అవసరమైతే నీ సలహా అడుగుతా లే..: తనను మరీ సన్నగా ఉన్నావన్న నెటిజన్‌కు సమంత కౌంటర్.. బీస్ట్ మోడ్ పోస్ట్ వైరల్
సమంత రూత్ ప్రభు తన కండలు చూపిస్తూ చేసిన పోస్ట్ పై వచ్చిన నెగటివ్ కామెంట్లకు గట్టిగానే బదులిచ్చింది. జిమ్‌లో ఆమె ఇచ్చిన పోజులపై ఓ వ్యక్తి చాలా సన్నగా ఉన్నావంటూ కామెంట్ చేశాడు. దానికి సామ్ గట్టిగానే రిప్లై ఇచ్చింది.
నటి, నిర్మాత సమంత రూత్ ప్రభు తన ఫిట్‌నెస్ ప్రయాణంలో క్రమశిక్షణ, అంకితభావం ప్రధానమని మరోసారి నిరూపిస్తోంది. ఇంటెన్స్ వర్కౌట్‌లు, తన సూపర్ ఫిగర్ మెయింటేన్ చేస్తుందన్న పేరు తెచ్చుకున్న సమంత శుక్రవారం (నవంబర్ 21) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. బలమైన బ్యాక్ తనకు ఎప్పటికీ ఉండదని తాను నమ్మినా.. కఠినమైన శిక్షణ ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేసిందని ఆమె చెప్పింది. అయితే ఈ పోస్టుపై "చాలా సన్నగా కనిపిస్తున్నారు" అని వ్యాఖ్యానించిన ఒక ట్రోల్‌కు సమంత ఘాటుగా సమాధానం ఇచ్చింది.

సమంత పోస్ట్ ఇదీ..
తాను కష్టపడి సాధించిన బ్యాక్ మజిల్స్ ను చూపిస్తూ ఒక ఫోటోను పంచుకున్న సమంత ఇలా క్యాప్షన్ ఇచ్చింది. "కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఎప్పటికీ బలమైన బ్యాక్ రాదనే నిర్ణయానికి వచ్చేసాను. అది నా జీన్స్‌లో లేదని నిజంగా అనుకునేదాన్ని. వేరే వాళ్లకు మంచి బ్యాక్ చూసినప్పుడు 'అవును అది నాకు అసాధ్యం' అనుకునేదాన్ని. కానీ నేను తప్పు. నిజంగా, నేను తప్పు అని నిరూపించినందుకు సంతోషంగా ఉంది"
"అందుకే ఇప్పుడు దాన్ని చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ స్థాయికి రావడానికి చేసిన శ్రమ తీవ్రమైనది. చాలా తీవ్రమైనది. చేయాలని అనిపించని రోజుల్లో కూడా వర్కౌట్‌కు రావడం, ఏదీ మారనట్లు కనిపించినా కొనసాగించడం, వదిలేయడం తేలికైనప్పటికీ వదలకపోవడం చేశాను. కండరాలను నిర్మించుకోవడం చాలా ముఖ్యం"
"ఇది మీరు ఎలా కనిపిస్తారు అనే దానికోసం మాత్రమే కాదు. మీరు ఎలా జీవిస్తారు, ఎలా కదులుతారు, వృద్ధాప్యంలో ఎలా ఉంటారు అనే దానిపై కూడా ప్రభావం చూపిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీ బెస్ట్ ఫ్రెండ్ కావాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ నాకు అన్నిటికంటే ఎక్కువ సహాయం చేసింది.
ఇది నాకు క్రమశిక్షణ, ఓర్పును నేర్పింది. 'జీన్స్‌లో లేదు' అనేది కేవలం ఒక సాకు. మనకు మనం తప్పు అని నిరూపించుకునే వరకు దాన్ని పదే పదే చెప్పుకుంటాం. మీరు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, వదిలేయకండి. మీరు కొనసాగించినందుకు మీ భవిష్యత్తు మిమ్మల్ని మెచ్చుకుంటుంది" అని సమంత సుదీర్ఘ క్యాప్షన్ ఉంచింది.
ట్రోల్‌కు సమంత రిప్లై
సమంత అంకితభావాన్ని, పట్టుదలను చాలా మంది ప్రశంసిస్తుండగా.. ఒక వ్యక్తి మాత్రం.. "ఒకరు మరీ ఇంత సన్నగా కనిపించేంతగా వ్యాయామం చేయకూడదు" అని వ్యాఖ్యానించారు. దానికి సమంత వెంటనే స్పందిస్తూ.. "నాకు మీ సలహా అవసరమైనప్పుడు అడుగుతాను" అని ఘాటుగా సమాధానం ఇచ్చింది.
ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే.. ఈ మధ్యే 'శుభం' చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఆమె రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ షోలో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బి, జైదీప్ అహ్లావత్ వంటి నటులు కూడా ఉన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సిరీస్ 2026లో ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది. ఇక తెలుగు మూవీ మా ఇంటి బంగారం కూడా ఆమె చేస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


