Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) సినిమాతో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎలాంటి కమర్షియల్ హంగులు, పెద్ద హీరోల సపోర్ట్ లేకుండా కేవలం తన వన్ మ్యాన్ షోతో ఈ సినిమాను ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్లబ్‌లో నిలబెట్టి టాలీవుడ్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది.

ఈ అద్భుతమైన సక్సెస్ ఫుల్ జర్నీపై సమంత రీసెంట్‌గా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ 'వెరైటీ ఇండియా' (Variety India) ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను షేర్ చేసుకుంది. తన భర్త, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి ఈ సినిమాను సమంత స్వయంగా ప్రొడ్యూస్ చేయడం విశేషం.
ఒక్క టికెట్ అయినా అమ్ముడవుతుందో లేదో అని భయపడ్డాం
ఈ రేంజ్ సక్సెస్ సాధించడంపై సమంత స్పందిస్తూ.. ఈ విజయం అందించిన కిక్ తనే ఇంకా నమ్మలేకపోతున్నట్లు చెప్పింది. సినిమా ఇండస్ట్రీ ప్రస్తుత పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని, ఏ సినిమా ఆడుతుందో ఏది ఫ్లాప్ అవుతుందో ఎవరూ గెస్ చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
"మేము ఈ సినిమాను చాలా టైట్ బడ్జెట్‌తో ప్లాన్ చేశాం. షూటింగ్ రోజులు తగ్గించడానికి రాత్రి పగలు కష్టపడ్డాం. నిజం చెప్పాలంటే థియేటర్లలో రిలీజ్ అయ్యే ముందు కనీసం ఒక్క టికెట్ అయినా అమ్ముడవుతుందో లేదో అని నేను, రాజ్ చాలా టెన్షన్ పడ్డాం. పెట్టిన బడ్జెట్ వెనక్కి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. కానీ మంచి ఉద్దేశంతో ఒక కంటెంట్ నమ్మి సినిమా తీస్తే దేవుడే సక్సెస్ ఇస్తాడని ఈ సినిమాతో ప్రూవ్ అయింది" అని సమంత ఎమోషనల్ అయింది.
బస్సు యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్.. ఒకే రోజులో షూటింగ్
ఈ సినిమాలో నటించడం శారీరకంగా, మానసికంగా తనకు పెద్ద ఛాలెంజ్ అని సమంత పేర్కొంది. ఒక కొత్త ప్రయోగం చేయాలనుకున్నప్పుడు రిస్క్ తీసుకోవడానికి వెనకాడకూడదని, సగం సగం ప్రయత్నాలు చేస్తే రిజల్ట్ రాదని క్లారిటీ ఇచ్చింది. సినిమా కోసం రోజుకు 12 గంటలకు పైగా షిఫ్ట్‌లు పనిచేసినట్లు తెలిపింది.
{{/usCountry}}ఈ సినిమాలో నటించడం శారీరకంగా, మానసికంగా తనకు పెద్ద ఛాలెంజ్ అని సమంత పేర్కొంది. ఒక కొత్త ప్రయోగం చేయాలనుకున్నప్పుడు రిస్క్ తీసుకోవడానికి వెనకాడకూడదని, సగం సగం ప్రయత్నాలు చేస్తే రిజల్ట్ రాదని క్లారిటీ ఇచ్చింది. సినిమా కోసం రోజుకు 12 గంటలకు పైగా షిఫ్ట్‌లు పనిచేసినట్లు తెలిపింది.
{{/usCountry}}"సినిమాలోని అత్యంత కీలకమైన బస్సు యాక్షన్ సీక్వెన్స్, కొన్ని ఫిల్లర్ సీన్లు, దాంతో పాటు మెయిన్ క్లైమాక్స్ ఎపిసోడ్‌ను మేము ఒకే ఒక్క రోజులో షూట్ చేసేశాం. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత ఎక్కడైనా చిన్న తప్పు జరిగితే 'అయ్యో ఇంకా బాగా చేసి ఉండాల్సింది' అని బాధపడటం నాకు ఇష్టం లేదు. అందుకే యాక్టింగ్ నుంచి ప్రమోషన్స్ వరకు నా వంద శాతం కష్టపడ్డాను" అని సమంత చెప్పుకొచ్చింది.
రాజ్ నిడిమోరు మేకింగ్ స్టైల్.. సమంత కెరీర్ బెస్ట్ కమ్‌బ్యాక్
రాజ్ అండ్ డీకే ఫేమ్ రాజ్ నిడిమోరు ఈ సినిమాకు తన మార్క్ కథ అందించారు. ఇక నందినీ రెడ్డి డైరెక్షన్ మరో లెవెల్. హాలీవుడ్ లెవెల్ సినిమాటోగ్రఫీ, గుండెకు హత్తుకునే ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.
'ది ఫ్యామిలీ మ్యాన్', సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ల తర్వాత సమంత, రాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఆడియన్స్‌కు ఒక పర్ఫెక్ట్ విజువల్ ట్రీట్ ఇచ్చింది. సమంత కెరీర్‌లోనే ఇదొక బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ ఫిల్మ్‌గా నిలిచిపోవడం గ్యారెంటీ అని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.