...
...
Next Story

ఎన్నో బాధలు అనుభవించాను.. మా కుటుంబం పూట గడవడానికి ఇబ్బంది పడింది.. నేను సెక్సీగా ఉంటానని ఆ పాట చేయలేదు: సమంత కామెంట్స్

సమంత రూత్ ప్రభు తన వ్యక్తిగత జీవితంలో పడిన బాధలు, ప్రతిసారీ సమాజం నుంచి ఎదురయ్యే జడ్జిమెంట్ల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. విడాకులు, అనారోగ్యంలాంటి ఎన్నో బాధలను తాను అనుభవించినట్లు ఆమె చెప్పింది.

Published on: Oct 17, 2025, 20:56:20 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

నటి సమంత రూత్ ప్రభు తన వ్యక్తిగత జీవితంలో పడిన బాధలను.. ముఖ్యంగా విడాకులు, మయోసైటిస్ వంటి అంశాలపై మాట్లాడింది. ఎప్పుడూ ప్రజల జడ్జిమెంట్ కు గురవడం, ట్రోలింగ్‌ల గురించి ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో మాట్లాడింది. తాను తప్పులు చేస్తుండొచ్చని, అయితే ఇంకా మెరుగవడానికే ప్రయత్నిస్తున్నానని ఆమె చెప్పింది.

సమంత ఏమన్నదంటే?

ఎన్నో బాధలు అనుభవించాను.. మా కుటుంబం పూట గడవడానికి కూడా ఇబ్బంది పడింది.. నేను సెక్సీగా ఉంటానని అనుకోను: సమంత కామెంట్స్ (PTI)
ఎన్నో బాధలు అనుభవించాను.. మా కుటుంబం పూట గడవడానికి కూడా ఇబ్బంది పడింది.. నేను సెక్సీగా ఉంటానని అనుకోను: సమంత కామెంట్స్ (PTI)

నటి సమంత రూత్ ప్రభు ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో మాట్లాడింది. మాజీ భర్త నాగ చైతన్యతో విడిపోవడం దగ్గర నుంచి, అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి అయిన మయోసైటిస్‌తో పడిన ఇబ్బందుల వరకు తన జీవిత ప్రయాణం తెరిచిన పుస్తకంలాగానే సాగిందని ఆమె వివరించింది.

సమంత మాట్లాడుతూ.. "నా ప్రయాణంలో చిన్న భాగాన్ని అనుసరించిన ఎవరికైనా నా వ్యక్తిగత బాధల గురించి బాగా తెలుసు. విడాకులు, నా అనారోగ్యం.. ప్రతిదీ అందరికీ తెలిసే జరిగింది. దీని వల్ల చాలా పర్యవసానాలు, విపరీతమైన ట్రోలింగ్, అనేక జడ్జిమెంట్లు ఎదుర్కొన్నాను. మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇలాగే జడ్జ్ చేస్తారు" అని ఆవేదన వ్యక్తం చేసింది.

పర్ఫెక్ట్ అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు

38 ఏళ్ల సమంత.. తన జీవితంలో ప్రతిదీ అన్నీ చక్కదిద్దుకున్నట్లుగా, పరిపూర్ణంగా ఉన్నట్లుగా చూపించుకోవడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. "ప్రామాణికత (authenticity) అనేది ఒక అంతిమ గమ్యస్థానం అని నేను అనుకోవడం లేదు. ఇది నిరంతరంగా కొనసాగుతున్న ఒక ప్రక్రియ. నా జీవితంలో ప్రతిదీ సెట్ కాలేదు. కానీ నేను దాని గురించి మాట్లాడగలుగుతున్నాను. నేను పరిపూర్ణంగా లేను. తప్పులు చేయవచ్చు, తడబడవచ్చు. కానీ, నేను మెరుగ్గా మారడానికి ప్రయత్నిస్తున్నాను" అని సమంత స్పష్టం చేసింది.

బాధ్యత అవసరం

వ్యక్తిగతంగా తనకు చాలా ఆంబిషన్ ఉందని, అయితే అది తప్పనిసరిగా ఒక ఉద్దేశం, బాధ్యతతో కూడినదై ఉండాలని ఆమె చెప్పింది. "అందుకే ఈ రోజుల్లో యువత తమ మార్గదర్శకులను జాగ్రత్తగా ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది వారి మొత్తం జీవితాన్ని మార్చగలదు. అది వారి మానసిక ఆరోగ్యం ఎంత స్థిరంగా ఉంటుందో, వారు ఎలాంటి కలలు కనగలరో, ఇతరుల వైఫల్యాల నుండి వారు ఏమి నేర్చుకోగలరో నిర్ణయించగలదు" అని ఆమె పేర్కొంది.

స్టార్‌డమ్ అలా మార్చేసింది

సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన తాను 2010లో వచ్చిన తన తొలి తెలుగు హిట్ చిత్రం 'ఏ మాయ చేశావే'తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోవడం గురించి కూడా నటి సమంత మాట్లాడింది. "నా దగ్గర ఏమీ ఉండేది కాదు. మా కుటుంబం కనీసం పూట గడపడానికి కూడా కష్టపడింది. నా మొదటి సినిమాతోనే అంతా మారిపోయింది. నేను రాత్రికి రాత్రే స్టార్‌ని అయ్యాను.

పేరు, కీర్తి, సంపద, ప్రశంసలు వచ్చాయి. నిజం చెప్పాలంటే వాటితో ఏమి చేయాలో నాకు తెలియదు. ఎందుకంటే నిజాయితీ అనేది మీ పెంపకానికి సంబంధించినది అని నేను అనుకుంటున్నాను. ఆ పెంపకంతో మీరు బ్యాలెన్స్‌గా లేకపోతే గందరగోళం ఏర్పడవచ్చు" అని సమంత చెప్పింది.

అందుకే ఆ ఊ అంటావా పాట

అల్లు అర్జున్ నటించిన 2021 బ్లాక్‌బస్టర్ 'పుష్ప: ది రైజ్' చిత్రంలోని బాగా పాపులర్ అయిన 'ఊ అంటావా' పాటలో తన నటనతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది సమంత. అయితే ఒక ఆర్టిస్టుగా తనను తాను సవాలు చేసుకోవడానికి ఆ పాటను అంగీకరించానని చెప్పింది.

"నేను చేయగలనో లేదో చూడటానికి 'ఊ అంటావా' చేశాను. అది నేను నాకిచ్చుకున్న ఒక సవాలు. నన్ను నేను ఎప్పుడూ సెక్సీగా భావించలేదు. నాకు 'బోల్డ్ రోల్' ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అది కేవలం ఒకేసారి చేసిన విషయం" అని ఆమె స్పష్టం చేసింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe