Samantha Seemantham: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా సీమంతం వేడుక జరుపుకున్నారు. శ్రీవిద్య సంప్రదాయంలో ప్రత్యేకమైన 'కళా ఆవరణ' (శ్రీ కల్పం) పూజను వేద పండితుల సమక్షంలో నిర్వహించిన ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీవిద్య సంప్రదాయంలో సీమంతం పూజ.. సమంత ఎమోషనల్

సమంత తన సీమంతం పూజకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ పూజ సమయంలో ఆమె లేత ఆరెంజ్ కలర్ చుడీదార్ ధరించి, పూలమాల వేసుకుని కనిపించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆమెపై పవిత్ర జలాలను ప్రోక్షించారు.
ఈ వేడుక గురించి సమంత రాస్తూ.. "మన ఆచార వ్యవహారాలపై నాకు ఎప్పుడూ అమితమైన గౌరవం ఉంటుంది. ఈ పూజ వెనుక ఉన్న లోతైన అర్థం పూర్తిగా తెలియకపోయినా, మంత్రాల ధ్వనిలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుందని నేను బలంగా నమ్ముతాను" అని పేర్కొన్నారు.
'కళా ఆవరణ' పూజ ప్రత్యేకత ఏంటి?
ఈ వేడుకలో శ్రీవిద్య ఉపాసకులు ప్రతి ఘట్టాన్ని వివరిస్తూ పూజ చేశారని సమంత తెలిపారు. ఈ సంప్రదాయంలో ప్రతి మంత్రానికి, ప్రతి నివేదనకు ఒక ప్రత్యేకమైన పరమార్థం ఉంటుందని ఆమె వివరించారు.
'కళా ఆవరణ' (శ్రీ కల్పం) అనేది శ్రీవిద్య సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఘట్టం. భావి తల్లి శరీరంలోని ఏడు చక్రాల ద్వారా దేవికి ఉన్న 94 కళలను ఆవాహన చేస్తారు. పవిత్ర జలాలు, మంత్రాలతో చక్రాలను శుద్ధి చేసి దివ్య శక్తిని నింపుతారు.
"దేవతా స్వరూపంగా భావించడం నా మనసును తాకింది"
ఈ పూజలో నవజాత శిశువును మోస్తున్న తల్లిని స్వయంగా దేవీ స్వరూపంగా భావించి పూజించడం తనను ఎంతగానో కదిలించిందని సమంత చెప్పారు. ఒక కొత్త జీవికి ప్రాణం పోసే సృష్టికర్తగా మహిళను గౌరవించడం ఈ వేడుక ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
{{/usCountry}}ఈ పూజలో నవజాత శిశువును మోస్తున్న తల్లిని స్వయంగా దేవీ స్వరూపంగా భావించి పూజించడం తనను ఎంతగానో కదిలించిందని సమంత చెప్పారు. ఒక కొత్త జీవికి ప్రాణం పోసే సృష్టికర్తగా మహిళను గౌరవించడం ఈ వేడుక ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
{{/usCountry}}అభిషేకం పూర్తయిన తర్వాత తల్లిని శ్రీ చక్ర యంత్రం మధ్యలో కూర్చోబెడతారు. దేవీ ఖడ్గమాలను పఠిస్తూ తొమ్మిది ఆవరణల్లోని దేవతలను ఆహ్వానిస్తారు. వెలుపలి నుంచి కేంద్రం వైపు సాగే ఈ జపం మనసును ఆధ్యాత్మికంగా ప్రశాంతపరుస్తుందని సమంత తెలిపారు.
'మా ఇంటి బంగారం'తో భారీ కంబ్యాక్
సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన ఆరోగ్య సమస్యతో పోరాడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినిమాలకు కొంత కాలం గ్యాప్ ఇచ్చిన ఆమె, నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'మా ఇంటి బంగారం' సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు.
రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, మంజూషా ముక్కవిల్లి, దిగంత్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ రూ.100 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూలు చేసి, టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ఫిమేల్ లీడ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
రాజ్ నిడిమోరుతో ప్రేమ, పెళ్లి, ప్రెగ్నెన్సీ
సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుల బంధం 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' ప్రాజెక్ట్‌లతో మరింత బలపడింది. ఆ తర్వాత కోయంబత్తూర్ లోని ఈషా యోగా సెంటర్‌లో లింగ భైరవి పద్ధతిలో యోగిక్ శైలిలో వీరి వివాహం జరిగింది.
'మా ఇంటి బంగారం' సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత సమంత తన ప్రెగ్నెన్సీ వార్తను అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు సంప్రదాయబద్ధంగా సీమంతం పూర్తి కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.