Sara Saaniya: అందంలో పోటీప‌డుతున్న వ‌దిన మ‌ర‌ద‌లు-సారా టెండూల్కర్ బ్యూటీ చూస్తే జెల‌సీ పుడుతుందంటూ-వీడియో వైర‌ల్‌

Sara Saaniya: సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, కోడలు సానియా ఛందోక్ అందంలో పోటీపడుతున్నారు. తాజాగా ఓ పెళ్లికి అటెండ్ అయిన ఈ వదిన మరదలు చీరలో తళుక్కుమన్నారు. 

Mar 15, 2026, 06:35:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బిజినెస్ వుమెన్ సానియా ఛందోక్ ను అతను పెళ్లాడాడు. తాజాగా తన వదిన సానియాతో కలిసి సారా టెండూల్కర్ తళుక్కున మెరిసింది. వీళ్ల వీడియో తెగ వైరల్ గా మారింది.

సానియా, సారా (PTI)
సానియా, సారా (PTI)

సానియా, సారా

అందంలో వదిన మరదలు పోటీపడుతున్నారు. ఈ వీడియో చూస్తే ఎవరికైనా ఇలాగే అనిపించక మానదు. సారా టెండూల్కర్, సానియా ఛందోక్ కలిసి ఓ పెళ్లికి అటెండ్ అయ్యారు. ఇద్దరూ చీరకట్టులో చక్కగా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒక గ్రే కలర్ ఎస్ యూవీ కారులోంచి దిగుతూ కనిపించారు.

వీడియో వైరల్

ఫొటోగ్రాఫర్లకు పోజులు ఇవ్వడం కోసం సారా తన వదిన సానియాకు దారి చూపించింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి పోజులిచ్చారు. ఇద్దరు అందగత్తెలు అద్భుతమైన చీరల్లో అందరినీ ఆకట్టుకున్నారు. సారా లేత ఆకుపచ్చ రంగు చీరను, మెరిసే బ్లౌజ్‌తో జత చేసింది. సానియా క్లాసిక్ పండుగ శోభను ప్రతిబింబించే పీచ్-పింక్ సిల్క్ చీరను ఎంచుకుంది. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.

సారా అందం చూసి

సానియా, సారా కలిసి చీరకట్టులో మెరిసిపోతున్న వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. సూపర్, బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా సారా అందాన్ని పొగిడేస్తున్నారు. ‘‘ఆమె అందం అలాంటిదే. ఎవరికైనా జెలసీ పుట్టాల్సిందే. బ్యూటీఫుల్ సారా’’ అని ఓ యూజర్ పెట్టిన కామెంట్ వైరల్ గా మారింది. బాబీ సానియాను సారా డామినేట్ చేస్తుందని కొంతమంది పేర్కొన్నారు.

సానియా, అర్జున్ పెళ్లి

సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పెళ్లి రీసెంట్ గా జరిగింది. మార్చి 5న ఈ జంట ఒక్కటైంది. ఈ పెళ్లికి టీమిండియా మాజీ ఆటగాళ్లు ఎంఎస్ ధోని, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, ఆకాశ్ చోప్రా, సురేశ్ రైనా, మహమ్మద్ కైఫ్ తదితరులు అటెండ్ అయ్యారు.

సారా ఫ్రెండ్

అర్జున్ టెండూల్కర్ పెళ్లి చేసుకున్న సానియా ఎవరో కాదు సారాకు బెస్ట్ ఫ్రెండే. చిన్నప్పటి నుంచి సారా కోసం సచిన్ వాళ్ల ఇంటికి సానియా వెళ్లేదే. అలా అర్జున్ టెండూల్కర్, సానియా మధ్య ప్రేమ మొదలైంది. పెద్దలను ఒప్పించి వీళ్లు పెళ్లి చేసుకున్నారు. మరోవైపు సచిన్ టెండూల్కర్, సానియా తాత రవి ఘాయ్ కు కూడా మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.

అర్జున్ క్రికెటర్ గా తన కెరీర్ నిర్మించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు బిజినెస్ వుమెన్ గా సారా తన జర్నీ కొనసాగిస్తోంది. తరచూ ట్రావెల్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో కొన్ని బ్రాండ్లకు ప్రమోషన్ కూడా చేస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More