ రెడ్డి మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..
ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వం వహించగా, ‘ఫ్యామిలీ మ్యాన్’ ఫేమ్ రాజ్ నిడిమోరు కథను అందించారు. సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వురు సంయుక్తంగా ‘ట్రాలాల మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.