Maa Inti Bangaram OTT: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ ఇంకొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రేక్షకుల నిరీక్షణకు ఎండ్ కార్డు వేస్తూ ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో, ఈ బ్లాక్‌బస్టర్ సినిమాను ఓటీటీలో ఎందుకు అస్సలు మిస్ అవ్వకూడదో వివరించే ఐదు బలమైన కారణాలు ఇక్కడ చూద్దాం.
వంద కోట్ల క్లబ్‌లో చేరిన రికార్డుల చిత్రం

తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలోనే మా ఇంటి బంగారం సినిమా ఒక సరికొత్త మైలురాయిని అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి మహిళా ప్రధాన (Female-led) చిత్రంగా ఇది చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. కేవలం సమంత స్టార్ పవర్‌తోనే ఈ స్థాయి వసూళ్లు రావడం విశేషం.
సమంత పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్
ఆరోగ్య కారణాల వల్ల కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన సమంత.. ఈ చిత్రంతో వెండితెరపైకి అత్యంత పవర్‌ఫుల్‌గా తిరిగొచ్చింది. తన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. సమంత నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. తన స్టార్ పవర్ ఏమాత్రం తగ్గలేదని ఆమె ఈ చిత్రం ద్వారా నిరూపించింది సామ్.
గృహిణి పాత్రలో ఊహించని యాక్షన్ థ్రిల్స్
సాధారణంగా వచ్చే ఫ్యామిలీ డ్రామాలకు భిన్నంగా ఈ సినిమాను సరికొత్త జానర్‌లో రూపొందించారు. ఒక వైపు గుండెకు హత్తుకునే కుటుంబ సెంటిమెంట్‌ను పండిస్తూనే, మరోవైపు ఊహించని హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో థ్రిల్ ఇస్తుంది మా ఇంటి బంగారం మూవీ. వంటింటికే పరిమితమయ్యే ఒక సాధారణ గృహిణి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటం చేసిందనే కోణంలో సాగే యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోబెడతాయి.
అద్భుతమైన తారాగణం.. పర్‌ఫెక్ట్ కామెడీ టైమింగ్
సమంతతో పాటు ఈ సినిమాలో శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్, సీనియర్ నటి గౌతమి కీలక పాత్రల్లో నటించారు. ప్రతి ఒక్కరు తమ నటనతో ఆకట్టుకున్నారు. సినిమా కథ ఎంత సీరియస్‌గా సాగుతుందో, అంతే పవర్‌ఫుల్‌గా అందులోని షార్ప్ హ్యూమర్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తాయి. భిన్నమైన నటీనటుల కలయిక సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది.
సంతోష్ నారాయణన్ మ్యూజిక్
{{/usCountry}}సమంతతో పాటు ఈ సినిమాలో శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్, సీనియర్ నటి గౌతమి కీలక పాత్రల్లో నటించారు. ప్రతి ఒక్కరు తమ నటనతో ఆకట్టుకున్నారు. సినిమా కథ ఎంత సీరియస్‌గా సాగుతుందో, అంతే పవర్‌ఫుల్‌గా అందులోని షార్ప్ హ్యూమర్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తాయి. భిన్నమైన నటీనటుల కలయిక సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది.
సంతోష్ నారాయణన్ మ్యూజిక్
{{/usCountry}}ఈ సినిమాకు సాంకేతిక విభాగం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన కార్నాటిక్ రాక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. దీనికి తోడు అద్భుతమైన ఫైట్ కొరియోగ్రఫీ, కంబాట్ సీక్వెన్స్ ప్రేక్షకులకు నూటికి నూరు శాతం పైసా వసూల్ వినోదాన్ని అందిస్తాయి.
డైరెక్టర్ నందినీ రెడ్డి తన టేకింగ్ తో మరోసారి మాయ చేసింది. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ వీకెండ్‌లో హోమ్ థియేటర్లలో ఈ విజువల్ వండర్‌ను హ్యాపీగా ఆస్వాదించవచ్చు.