...
...
Next Story

Sathi Leelavathi: అరుంధతిలా లావణ్య త్రిపాఠి.. సతీ లీలావతి ట్రైలర్.. పర్ఫెక్ట్ సమ్మర్ ఎంటర్ టైనర్ అంటున్న రామ్ చరణ్

Sathi Leelavathi: ‘‘నువ్వు నన్ను ఏం చేయలేవ్ రా’’ అంటూ అరుంధతిలో అనుష్కలా మారిపోయింది లావణ్య త్రిపాఠి. భర్తను చితక్కొట్టేసింది. ఆమె కొత్త మూవీ సతీ లీలావతి ట్రైలర్ లో ఇలాంటి విశేషాలు చాలానే ఉన్నాయి. ట్రైలర్ ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ రియాక్షన్ కూడా వైరల్ గా మారింది.

Published on: May 2, 2026, 15:32:48 IST
Advertisement

Sathi Leelavathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని, మెగా ఇంటి కోడలిగా మారిన తర్వాత లావణ్య త్రిపాఠి కొణిదెల చేస్తున్న ఫస్ట్ తెలుగు మూవీ ‘సతీ లీలావతి’. ఈ సినిమా ట్రైలర్ ఇవాళ రిలీజైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో లావణ్య తన యాక్టింగ్ తో ఇరగదీసింది.

సతీ లీలావతి ట్రైలర్

సతీ లీలావతిలో లావణ్య త్రిపాఠి (x)
సతీ లీలావతిలో లావణ్య త్రిపాఠి (x)

లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటించిన ‘సతీ లీలావతి’ ట్రైలర్ వచ్చేసింది. ఇందులో మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల తన విశ్వరూపం చూపించేసింది. శనివారం (ఏప్రిల్ 5) ఈ సతీ లీలావతి మూవీ ట్రైలర్ ను రామ్ చరణ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తాటినేని సత్య డైరెక్టర్.

భార్య ఉగ్రరూపం

సతీ లీలావతి సినిమాలో ఉగ్రరూపంతో ఊగిపోయే భార్య క్యారెక్టర్లో లావణ్య త్రిపాఠి కనిపించింది. తన భర్త మరో అమ్మాయితో మాట్లాడుతున్నాడని తెలిసి భార్య రెచ్చిపోతుంది. హస్బెండ్ బెండ్ తీసేలా కొడుతుంది. చివర్లో భార్యను చూసి అరుంధతిలోని అనుష్కలా అనుకొని ఆ భర్త భయపడే సీన్ హైలైట్ గా నిలిచింది.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్

సతీ లీలావతి మూవీని ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కించారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియన్, నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి తదితరులు నటించారు. దుర్గా దేవి పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.

రామ్ చరణ్ రియాక్షన్

రిలీజ్ డేట్

సతీ లీలావతి మూవీ మే 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి చేసిన ఫస్ట్ తెలుగు మూవీ ఇది. ఈ సినిమాను మార్చిలో రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ ఆ తర్వాత పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు మే 8న థియేటర్లకు తీసుకురాబోతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe