Samantha Baby Boy: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. సమంత, ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. గురువారం (నవంబర్ 19, 2026) సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో అటు సినీ ఇండస్ట్రీలోనూ, ఇటు అభిమానుల్లోనూ సంబరాలు మొదలయ్యాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్

తమ జీవితంలోకి వచ్చిన కొత్త అతిథికి స్వాగతం పలుకుతూ సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ అందమైన పోస్ట్ షేర్ చేశారు. తమ చిన్నారి చేతిని పట్టుకున్న తొలి ఫోటోను పంచుకుంటూ.. "మా అందమైన మగబిడ్డ.. దేవ్ నిడిమోరు (DEV NIDIMORU).. 19.11.2026. మా హృదయాలు ఇంత ఆనందంగా ఎప్పుడూ లేవు. - సమంత & రాజ్" అంటూ ఎమోషనల్ క్యాప్షన్ రాశారు.
ఈ పోస్ట్ చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు కొత్త తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా కొడుకు పేరును దేవ్ నిడిమోరు అని కూడా ప్రకటించేశారు.
పెళ్లి నుంచి మాతృత్వం వరకు..
'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' ప్రాజెక్టులతో మొదలైన సమంత, రాజ్ నిడిమోరుల పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ గతేడాది డిసెంబర్ 1, 2025న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో ఉన్న లింగ భైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు.
ఆ తర్వాత ఈ ఏడాది జూన్‌లో తన సొంత బ్యానర్‌పై నిర్మించి నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్లో సమంత తన ప్రెగ్నెన్సీని అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్‌లో కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లోనే సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుక జరుపుకున్నారు. డెలివరీకి కొన్ని రోజుల ముందు కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఫోటోలను సమంత షేర్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సినిమాలకు చిన్న బ్రేక్..
ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న సమంత.. సినిమాలకు కొంతకాలం మెటర్నిటీ బ్రేక్ తీసుకున్నారు. 'మా ఇంటి బంగారం' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. ఈ విరామం తర్వాత ఆమె 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్' (Rakt Brahmand: The Bloody Kingdom) సిరీస్‌తో పాటు కొత్త ప్రాజెక్టులతో మళ్లీ అభిమానులను అలరించడానికి సిద్ధం కానున్నారు.
{{/usCountry}}ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న సమంత.. సినిమాలకు కొంతకాలం మెటర్నిటీ బ్రేక్ తీసుకున్నారు. 'మా ఇంటి బంగారం' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. ఈ విరామం తర్వాత ఆమె 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్' (Rakt Brahmand: The Bloody Kingdom) సిరీస్‌తో పాటు కొత్త ప్రాజెక్టులతో మళ్లీ అభిమానులను అలరించడానికి సిద్ధం కానున్నారు.
{{/usCountry}}