Satvika Veeravalli: ఫ‌స్ట్ సినిమానే దుల్క‌ర్‌తో.. ఆ రిలీజ్‌కు ముందే నాగ‌చైత‌న్య మూవీలో ఛాన్స్‌.. ఎవరీ సాత్విక వీరవల్లి?

Satvika Veeravalli: ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న పేర్లలో సాత్విక వీరవల్లి ఒకరు. డెబ్యూ సినిమాలోనే దుల్కర్ సల్మాన్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ తెలుగుమ్మాయి. ఇప్పుడేమో ఆ మూవీ రిలీజ్ కంటే ముందే నాగ చైతన్య సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. సాత్విక ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూద్దాం.

Published on: Nov 18, 2026, 10:51:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Satvika Veeravalli: ముంబయి, ఢిల్లీ నుంచి హీరోయిన్లను తీసుకొస్తారు కానీ తెలుగు అమ్మాయిలకు మాత్రం అవకాశాలు ఇవ్వరని టాలీవుడ్ పై ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి పేరు తెగ మార్మోగుతోంది. డెబ్యూ కంటే ముందే ఆమె సంచలనం క్రియేట్ చేస్తోంది.

ఫ‌స్ట్ సినిమానే దుల్క‌ర్‌తో.. ఆ రిలీజ్‌కు ముందే నాగ‌చైత‌న్య మూవీలో ఛాన్స్‌.. ఎవరీ సాత్విక వీరవల్లి?
ఫ‌స్ట్ సినిమానే దుల్క‌ర్‌తో.. ఆ రిలీజ్‌కు ముందే నాగ‌చైత‌న్య మూవీలో ఛాన్స్‌.. ఎవరీ సాత్విక వీరవల్లి?

ఆకాశంలో ఒక తార

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్. ఆమె డెబ్యూ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సాత్విక పేరు వైరల్ అవుతూనే ఉంది. తాజాగా రిలీజ్ చేసిన ఆకాశంలో ఒక తార ట్రైలర్ చూస్తే.. అరంగేట్రమే అయినప్పటికీ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ అదరగొట్టిందనేది అర్థమవుతోంది.

నాగ చైతన్య సినిమాలో

ఆకాశంలో ఒక తార మూవీ రిలీజ్ అయిన తర్వాత సాత్వికకు ఇంకా అవకాశాలు వస్తాయని మూవీ ఎక్స్ పెర్ట్స్ అంచనా వేశారు. కానీ ఈ సినిమా రిలీజ్ కంటే ముందే సాత్విక వీరవల్లి బిజీ అయిపోతుంది. ఆమె క్రేజ్ మామూలుగా లేదు. ఇంకా అనౌన్స్ చేయని నాగ చైతన్య సినిమాలో సాత్వికనే హీరోయిన్. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పష్టం చేశారు.

రామ్ చరణ్ జోడీగా

ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలోనూ హీరోయిన్ సాత్విక వీరవల్లి అని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంపై ఇప్పుడే ఏం మాట్లాడలేనని సాత్విక చెప్పడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

సాత్విక వీరవల్లి ఎవరు?

ఇప్పుడు సాత్విక వీరవల్లి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అని తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అమెరికాలో పుట్టిన తెలుగమ్మాయి సాత్విక. 26 ఏళ్ల సాత్విక మంచి డ్యాన్సర్. సోషల్ మీడియాలో డ్యాన్స్ రీల్స్ తో అదరగొడుతోంది. ఆమె తల్లి వనిత భరతనాట్యం టీచర్.

తల్లి దగ్గరే సాత్విక నాట్యం నేర్చుకుంది. సాత్విక అమెరికాలోనే ఇంజినీరింగ్ కంప్లీట్ చేసింది. టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఒరాకిల్ సెర్నర్ లో నాలుగేళ్లు పని కూడా చేసింది. నెలకు లక్షల్లో జీతం అందుకుంది. కానీ సినిమాల్లో నటించాలనే కలతో ఉద్యోగాన్ని వదిలేసి ఇండియాకు వచ్చేసింది.

స్టార్ హీరోయిన్ గా

సాత్విక వీరవల్లికి నటన అంటే పిచ్చి. ఆకాశంలో ఒక తార ట్రైలర్ చూసిన తర్వాత ఆమెకు మంచి భవిష్యతే ఉందని మూవీ పండితులు చెప్తున్నారు. ఈ సినిమాతో పాటు నాగ చైతన్య మూవీ కూడా హిట్ అయితే సాత్వికకు తిరుగుండదు. ఒకవేళ ప్రచారం నిజమై సుకుమార్-రామ్ చరణ్ సినిమాలోనూ సాత్విక నటిస్తే ఆమె కచ్చితంగా స్టార్ హీరోయిన్ గా ఎదిగే ఛాన్స్ త్వరగానే వస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More