...
...
Next Story

Satluj Ban: ఓటీటీలోకి వచ్చిన రెండు రోజులకే నిషేధం.. తీవ్ర దుమారం రేపిన సినిమా.. బాలీవుడ్ సపోర్ట్ అడగనన్న స్టార్ హీరో

Satluj Ban: జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టిన రెండు రోజులకే నిషేధానికి గురైన సట్లెజ్ మూవీ స్టార్ దిల్జిత్ దోసాంజ్ దీనిపై స్పందించాడు. తాను ఈ విషయంలో బాలీవుడ్ సపోర్ట్ కోరనని స్పష్టం చేశాడు. అసలు ఏం జరిగిందో చూడండి.

Published on: Jul 6, 2026, 15:45:21 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Satluj Ban: జీ5 (ZEE5) ఓటీటీలో గత శుక్రవారం అంటే జులై 3న సైలెంట్‌గా రిలీజైన దిల్జిత్ దోసాంజ్ సెన్సేషనల్ రియల్ లైఫ్ డ్రామా 'సట్లెజ్' (Satluj) కేవలం రెండు రోజులకే ప్లాట్‌ఫామ్ నుంచి డిలీట్ అవ్వడం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. పంజాబ్ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖాల్రా రియల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాపై జరుగుతున్న వివాదం గురించి దిల్జిత్ తాజాగా ఫ్యాన్స్‌తో లైవ్‌లో మాట్లాడుతూ షాకింగ్ నిజాలు బయటపెట్టాడు.

బాలీవుడ్ సాయం అడగలేదు.. మా పోరాటం మాదే

Satluj Ban: ఓటీటీలోకి వచ్చిన రెండు రోజులకే నిషేధం.. తీవ్ర దుమారం రేపిన సినిమా.. బాలీవుడ్ సపోర్ట్ అడగనన్న స్టార్ హీరో
Satluj Ban: ఓటీటీలోకి వచ్చిన రెండు రోజులకే నిషేధం.. తీవ్ర దుమారం రేపిన సినిమా.. బాలీవుడ్ సపోర్ట్ అడగనన్న స్టార్ హీరో

'సట్లెజ్' సినిమాను ఎలాంటి ముందుస్తు ప్రమోషన్స్ లేకుండా ఓటీటీలో ఎందుకు రిలీజ్ చేశారో దిల్జిత్ క్లారిటీ ఇచ్చాడు. ముందుగా అనౌన్స్ చేస్తే అసలు సినిమా ఆడియన్స్‌కు రీచ్ అయ్యేది కాదని, అందుకే రిస్క్ తీసుకోకుండా సైలెంట్‌గా రిలీజ్ చేశామని చెప్పాడు. జస్వంత్ సింగ్ ఖాల్రా స్టోరీ ఎలాగైనా జనాలకు తెలియాలన్నదే తమ ప్రధాన లక్ష్యం అని అన్నాడు.

గత మూడు నాలుగేళ్లుగా ఈ సినిమాను జనాల్లోకి తీసుకురావడానికి టీమ్ అంతా ఎన్నో కష్టాలు పడిందని దిల్జిత్ ఎమోషనల్ అయ్యాడు. "మేము ఎవరి దగ్గరికీ వెళ్లి సపోర్ట్ అడగలేదు. బాలీవుడ్ వాళ్లని గానీ, పంజాబీ ఫిల్మ్ ఇండస్ట్రీని గానీ హెల్ప్ చేయమని ప్రాధేయపడలేదు. మా పోరాటం మేమే చేశాం" అని పంజాబీలో స్పష్టం చేశాడు.

డిలీట్ చేస్తే ఆగిపోతుందనుకోవడం వాళ్ల అమాయకత్వం

సినిమాను ప్లాట్‌ఫామ్ నుంచి తీసేసినా తాను ప్రశాంతంగానే ఉన్నానని, ఎందుకంటే అప్పటికే జనాలు మూవీని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నారని దిల్జిత్ గుర్తుచేశాడు. "నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా పర్వాలేదు.. నా ప్రాణం ఉన్నంత వరకు నేను పంజాబ్ కోసమే నిలబడతాను. ఈరోజు ఒక గురుద్వారాలో సట్లెజ్ సినిమాను స్క్రీనింగ్ చేస్తున్న వీడియో చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది" అని చెప్పాడు.

జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అయింది జస్వంత్ సింగ్ ఖాల్రా ఫ్యామిలీ ఆమోదించిన పక్కా అన్‌కట్ వెర్షన్. సినిమాను సడెన్‌గా తీసేసిన తర్వాత జీ5 ఒక అఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది.

"సట్లెజ్ క్రియేటివ్ విజన్‌కు మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. మాకు ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ ఈ సినిమాను చట్టబద్ధంగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి తగిన మార్గాలను అన్వేషిస్తున్నాం" అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి మాత్రం ఈ మూవీ ఇండియాలో అందుబాటులో ఉండదని తేల్చి చెప్పింది.

సట్లెజ్ అసలు కథ ఏంటి?

డైరెక్టర్ హనీ ట్రెహాన్ తెరకెక్కించిన ఈ సినిమా 1980-90ల నాటి పంజాబ్‌లోని చీకటి నిజాలను కళ్లకు కడుతుంది. ఫేక్ ఎన్‌కౌంటర్స్ పేరుతో వేలాది మంది సిక్కు యువకులు మాయమైపోతే, శ్మశానవాటికల్లోని రికార్డులు బయటకు తీసి జస్వంత్ సింగ్ దాన్ని ప్రపంచం దృష్టికి ఎలా తీసుకొచ్చాడనేదే ఈ ఇంటెన్స్ డ్రామా. 1995లో ఆయన్ని కిడ్నాప్ చేసి, టార్చర్ చేసి దారుణంగా చంపేశారు. ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని రోనీ స్క్రూవాలా ఈ పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌ను నిర్మించాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks