Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు లీడ్ రోల్ లో నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) బాక్సాఫీస్ దగ్గర అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టింది. సమంత సోలో కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన ఈ సినిమా.. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ఈ భారీ విజయం వెనుక ఒక రియల్ లైఫ్ మ్యాజిక్ కూడా ఉంది. ఈ చిత్రానికి సమంత భర్త, హిట్ మేకర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru) కథ అందించడమే కాకుండా.. సమంతతో కలిసి ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ కు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రేజీ స్టార్ కపుల్ హోమ్ బ్యానర్ లో వచ్చిన ఫస్ట్ థియేట్రికల్ ఫిల్మ్ కావడం.. దీనికి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడంతో ఈ సక్సెస్ సామ్ - రాజ్ జంటకు మరింత స్పెషల్ గా మారింది.
బజ్ లేదు.. ఫీమేల్ సినిమాలకు హైప్ ఉండదన్నారు
ఈ భారీ రెస్పాన్స్ పై రైటర్ కమ్ ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరు మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు.
"రిలీజ్ కు కొన్ని రోజుల ముందు మా కో-ప్రొడ్యూసర్స్ లో ఒకరు ఇండస్ట్రీకి చెందిన ఒకరిని.. సినిమా బజ్ ఎలా ఉంది? అని అడిగారు. దానికి అతను.. 'ఏం బజ్? ఫీమేల్ లీడ్ సినిమాలకు ముందేం హైప్ ఉండదు. థియేటర్లలోకి వచ్చాక టాక్ బాగుంటేనే జనాలు వస్తారు' అని చాలా క్యాజువల్ గా మాట్లాడాడు. ఆ టైమ్ లో అది మాకు కాస్త కఠినమైన నిజంలాగే అనిపించింది. మేము కూడా అలాగే అనుకున్నాం. కానీ ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్ నంబర్స్ చూశాక మాకు అర్థమైంది.. సినిమా ఏదైనా సినిమానే, దానికి మేల్ లేదా ఫీమేల్ అనేది ముఖ్యం కాదు. సమంతకు థియేటర్లకు జనాలను భారీగా రాబట్టే కెపాసిటీ ఉందని ఈ ఓపెనింగ్స్ మరోసారి గుర్తుచేశాయి" అని రాజ్ సంతోషం వ్యక్తం చేశారు.
సినిమా ఇంత పెద్ద హిట్ అయినా, థియేటర్ల బయట ఫ్యాన్స్ హంగామా చేస్తున్నా.. సమంత మాత్రం ఎప్పటిలాగే చాలా గ్రౌండెడ్ గా ఉందట. సాధారణంగా సామ్ ఒక సినిమా సక్సెస్ ను అంత ఈజీగా ఒప్పుకోదు.. 'యస్.. మనం సాధించాం' అని వెంటనే అనదు. కానీ ఈసారి పాజిటివ్ రిజల్ట్ చూసి శని, ఆదివారాల కల్లా.. 'అవును, సినిమా వర్కవుట్ అవుతున్నట్టుంది' అని ఒప్పుకుందని, ఆమె యాక్సెప్టెన్స్ విండో కాస్త తగ్గిందని రాజ్ నవ్వుతూ చెప్పారు.
అలా ఎంజాయ్ చేస్తున్నాను
{{/usCountry}}సినిమా ఇంత పెద్ద హిట్ అయినా, థియేటర్ల బయట ఫ్యాన్స్ హంగామా చేస్తున్నా.. సమంత మాత్రం ఎప్పటిలాగే చాలా గ్రౌండెడ్ గా ఉందట. సాధారణంగా సామ్ ఒక సినిమా సక్సెస్ ను అంత ఈజీగా ఒప్పుకోదు.. 'యస్.. మనం సాధించాం' అని వెంటనే అనదు. కానీ ఈసారి పాజిటివ్ రిజల్ట్ చూసి శని, ఆదివారాల కల్లా.. 'అవును, సినిమా వర్కవుట్ అవుతున్నట్టుంది' అని ఒప్పుకుందని, ఆమె యాక్సెప్టెన్స్ విండో కాస్త తగ్గిందని రాజ్ నవ్వుతూ చెప్పారు.
అలా ఎంజాయ్ చేస్తున్నాను
{{/usCountry}}తమ హోమ్ ప్రొడక్షన్ 'ట్రాలాలా మూవీస్' సక్సెస్ సెలబ్రేషన్స్ గురించి రాజ్ స్పందిస్తూ.. "నా సెలబ్రేషన్స్ చాలా సింపుల్ గా సాగుతున్నాయి. మా టీమ్ తో కలిసి వేర్వేరు థియేటర్లకు వెళ్తూ ఆడియన్స్ ఎగ్జైట్‌మెంట్‌ను లైవ్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నాను. వాటిని ఫోన్ లో షూట్ చేస్తూ ఆ హ్యాపీ మూమెంట్స్ ను స్టోర్ చేసుకుంటున్నాను. ఇక నాలో ఉండే రొటీన్ బోరింగ్ సైడ్ విషయానికొస్తే.. థియేటర్ల నుంచి రూమ్‌కి రాగానే మళ్లీ నా కొత్త కథ రాయడం మొదలుపెట్టేస్తాను" అని తన ఫ్యూచర్ ప్లాన్స్ ను వెల్లడించారు.
వర్కింగ్ డేస్ లోనూ కలెక్షన్ల సునామీ
నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చి జూన్ 19న విడుదలైన ఈ సినిమా.. మొదటి రోజు (శుక్రవారం) ఇండియాలో రూ. 5.35 కోట్ల నెట్ వసూళ్లతో స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది. శని, ఆదివారాల్లో పాజిటివ్ మౌత్ టాక్ తో కలెక్షన్లు భారీగా పెరిగాయి. శనివారం రూ. 7.65 కోట్లు, ఆదివారం రూ. 10.10 కోట్ల నెట్ వసూళ్లతో వీకెండ్ లో సంచలనం సృష్టించింది.
అంతేకాదు సోమవారం (వర్కింగ్ డే) కూడా థియేటర్లలో పట్టు కోల్పోకుండా అదనంగా రూ. 4.10 కోట్ల నెట్ రాబట్టింది. దీంతో కేవలం 4 రోజుల్లోనే ఇండియా టోటల్ నెట్ కలెక్షన్ రూ. 27.20 కోట్లకు చేరుకుంది. లేడీ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమాలకు ఓపెనింగ్స్ రావు అని విమర్శించే వాళ్లకు సమంత తన బాక్సాఫీస్ స్టామినాతో గట్టి సమాధానం చెప్పింది.