ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో 'యోగ' పద్ధతిలో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సమంత బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ క్రేషా బజాజ్ కూడా హాజరైంది. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన క్రేషా.. సమంతకు రాజ్ ఎందుకు సరైన జోడి అనేది అందంగా వివరించింది.
సమంత మనసు తెలిసిన వాడు రాజ్

డిసెంబర్ 1న ఈషా ఫౌండేషన్‌లో సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు హాజరైన డిజైనర్ క్రేషా బజాజ్.. రాజ్ సమంతకు ఎందుకు సరైనోడో వివరిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. సమంత మనసుకు సరిగ్గా సరిపోయే వ్యక్తి రాజ్ అని ఆమె పేర్కొంది.
పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ క్రేషా బజాజ్ ఇలా రాసుకొచ్చింది. "చిన్న చిన్న ఆనందాలే నన్ను ముందుకు నడిపిస్తాయి. కానీ గత రెండు రోజులుగా నేను అనుభవించిన అనుభూతి వేరు. అందరూ ఇళ్లకు వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ ఫీలింగ్ మనతోనే ఉండిపోతుంది" అని చెప్పింది.
ఇక రాజ్ నిడిమోరు.. సమంతకు ఎందుకు పర్ఫెక్ట్ అనేది వివరిస్తూ ఆమె ఇలా చెప్పింది. "నా బెస్ట్ ఫ్రెండ్, నా సోదరి... తన మనసుకు సరిగ్గా సరిపోయే వ్యక్తితో కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇది మనసును తాకే విషయం. ఇది నన్ను ఆగిపోయేలా చేసింది. అన్ని భావోద్వేగాలను ఒక్కసారిగా ఫీల్ అయ్యేలా చేసింది" అని రాసింది.
కేవలం సమంత జీవితంలోకే కాదు.. రాజ్ తమ అందరి జీవితాల్లో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందని క్రేషా చెప్పింది. ఈ పోస్ట్‌ను సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. "నా మనసు నిండిపోయింది" అంటూ వైట్ హార్ట్ ఎమోజీలతో పోస్ట్ చేసింది.
సమంత - క్రేషా బజాజ్ అనుబంధం
{{/usCountry}}కేవలం సమంత జీవితంలోకే కాదు.. రాజ్ తమ అందరి జీవితాల్లో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందని క్రేషా చెప్పింది. ఈ పోస్ట్‌ను సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. "నా మనసు నిండిపోయింది" అంటూ వైట్ హార్ట్ ఎమోజీలతో పోస్ట్ చేసింది.
సమంత - క్రేషా బజాజ్ అనుబంధం
{{/usCountry}}సమంత, క్రేషా బజాజ్ మధ్య కొన్నేళ్లుగా గాఢమైన స్నేహం ఉంది. నాగ చైతన్యతో 2017లో జరిగిన పెళ్లికి సమంత ధరించిన చీర, గౌనును డిజైన్ చేసింది క్రేషా బజాజే. 2021లో చైతన్యతో విడిపోయిన తర్వాత 2024లో సమంత తన పాత వెడ్డింగ్ గౌనును నలుపు రంగులోకి మార్పించుకుంది. ఆ పని చేసింది కూడా క్రేషానే.
సమంత జీవితంలోని ఎత్తుపల్లాల్లో క్రేషా ఎప్పుడూ ఆమెకు అండగా నిలుస్తూ వచ్చింది. ఇప్పుడు రాజ్ నిడిమోరు రాకతో తన స్నేహితురాలు సంతోషంగా ఉండటం చూసి ఆమె ఉప్పొంగిపోయింది.