...
...
Next Story

Samantha: ఎన్నో చెత్త సినిమాలు చేశాను.. అదంతా ఓ భ్రమ అని తెలుసుకున్నా.. కెరీర్ ముగిసిపోయిందనుకున్నా: సమంత కామెంట్స్

Samantha: స్టార్ హీరోయిన్ సమంత తన లైఫ్ లో ఎదుర్కొన్న మోస్ట్ ఛాలెంజింగ్ ఫేజ్ గురించి ఎమోషనల్ గా ఓపెన్ అయ్యారు. ఒకానొక టైమ్ లో తన సినిమా కెరీర్ పూర్తిగా ముగిసిపోయిందని భావించిన సమంత.. ఆ తర్వాత ఎలా కోలుకున్నానో, ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టడానికి కారణమేంటన్నది వివరించారు.

Published on: Jun 15, 2026, 14:14:01 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Samantha: సినిమాలకు కొంతకాలం పాటు బ్రేక్ తీసుకున్న స్టార్ హీరోయిన్ సమంత.. తన లైఫ్, కెరీర్ లోని అత్యంత కష్టమైన రోజులను గుర్తుచేసుకున్నారు. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్న టైమ్ లో.. తాను మళ్లీ స్క్రీన్ పై కనిపిస్తానా లేదా అనే నమ్మకం కూడా తనకు లేదని ఆమె ఓపెన్ గా చెప్పారు. అయితే ఆ బ్రేక్ తర్వాత ఆమె మళ్లీ వెండితెరపైకి రావడం కేవలం కమ్‌బ్యాక్ మాత్రమే కాదు.. జీవితంపై తనకున్న అభిప్రాయాన్నే మార్చేసిన ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ గా మారింది.

Tralala Moving Pictures | సొంత ప్రొడక్షన్ హౌస్ వెనుక అసలు రహస్యం

Samantha: ఎన్నో చెత్త సినిమాలు చేశాను.. అదంతా ఓ భ్రమ అని తెలుసుకున్నా.. కెరీర్ ముగిసిపోయిందనుకున్నా: సమంత కామెంట్స్
Samantha: ఎన్నో చెత్త సినిమాలు చేశాను.. అదంతా ఓ భ్రమ అని తెలుసుకున్నా.. కెరీర్ ముగిసిపోయిందనుకున్నా: సమంత కామెంట్స్

సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ జూన్ 19న థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ మూవీ ప్రమోషన్లలో ఆమె బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ లాంగ్ బ్రేక్ తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని, తన సొంత నిబంధనలతో లైఫ్ లీడ్ చేసే కాన్ఫిడెన్స్ ను ఇచ్చిందని సమంత పలు సందర్భాల్లో చెప్పారు. ఈ కొత్త చాప్టర్ లో ఆమె తీసుకున్న అతిపెద్ద అడుగు.. తన సొంత ప్రొడక్షన్ హౌస్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' (Tralala Moving Pictures) స్థాపించడం. నటిగా పరిమితం కాకుండా క్రియేటివ్ సైడ్ తన కలలను నిజం చేసుకోవడానికి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సమంత ఆలోచనలు, ఆమె భర్త.. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (రాజ్ అండ్ డీకే ఫేమ్) రీసెంట్ గా షేర్ చేసిన వ్యూస్ కి పర్ఫెక్ట్ గా సింక్ అవుతున్నాయి.

అదంతా భ్రమ అని తెలుసుకున్నా..

ఇదే ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. తన కెరీర్లో తాను ఎన్నో చెత్త సినిమాలు చేసినట్లు కూడా అంగీకరించారు. ఇక కెరీర్ మొదట్లో ఇదో రేసులాగా, ఓ పోటీలాగా భావించానని, ఇన్నేళ్ల తర్వాత అదంతా ఓ భ్రమ అని తెలుసుకున్నట్లు తెలిపారు. అయితే తనకు ఎప్పుడూ సినిమాలపై ప్రేమ తగ్గలేదని, ఎక్కడో ఓ మారుమూల ఊరు నుంచి వచ్చిన తనకు ఓ స్టార్ డమ్ ఇచ్చింది సినిమాలే అని సమంత అభిప్రాయపడ్డారు.

భర్త బాటలోనే సమంత.. క్రియేటివ్ ఫ్రీడమ్ కోసం..

ఒక రకంగా చూస్తే సమంత, రాజ్ ఇద్దరూ కూడా ఒకే కేటగిరీకి చెందిన ఆర్టిస్టులుగా కనిపిస్తున్నారు. కేవలం యాక్టర్ గానో, డైరెక్టర్ గానో ఉండిపోకుండా.. నిర్మాతగా మారినప్పుడే అసలైన అర్థం, స్వేచ్ఛ దొరుకుతుందని వీరిద్దరూ నమ్మారు. ఒక ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేయడం అనేది కేవలం బిజినెస్ నిర్ణయం మాత్రమే కాదు.. అది మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడానికి, ఇండిపెండెంట్ గా ఎదగడానికి ఒక అద్భుతమైన మార్గం అని వీరిద్దరి జర్నీ ప్రూవ్ చేస్తోంది.

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సరికొత్త ఫ్యామిలీ థ్రిల్లర్ 'మా ఇంటి బంగారం' (Ma Inti Bangaram) రూపొందింది. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఈ శుక్రవారం (జూన్ 19) థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

హెచ్‌టీ విశ్లేషణ

ఒక యాక్టర్ గా పీక్స్ చూసిన తర్వాత సమంత ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టడం చాలా తెలివైన నిర్ణయం. రాజ్ నిడిమోరు ఇప్పటికే బాలీవుడ్, డిజిటల్ స్పేస్ లో (ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ సిరీస్ లతో) పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఈ శుక్రవారం రాబోతున్న 'మా ఇంటి బంగారం' సినిమాకు ఈ ప్రొడక్షన్ బ్యాక్‌గ్రౌండ్, సమంత ఓపెన్ టాక్ చాలా పెద్ద ప్లస్ కానున్నాయి.

People Also Ask (FAQs)

సమంత స్థాపించిన సొంత ప్రొడక్షన్ హౌస్ పేరు ఏంటి?

సమంత క్రియేటివ్ ఫ్రీడమ్ కోసం స్థాపించిన తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ పేరు 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' (Tralala Moving Pictures).

నిర్మాతగా మారడంపై సమంత, రాజ్ నిడిమోరుల అభిప్రాయాలు ఏంటి?

కేవలం యాక్టింగ్, డైరెక్షన్ కే పరిమితం కాకుండా నిర్మాతగా మారినప్పుడే ఒక ఆర్టిస్ట్ గా అసలైన క్రియేటివ్ ఫ్రీడమ్, లైఫ్ పర్పస్ దొరుకుతుందని వీరిద్దరూ నమ్ముతున్నారు.

సమంత, రాజ్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ సినిమా ఏంటి?

వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ 'మా ఇంటి బంగారం' ఈ శుక్రవారం (జూన్ 19, 2026) థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks