...
...
Next Story

Sampoornesh Babu: నీకెందుకంత దురద.. నీకెవరు ఛాన్స్ ఇస్తారంటూ నోటికొచ్చినట్లు వాగిన జర్నలిస్ట్.. సంపూర్ణేష్‌కు క్షమాపణ

Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబును అవమానించిన జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ దిగి వచ్చాడు. అతనికి, అతని అభిమానులకు క్షమాపణ చెప్పాడు. తనకు అవమానించే ఉద్దేశం లేదని, పాత పరిచయాల వల్లే అలా మాట్లాడినట్లు వివరణ ఇచ్చాడు.

Published on: Sep 25, 2026, 14:06:40 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Sampoornesh Babu: నేచురల్ స్టార్ నాని నటించిన 'ది పారడైజ్' మూవీ ప్రమోషన్లలో ఊహించని షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సినిమాలో 'బిర్యానీ' అనే సీరియస్ రోల్ చేసిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబును ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ గా చెప్పుకునే నాగేంద్ర కుమార్ పర్సనల్ గా టార్గెట్ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. నెటిజన్ల నుంచి సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ట్రోలింగ్ రావడంతో ఆ జర్నలిస్ట్ బహిరంగంగా క్షమాపణలు చెప్పక తప్పలేదు.

ఇంటర్వ్యూలో ఏం జరిగింది? సంపూ లుక్స్ పై అనుచిత వ్యాఖ్యలు

Sampoornesh Babu: నీకెందుకంత దురద.. నీకెవరు ఛాన్స్ ఇస్తారంటూ నోటికొచ్చినట్లు వాగిన జర్నలిస్ట్.. సంపూర్ణేష్‌కు క్షమాపణ
Sampoornesh Babu: నీకెందుకంత దురద.. నీకెవరు ఛాన్స్ ఇస్తారంటూ నోటికొచ్చినట్లు వాగిన జర్నలిస్ట్.. సంపూర్ణేష్‌కు క్షమాపణ

'ది పారడైజ్' ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్.. సంపూర్ణేష్ బాబును ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అసలు సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఈ రూపంతో హీరో ఎలా అవుదామని అనుకున్నావ్.. నీకెందుకంత దురద.. నీకెవరు ఛాన్స్ ఇస్తారనుకున్నావ్ అంటూ సదరు జర్నలిస్ట్ ప్రశ్నించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సంపూ లుక్స్, ఫిజిక్ అలాగే ఇండస్ట్రీలో అతడి సక్సెస్ ఛాన్సెస్ పై చులకనగా మాట్లాడటంపై మూవీ లవర్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.

వరసగా స్పూఫ్ సినిమాలు చేసుకునే నటుడివి, నాని పక్కన ఇంత సీరియస్ క్యారెక్టర్ ఎలా ఇస్తారు అనే కోణంలో ఆ ఇంటర్వ్యూ సాగడంతో, అది హ్యూమర్ సరిహద్దులు దాటి పర్సనల్ అవమానంలా మారిందని వీక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంపూ కూల్ రెస్పాన్స్.. నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం

జర్నలిస్ట్ ఎంత అవమానకరంగా మాట్లాడినా సంపూర్ణేష్ బాబు మాత్రం ఎక్కడా కోపాన్ని బయటపడనీయలేదు. చాలా ప్రశాంతంగా, హుందాగా సమాధానాలు ఇస్తూ పరిస్థితిని బాగా హ్యాండిల్ చేశాడు. సంపూ చూపించిన ఈ సహనం, డీసెంట్ ఆటిట్యూడ్ చూసి నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

'హృదయ కాలేయం' సినిమాతో బర్నింగ్ స్టార్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన సంపూర్ణేష్ బాబు.. ఆ తర్వాత 'కొబ్బరిమట్ట', 'సింగం 123' లాంటి స్పూఫ్ సినిమాలతో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే మొదటిసారిగా మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల 'ది పారడైజ్' సినిమాలో సంపూర్ణేష్ కి ఒక పవర్ ఫుల్, సీరియస్ అండ్ ఎమోషనల్ రోల్ ఇచ్చారు.

హీరో నానికి నమ్మకమైన స్నేహితుడిగా 'బిర్యానీ' పాత్రలో సంపూ నటన సినిమాకే ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందనే టాక్ వస్తోంది. తన పాత కామెడీ ఇమేజ్ ని పక్కన పెట్టి ఒక పక్కా రా అండ్ రస్టిక్ యాక్టర్ గా సంపూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఇండస్ట్రీ వర్గాలు కూడా భావిస్తున్నాయి.

సోషల్ మీడియాలో ట్రోలింగ్.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్

ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ లలో వైరల్ అవ్వడంతో సదరు జర్నలిస్ట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ ఒక స్పెషల్ క్లారిటీ వీడియో రిలీజ్ చేస్తూ సంపూర్ణేష్ బాబుకి, అతడి ఫ్యాన్స్ కి క్షమాపణలు తెలిపారు.

సంపూతో ఉన్న పాత పరిచయంతోనే సరదాగా మాట్లాడానని, అతడిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు. సంపూర్ణేష్ పడ్డ కష్టాన్ని, అతడి వ్యక్తిత్వాన్ని తాను గౌరవిస్తానని, ఇంటర్వ్యూ వల్ల మనస్తాపం చెందిన ప్రతి ఒక్కరికీ సారీ చెప్తున్నానని పేర్కొన్నారు.

జర్నలిస్ట్ క్లారిటీ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వివాదం ఇంకా పూర్తిగా చల్లారలేదు. ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ లేదా పరిచయం ఉన్నా సరే, కెమెరా ముందు ఒక నటుడిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కనీస ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయాలని, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks