Irumudi: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా 'ఇరుముడి' థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. డిఫరెంట్ ఎమోషనల్ అండ్ డివోషనల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీకి ఆడియెన్స్ తో పాటు సినీ ప్రముఖుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తాజాగా టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు తీవ్రంగా వైరల్ అవుతోంది.
‘ఇరుముడి’పై సందీప్ వంగా సంచలన ట్వీట్

'యానిమల్', 'అర్జున్ రెడ్డి' సినిమాలతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎక్స్ వేదికగా 'ఇరుముడి' టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరి మనసునూ తాకుతుందని ఆయన కొనియాడారు.
"ఇది స్వచ్ఛమైన ఎమోషన్, డివోషన్ ల వేడుక. మాస్ మహారాజా రవితేజ గారు, బేబీ నక్షత్ర, డైరెక్టర్ శివ నిర్వాణ మనల్ని ఒక మరచిపోలేని ఎమోషనల్ రైడ్‌కి తీసుకెళ్లారు. ఈ తరంలో ఇరుముడి నిజంగా ఒక అరుదైన, ఓ ప్రత్యేకమైన మూవీ. ఎండ్ క్రెడిట్స్ పడిన తర్వాత కూడా ఈ సినిమా మనతో పాటే వస్తుంది. కచ్చితంగా ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చూడాల్సిన సినిమా ఇది. సూపర్ హిట్ ఇచ్చినందుకు రవితేజకు శుభాకాంక్షలు" అని సందీప్ ట్వీట్ చేశారు.
శివ నిర్వాణ-రవితేజ కాంబో మ్యాజిక్
'నిన్ను కోరి', 'మజిలీ', 'ఖుషి' లాంటి సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామాలతో మెప్పించిన డైరెక్టర్ శివ నిర్వాణ.. రవితేజను ఒక సరికొత్త భక్తిరస కాన్సెప్ట్‌లో ఈ ఇరుముడి సినిమాలో చూపించడం విశేషం. స్వామి అయ్యప్ప మాలధారణ, తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే గాఢమైన అనుబంధం చుట్టూ నడిచే ఈ కథ ప్రేక్షకుల హృదయాలను పిండేస్తోంది.
మాస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రవితేజ.. ఈ సినిమాలో పూర్తి భిన్నమైన రోల్లో జీవించేశారనే టాక్ వినిపిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్రతో ఆయన కాంబినేషన్ సీన్స్, ఎమోషనల్ డెప్త్ థియేటర్లలో ఆడియెన్స్‌ను కంటతడి పెట్టిస్తున్నాయి. శివ నిర్వాణ మార్క్ డైరెక్షన్, హృదయానికి హత్తుకునే డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
బాక్సాఫీస్ వద్ద పెరిగిన క్రేజ్
{{/usCountry}}మాస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రవితేజ.. ఈ సినిమాలో పూర్తి భిన్నమైన రోల్లో జీవించేశారనే టాక్ వినిపిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్రతో ఆయన కాంబినేషన్ సీన్స్, ఎమోషనల్ డెప్త్ థియేటర్లలో ఆడియెన్స్‌ను కంటతడి పెట్టిస్తున్నాయి. శివ నిర్వాణ మార్క్ డైరెక్షన్, హృదయానికి హత్తుకునే డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
బాక్సాఫీస్ వద్ద పెరిగిన క్రేజ్
{{/usCountry}}సాధారణంగా ఇంటెన్స్, యాక్షన్ కంటెంట్‌ను ఇష్టపడే సందీప్ రెడ్డి వంగా లాంటి మాస్ డైరెక్టర్ కూడా ఈ డివోషనల్ ఎమోషనల్ డ్రామాకు ఫిదా అవ్వడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. సందీప్ ఇచ్చిన గ్రాండ్ రివ్యూతో బాక్సాఫీస్ దగ్గర 'ఇరుముడి' కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమాతో రవితేజ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ చేరినట్లయింది. భక్తికి ఎమోషన్ జోడించి తెరకెక్కించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్, అయ్యప్ప స్వామి భక్తులు బ్రహ్మరథం పడుతున్నారు.