Samantha Pregnancy: సమంత రూత్ ప్రభు లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ డ్రామా 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ దగ్గర రూ.80 కోట్ల మార్కును దాటేసి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ మీట్‌లో తను ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ చెప్పి సామ్ అందరికీ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైమ్‌లోనే సమంత కడుపుతో ఉందనే నిజం తనకు తెలిసి షాకయ్యానని డైరెక్టర్ నందిని రెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది.
'తస్సాదియ్యా' సాంగ్ షూట్‌లో ఊహించని ట్విస్ట్
"మేము సినిమాలో ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండే 'తస్సాదియ్యా' సాంగ్ షూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఆర్టిస్టులు అందరూ సెట్స్‌లో రెడీగా ఉన్నారు. జనరల్‌గా సమంత ఎప్పుడూ టైమ్‌కే వస్తుంది. కానీ ఆ రోజు ఉదయం సామ్ హెల్త్ అస్సలు బాలేదని, ఉదయాన్నే అనారోగ్యంతో బాధపడుతోందని టీమ్ మెంబర్స్ చెప్పారు. జ్వరం ఏమైనా వచ్చిందేమో అనుకున్నాను. నాలుగు రోజుల్లో ప్లాన్ చేసిన ఈ సాంగ్‌ను కేవలం రెండు రోజుల్లోనే కంప్లీట్ చేయగలమా అని వాళ్లు నన్ను అడిగారు. సామ్ ఎలాగోలా కష్టపడి ఆ రోజు షూటింగ్‌లో పాల్గొంది" అని నందిని రెడ్డి ఆనాటి విషయాలను గుర్తుచేసుకుంది.
ప్రెగ్నెంట్ అని చెప్పగానే షాక్‌తో ఫ్రీజ్ అయిపోయా
మరుసటి రోజు ఉదయం సమంత సెట్స్‌కి రాగానే హెల్త్ ఎలా ఉందో కనుక్కుందామని నందిని రెడ్డి వెళ్ళింది. అప్పుడు సామ్ ఎవరికీ వినపడకుండా నెమ్మదిగా తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని డైరెక్టర్‌కు చెప్పేసింది. ఆ మాట వినగానే ఒక్క నిమిషం పాటు మైండ్ బ్లాంక్ అయిపోయి, చేష్టలు ఉడిగిపోయానని నందిని రెడ్డి తెలిపింది.
ఈ హ్యాపీ న్యూస్ అప్పుడే సెట్స్‌లో ఎవరికీ చెప్పవద్దని సమంత రిక్వెస్ట్ చేసిందట. దాంతో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ దగ్గరకు వెళ్లి, సామ్‌తో ఎక్కువ రిహార్సల్స్ చేయించవద్దని, డైరెక్ట్ టేక్‌లోనే ఎనర్జీ చూపించేలా ప్లాన్ చేయమని సీక్రెట్‌గా రిక్వెస్ట్ చేసినట్లు నందిని చెప్పింది.
ప్రెగ్నెన్సీ టైమ్‌లో కార్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్
{{/usCountry}}ఈ హ్యాపీ న్యూస్ అప్పుడే సెట్స్‌లో ఎవరికీ చెప్పవద్దని సమంత రిక్వెస్ట్ చేసిందట. దాంతో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ దగ్గరకు వెళ్లి, సామ్‌తో ఎక్కువ రిహార్సల్స్ చేయించవద్దని, డైరెక్ట్ టేక్‌లోనే ఎనర్జీ చూపించేలా ప్లాన్ చేయమని సీక్రెట్‌గా రిక్వెస్ట్ చేసినట్లు నందిని చెప్పింది.
ప్రెగ్నెన్సీ టైమ్‌లో కార్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్
{{/usCountry}}కేవలం సాంగ్ మాత్రమే కాదు, ఆ తర్వాత సినిమాలో వచ్చే ఒక ఇంటెన్స్ కార్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా సమంత ప్రెగ్నెన్సీతోనే పూర్తి చేసింది. సామ్‌కు ఎలాంటి ఒత్తిడి కలగకూడదని నందిని రెడ్డి షూటింగ్ షెడ్యూల్‌ను మధ్యాహ్నం 3:30 తర్వాత ప్లాన్ చేసింది.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే హెల్త్ పాడవుతుందని ఈ జాగ్రత్తలు తీసుకుంది. సమంత డెడికేషన్‌కు థ్యాంక్స్ చెబుతూ, ప్రస్తుతం సామ్ తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి డిసెంబర్‌లో పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోందని నందిని రెడ్డి ఎమోషనల్ అయింది.