ఈవారం థియేటర్ల రిలీజ్ మాట ఎలా ఉన్నా.. ఓటీటీలో మాత్రం టాప్ మూవీస్ రాబోతున్నాయి. వీటిలో మూడు సంక్రాంతికి రిలీజైనవే కావడం విశేషం. రెండు నెల రోజుల్లోపే రాబోతుండగా.. ఒకటైతే మరీ 20 రోజులకే స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. మరి ఆ మూవీస్ ఏవి? ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
నారీ నారీ నడుమ మురారి - ప్రైమ్ వీడియో

ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో అన్నింటి కంటే ముందుగా ఓటీటీలోకి వస్తున్న సినిమా నారీ నారీ నడుమ మురారి. శర్వానంద్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అయినా కూడా మూడు వారాల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. ఈ బుధవారం అంటే ఫిబ్రవరి 4 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అడుగుపెట్టబోతోంది. అది కూడా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుండటంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై మరింత ఆదరణ దక్కుతుందని భావిస్తున్నారు.
ది రాజా సాబ్ - జియోహాట్‌స్టార్
ప్రభాస్ నటించిన మరో డిజాస్టర్ మూవీ ది రాజా సాబ్. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో రిలీజైంది. అయితే నెగటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలను చవిచూసింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాను ఈ శుక్రవారం అంటే ఫిబ్రవరి 6 నుంచి జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు. తెలుగు సహా ఇతర భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో ఈ మూవీ మిస్ అయి ఉంటే ఓటీటీలో చూడొచ్చు.
పరాశక్తి - జీ5 ఓటీటీ
ఇక శివకార్తికేయన్, శ్రీలీల నటించిన తమిళ సినిమా పరాశక్తి కూడా ఈవారమే ఓటీటీలోకి వస్తోంది. జనవరి 10న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే దీనికి కూడా నెగటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. ఫిబ్రవరి 7 నుంచి జీ5 ఓటీటీలో తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
వచ్చే వారం మిగిలిన మూవీస్
{{/usCountry}}ఇక శివకార్తికేయన్, శ్రీలీల నటించిన తమిళ సినిమా పరాశక్తి కూడా ఈవారమే ఓటీటీలోకి వస్తోంది. జనవరి 10న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే దీనికి కూడా నెగటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. ఫిబ్రవరి 7 నుంచి జీ5 ఓటీటీలో తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
వచ్చే వారం మిగిలిన మూవీస్
{{/usCountry}}ఇక ఈ ఏడాది తెలుగులో సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తిలాంటి సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్లు ఇంకా వెల్లడించలేదు. అయితే ఇవి వచ్చే వారం అడుగుపెట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11 నుంచి 13 మధ్య ఈ సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కావచ్చని అంచనా వేస్తున్నారు.