...
...
Next Story

Sathi Leelavathi Review: సతీ లీలావతి రివ్యూ- భర్తను బంధించే భార్య- మెగా కోడలు లావణ్య త్రిపాఠి రీ ఎంట్రీ మూవీ ఎలా ఉందంటే?

Sathi Leelavathi Review In Telugu 2026: మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా సతీ లీలావతి. ఇవాళ థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఒక మధ్యతరగతి కుటుంబంలో భార్యాభర్తల మధ్య తలెత్తే విభేదాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఎలా ఉందో నేటి సతీ లీలావతి రివ్యూలో తెలుసుకుందాం.

Published on: May 8, 2026, 17:26:58 IST
Advertisement

Sathi Leelavathi Review And Rating: టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి మెగా కోడలు అయ్యాక సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చింది. మెగా కోడలు అయిన తర్వాత లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ మూవీ సతీ లీలావతి. దేవ్ మోహన్ హీరోగా చేశాడు.

సతీ లీలావతి రివ్యూ- భర్తను బంధించే భార్య- మెగా కోడలు లావణ్య త్రిపాఠి రీ ఎంట్రీ మూవీ ఎలా ఉందంటే?
సతీ లీలావతి రివ్యూ- భర్తను బంధించే భార్య- మెగా కోడలు లావణ్య త్రిపాఠి రీ ఎంట్రీ మూవీ ఎలా ఉందంటే?

నిర్మాత నాగ మోహన్ నిర్మాణంలో తాతినేని సత్య దర్శకత్వం వహించిన సతీ లీలావతి మూవీ ఇవాళ (మే 8) థియేటర్లలో విడుదల అయింది. ఫ్యామిలీ ఎమోషన్స్, పెళ్లి తర్వాత వచ్చే మనస్పర్థల చుట్టూ తిరిగే ఈ కథపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో నేటి సతీ లీలావతి రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

లీలావతి (లావణ్య త్రిపాఠి) ఒక సినిమా దర్శకురాలు. అనాథ అయిన సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే, లీలా షూటింగ్ బిజీలో పడి భర్తను పట్టించుకోకపోవడంతో వారి మధ్య దూరం పెరుగుతుంది. పెళ్లయిన మూడు ఏళ్ల తర్వాత విడాకులు కావాలని బాంబ్ పేలుస్తాడు రామ్ సేతు.

లీలావతికి విడాకులు ఇచ్చి నర్స్ నికోలా సెబాస్టియన్ (మడోన్నా సెబాస్టియన్)ను పెళ్లి చేసుకుంటానని రామ్ సేతు చెబుతాడు. కానీ లీలా విడాకులు ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా, భర్తపై దాడి చేసి ఇంట్లోనే బంధిస్తుంది.

ఆ తర్వాత ఏమైంది? ఇంట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? లాయర్ తమలపాకుల (వీటీవీ గణేష్), దొంగ (సప్తగిరి) ఎంట్రీ కథను ఎలాంటి మలుపు తిప్పింది? తన భర్తను కాపాడుకోవడానికి లీలా చేసిన ప్రయత్నాలేంటి? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

దర్శకుడు తాతినేని సత్య పాత కాన్సెప్ట్‌నే ఎంచుకున్నా, అందులో ఉన్న ఎమోషనల్ పాయింట్ బాగుంది. విడాకులు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదనే సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నించారు. అయితే, ఇలాంటి కథలు క్లిక్ అవ్వాలంటే ప్రధాన జంట మధ్య కెమిస్ట్రీ, భావోద్వేగాలు బలంగా ఉండాలి. తెరపై లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంట చూడముచ్చటగా ఉన్నా కథనం గాడి తప్పినట్లయింది.

సినిమా తొలి సగం సరదాగా సాగిపోతుంది. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలు, ఒకరిపై ఒకరు విసిరే సెటైర్లు నవ్వులు పూయిస్తాయి. అయితే, ద్వితీయార్థంలో భార్యాభర్తల ఎమోషన్స్‌పై దృష్టి పెట్టాల్సింది పోయి, అనవసరమైన సబ్ ప్లాట్లు ఇబ్బంది కలిగిస్తాయి. నటుడు వీగే నరేష్‌తో వచ్చే ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది.

క్లైమాక్స్ అలా

క్లైమాక్స్ పర్వాలేదు. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నిర్మాత నాగ మోహన్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్యాషన్‌తో సినిమాను నిర్మించినట్లు తెలుస్తోంది. విడాకుల చుట్టూ సాగే మంచి సందేశాత్మక సినిమాను నిర్మాత అందించారు. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌పై దృష్టి పెట్టాల్సింది. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. పాటల ప్లేస్‌మెంట్ కుదరలేదు.

ఇక లీలా పాత్రలో లావణ్య త్రిపాఠి నటన హైలైట్ అని చెప్పొచ్చు. ఆమెలోని చురుకైన, అల్లరి కోణాన్ని దర్శకుడు బాగా ఆవిష్కరించారు. సతీ లీలావతి పాత్రకు లావణ్య త్రిపాఠి పర్‌ఫెక్ట్ యాప్ట్ అనిపించేలా చేశారు. లావణ్య తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అలాగే, దేవ్ మోహన్ నటన కూడా బాగుంది.

జాఫర్ సాదిక్ కామెడీ టైమింగ్ సినిమాకు మంచి ప్రారంభాన్ని ఇచ్చింది. దాన్ని సప్తగిరి తన కామెడీ ట్రాక్‌తో మరింత నవ్వించాడు. దొంగగా సప్తగిరి ఎంట్రీ, ఆ క్రమంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. కమెడియన్‌గా సప్తగరి మరోసారి తన మార్క్ చూపించాడు. మడోన్నా సెబాస్టియన్ గ్లామర్‌తోనే కాకుండా నటనతో అట్రాక్ట్ చేసింది. మిగతా పాత్రలు అన్ని పరిధి మేర మెప్పించారు.

ఫైనల్‌గా చెప్పాలంటే?

ఫైనల్‌గా చెప్పాలంటే విడాకుల కాన్సెప్ట్ పాతదైన భర్తను భార్య బంధించడం అనేది డిఫరెంట్ పాయింట్. అక్కడక్కడ కామెడీతో నవ్విస్తూ ఎమోషనల్ అంశాలతో సాగే సతీ లీలావతిపై లుక్కేయొచ్చు.

రేటింగ్: 2.75/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks