Sameera Reddy: బాలీవుడ్ లో నటించిన తొలి మూవీలోనే తాను తీవ్రమైన శరీర రంగు వివక్ష, బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని సీనియర్ నటి సమీరా రెడ్డి సంచలన నిజాలు బయటపెట్టింది. సోహైల్ ఖాన్ హీరోగా వచ్చిన 'మైనే దిల్ తుజ్కో దియా' టైమ్‌లో తన స్కిన్ టోన్ కంటే మూడు షేడ్స్ తక్కువ ఉన్న ఫౌండేషన్ వాడమన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హీరోయిన్ అంటే కచ్చితంగా తెల్లగా ఉండాలనే రూల్స్ పెట్టడం వల్లే తనకు ఆ పరిస్థితి వచ్చిందని చెప్పింది.
తెల్లగా చూపించడానికి బాడీ మేకప్!

రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓపెన్ అయింది. తన ఫస్ట్ సినిమా షూటింగ్ టైమ్‌లో ముఖానికి వేసిన తెల్లటి మేకప్‌తో మ్యాచ్ అవ్వడం కోసం బాడీ మొత్తానికి మేకప్ వేసేవారని గుర్తుచేసుకుంది.
ఆ మేకప్ వల్ల తాను స్క్రీన్ మీద దాదాపు గ్రే కలర్‌లో కనిపించేదాన్నని చెప్పింది. బయట సమాజంలోనే కాదు, సొంత కుటుంబాల్లో కూడా అమ్మాయిలను నల్లగా ఉన్నావు, లావుగా ఉన్నావు అంటూ పేరెంట్స్, అత్తమామలు వేధించడం దారుణమని, అసలు అందానికి నిర్వచనం ఎవరు ఇచ్చారని ఆమె ప్రశ్నించింది.
20 ఏళ్ల పాటు ఆ నరకం అనుభవించా
బాలీవుడ్ తన నుంచి కోరుకున్న గ్లామర్ లుక్ కోసం తన పర్సనల్ లైఫ్‌ను, నమ్మకాలను పూర్తిగా పక్కన పెట్టేయాల్సి వచ్చిందని సమీరా వాపోయింది. ఆ అభద్రతాభావం నుంచి బయటకు రావడానికి తనకు దాదాపు 20 ఏళ్ల సమయం పట్టిందని ఎమోషనల్ అయింది.
తనకు 40 ఏళ్లు వచ్చిన తర్వాతే ఆ భ్రమల నుంచి బయటపడగలిగానని స్పష్టం చేసింది. అన్ని ఏళ్లుగా కేవలం ఇండస్ట్రీ కోసం ప్యాడెడ్ బ్రాలు, బమ్ ప్యాడ్స్, కలర్ కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతూ బతికేసినట్లు ఓపెన్‌గా ఒప్పుకుంది. డ్రెస్ డిజైనర్లు కూడా తన బాడీ షేప్ గురించి కామెంట్స్ చేస్తూ ఒత్తిడి తెచ్చేవారని, తన బట్టలన్నింటికీ ఇన్-బిల్ట్ ప్యాడ్స్ కుట్టించేవారని సంచలన విషయాలు బయటపెట్టింది.
టాలీవుడ్‌లో క్రేజ్.. సంజయ్ దత్ సినిమాతో కంబ్యాక్
తెలుగు ప్రేక్షకులకు సమీరా రెడ్డి చాలా బాగా సుపరిచితం. మెగాస్టార్ చిరంజీవితో 'జై చిరంజీవా', యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో 'అశోక్', 'నరసింహుడు' లాంటి పెద్ద సినిమాల్లో నటించి ఇక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్‌లో అదరగొట్టిన ఈ బ్యూటీ వెనుక ఇంతటి మానసిక సంఘర్షణ ఉందనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
{{/usCountry}}తెలుగు ప్రేక్షకులకు సమీరా రెడ్డి చాలా బాగా సుపరిచితం. మెగాస్టార్ చిరంజీవితో 'జై చిరంజీవా', యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో 'అశోక్', 'నరసింహుడు' లాంటి పెద్ద సినిమాల్లో నటించి ఇక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్‌లో అదరగొట్టిన ఈ బ్యూటీ వెనుక ఇంతటి మానసిక సంఘర్షణ ఉందనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
{{/usCountry}}దాదాపు 14 ఏళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న సమీరా రెడ్డి.. రీసెంట్‌గా అభిజీత్ మోహన్ వరాంగ్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఆఖ్రీ సవాల్' అనే ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. సంజయ్ దత్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో సమీరా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
దీనికంటే ముందు ఆమె 2013లో వచ్చిన 'వరదనాయక' అనే కన్నడ సినిమాలో లాస్ట్ టైమ్ కనిపించింది. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2014లో బిజినెస్‌మెన్ అక్షయ్ వర్దేని పెళ్లి చేసుకున్న ఈమెకు హన్స్ అనే కొడుకు, నైరా అనే కూతురు ఉన్నారు. ప్రస్తుతం బాడీ పాజిటివిటీపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానుల్లో ధైర్యం నింపుతోంది.