Samantha Baby Bump: స్టార్ యాక్ట్రెస్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రెగ్నెన్సీ వార్తలు వైరల్ గా మారిన నేపథ్యంలో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. సమంత బేబీ బంప్ తో ఉన్న పిక్ ఒక్కటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఫన్నీ క్యాప్షన్ తో సామ్ ఈ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్టు చేసింది.
సామ్ బేబీ బంప్ ఫొటో

ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోవడమే కాకుండా, తన వ్యక్తిగత జీవితంలోనూ అత్యంత సంతోషకరమైన క్షణాలను ఎంజాయ్ చేస్తోంది సమంత. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాను ప్రెగ్నెంట్ (Pregnant) అనే విషయాన్ని అధికారికంగా ధృవీకరించడమే కాకుండా, ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ బంప్ ఫోటోను సామ్ షేర్ చేసింది.
నా సిక్స్ ప్యాక్
సమంత తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన గర్భాన్ని చూపిస్తూ దిగిన ఒక క్యూట్ ఫోటోను పోస్ట్ చేసింది. తన ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే సమంత.. ఈ ఫోటోకు చాలా ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చింది.
"నా సిక్స్ ప్యాక్.. నేను నిన్ను చూడాల్సిన సమయంలో చూస్తాను (My six-pack. I'll see you when I see you)" అంటూ తన ప్రెగ్నెన్సీని ఉద్దేశించి సమంత రాసుకొచ్చింది. సమంత పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మా ఇంటి బంగారం సక్సెస్ మీట్‌లో
ఇటీవల సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ సమయంలోనే సమంత ప్రెగ్నెన్సీపై రూమర్స్ రాగా, ఆ తర్వాత జరిగిన ప్రెస్మీట్లో ఆమె వీటికి పూర్తి క్లారిటీ ఇచ్చింది.
{{/usCountry}}ఇటీవల సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ సమయంలోనే సమంత ప్రెగ్నెన్సీపై రూమర్స్ రాగా, ఆ తర్వాత జరిగిన ప్రెస్మీట్లో ఆమె వీటికి పూర్తి క్లారిటీ ఇచ్చింది.
{{/usCountry}}"మా ఇంటి బంగారం సినిమా తర్వాత, నా ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా నేను నటనకు చిన్న బ్రేక్ తీసుకోబోతున్నాను. నేను మెటర్నిటీ బ్రేక్ తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత మళ్లీ నా అభిమానుల కోసం సరికొత్త సినిమాతో తిరిగి వస్తా" అని సమంత పేర్కొంది.
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి
సమంత, రాజ్ నిడిమోరు డిసెంబర్ 1, 2025న కోయంబత్తూరులోని సద్గురు ఈశా ఫౌండేషన్‌లో అత్యంత ఆత్మీయుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ గతంలో సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి ప్రాజెక్ట్‌లకు కలిసి పనిచేశారు. వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ సమయంలో చెన్నై సూపర్ చాంప్స్ జట్టుకు మద్దతుగా వీరిద్దరూ కలిసి కనిపించడంతో వీరి ప్రేమాయణంపై మొదట రూమర్స్ వచ్చాయి.