Sandeep Reddy Vanga: స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'ఎపిక్' (Epic) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శేఖర్ కమ్ముల హీరోలపై సందీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపాయి.
"నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు!" – సందీప్ షాకింగ్ రెస్పాన్స్

'ఎపిక్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన సందీప్ రెడ్డి వంగాను స్టేజిపై యాంకర్ సుమ ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. 'ఎపిక్' సినిమాలో హీరో శేఖర్ కమ్ముల సినిమాల్లో ఉండే అమాయకపు అబ్బాయిలాగా, హీరోయిన్ సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో ఉండే బోల్డ్ క్యారెక్టర్‌లాగా ఉందనే టాక్ వస్తోంది కదా, మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అని సుమ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు సందీప్ వంగా ఏమాత్రం ఆలోచించకుండా, "నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు" అంటూ దాచుకోకుండా చెప్పేశారు. హీరోయిన్లు మాత్రం నచ్చుతారని, ఈ ఎపిక్ లో హీరోయిన్ తన సినిమాల్లో హీరోలాంటి వాళ్లన్న పోలిక బాగుందని, ఎలా ఉందో చూడాలని అన్నారు. సందీప్ నుంచి ఇలాంటి ఆన్సర్ వస్తుందని ఊహించని యాంకర్ సుమతో పాటు అక్కడున్న ఆడియన్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్.. లీడర్, ఆనంద్ చిత్రాల ప్రస్తావన
సందీప్ వంగా చేసిన ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే శేఖర్ కమ్ముల ఫ్యాన్స్, నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. 'లీడర్' సినిమాలో రానా దగ్గుబాటి పోషించిన సీఎం పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో.. 'అనామిక', 'ఆనంద్', 'గోదావరి' సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ ఎంత క్లాసీగా ఉంటుందో అందరికీ తెలిసిందేనని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.
అలాంటి ఐకానిక్ క్యారెక్టర్లు కూడా సందీప్‌కి నచ్చలేదనడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' లాంటి ఇంటెన్స్, అగ్రెసివ్ యాక్షన్ డ్రామాలు తీసే సందీప్ వంగాకు.. శేఖర్ కమ్ముల తీసే ప్రశాంతమైన, క్లాస్ ఫీల్-గుడ్ లవ్ స్టోరీలు నచ్చకపోవడం వెనుక ఆయన పర్సనల్ టేస్ట్ ఉండి ఉండవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శేఖర్ కమ్ముల హీరోయిన్లంటే ఇష్టమే
{{/usCountry}}అలాంటి ఐకానిక్ క్యారెక్టర్లు కూడా సందీప్‌కి నచ్చలేదనడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' లాంటి ఇంటెన్స్, అగ్రెసివ్ యాక్షన్ డ్రామాలు తీసే సందీప్ వంగాకు.. శేఖర్ కమ్ముల తీసే ప్రశాంతమైన, క్లాస్ ఫీల్-గుడ్ లవ్ స్టోరీలు నచ్చకపోవడం వెనుక ఆయన పర్సనల్ టేస్ట్ ఉండి ఉండవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శేఖర్ కమ్ముల హీరోయిన్లంటే ఇష్టమే
{{/usCountry}}అయితే ఇదే వేదికపై సందీప్ వంగా మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల సినిమాల్లోని హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ తనకు చాలా ఇష్టమని స్పష్టం చేశారు. ఆయన సినిమాల్లో హీరోయిన్లను ప్రెజెంట్ చేసే విధానం, వారిని అందంగా చూపించే తీరు చాలా బాగుంటుందని కంప్లిమెంట్ ఇచ్చారు.
సందీప్ వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించినవే అయినప్పటికీ, అంతపెద్ద స్టేజ్ పై ఓపెన్‌గా వేరే డైరెక్టర్ హీరోల గురించి అలా మాట్లాడటం అనవసరమైన నెగెటివిటీకి దారితీసిందని ఫిలింనగర్ టాక్.
సెప్టెంబర్ 11న థియేటర్లలోకి ‘ఎపిక్’
ఇక ఎపిక్ సినిమా విషయానికి వస్తే.. 'బేబీ' లాంటి రూ. 100 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ జోడీగా నటించిన సినిమా ఇది. '90s' వెబ్ సిరీస్‌తో నోస్టాల్జిక్ మ్యాజిక్ క్రియేట్ చేసిన ఆదిత్య హాసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు.
ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్‌కి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సంచలన కామెంట్స్ వల్ల వచ్చిన పబ్లిసిటీ సినిమా ఓపెనింగ్స్‌కి ఏమేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.