...
...
Next Story

ప్రభాస్ ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ పెద్ద చర్చకే తెరలేపిన సందీప్ రెడ్డి వంగా..

ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ సందీప్ రెడ్డి వంగా టైటిల్ కార్డ్ వేయడంపై పెద్ద చర్చే మొదలైంది. స్పిరిట్ గ్లింప్స్ వీడియోలో అతడు చేసిన పనిపై షారుక్ ఖాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Published on: Oct 24, 2025, 21:49:43 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తమ రాబోయే మూవీ 'స్పిరిట్' నుండి ఒక ప్రత్యేకమైన 'సౌండ్ స్టోరీ'ని విడుదల చేసిన విషయం తెలుసు కదా. ఇది రెబల్ స్టార్ అభిమానులకు గొప్ప ట్రీట్ అని చెప్పొచ్చు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి గ్లింప్స్ కావడంతో అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది.

ప్రభాస్ ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ పెద్ద చర్చకే తెరలేపిన సందీప్ రెడ్డి వంగా..
ప్రభాస్ ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ పెద్ద చర్చకే తెరలేపిన సందీప్ రెడ్డి వంగా..

అయితే ఈ వీడియోలో చాలా మంది అభిమానుల దృష్టిని ఆకర్షించింది ఏంటంటే.. ఇందులో ప్రభాస్‌ను పరిచయం చేసిన తీరు. రెబల్ స్టార్ అని కాకుండా ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని అనడం విశేషం. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. ఇది ప్రభాస్ అభిమానులను ఎంతగానో సంతోషపరిచినప్పటికీ.. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి ఇతర పెద్ద స్టార్ల అభిమానులు దీనిని అవమానకరమని పేర్కొంటూ వాదనకు దిగారు.

షారుక్ ఖాన్ ఫ్యాన్స్ మండిపాటు

'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్' అని ఉన్న స్పిరిట్ టైటిల్ కార్డుపై స్పందిస్తూ.. ఒక షారుక్ ఖాన్ అభిమాని స్పందించారు. "ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్? మంచి ప్రయత్నం.. కానీ ముంబై నుండి మొరాకో వరకు హృదయాలను పాలించే బాద్‌షా ఒక్కడే - షారుక్ ఖాన్.

లెగసీని పోస్టర్‌లలో ప్రకటించరు. అది దశాబ్దాల మ్యాజిక్, చార్మ్, ప్రపంచవ్యాప్త ప్రేమ ద్వారా వస్తుంది" అని అన్నారు. మరికొందరు అభిమానులు కూడా ఈ టైటిల్ కార్డును తప్పుబట్టారు. కొందరు ప్రభాస్ ను తక్కువ చేస్తూ కూడా పోస్టులు చేశారు.

సమర్థించుకున్న ప్రభాస్ అభిమానులు

ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి ఫ్రాంచైజీతో ప్రభాస్ దేశవ్యాప్తంగా పేరు సంపాదించాడు. ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కలిపి రూ.2400 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఆ తర్వాత అతడు పాన్-ఇండియా స్టార్‌గా స్థిరపడ్డాడు. అయితే తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. అయితే గత రెండు సంవత్సరాలుగా సలార్, కల్కి 2898 ఏడీ విజయాలతో ఈ నటుడు మళ్లీ పుంజుకున్నాడు. కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఈ బాక్సాఫీస్ దూకుడు కారణంగా చాలా మంది బాలీవుడ్ స్టార్లు ప్రభాస్ పాన్-ఇండియా పాపులారిటీ పట్ల 'అభద్రతా భావంతో' ఉన్నారనే చర్చకు దారితీసింది. ఒక ట్వీట్‌లో "ముంబైలోని కొంతమందికి ఈ పోస్టర్ చూసి రాత్రి నిద్ర పట్టదు" అని అనడం విశేషం.

ప్రభాస్ రాబోయే సినిమాలు

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ సినిమాలో వివేక్ ఒబెరాయ్, త్రిప్తి డిమ్రి కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే అంతకుముందే ప్రభాస్ ఫాంటసీ హారర్ మూవీ ది రాజాసాబ్ లో కనిపించనున్నాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ దత్, మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe