Aakasamlo Oka Tara Trailer: పర్ఫెక్ట్ టైమింగ్.. అదిరేలా ఆకాశంలో ఒక తార ట్రైలర్.. మళ్లీ మ్యాజిక్ చేసిన దుల్కర్ సల్మాన్!
Aakasamlo Oka Tara Trailer: టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి జంటగా నటించిన ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ 'ఆకాశంలో ఒక తార'. మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.
Aakasamlo Oka Tara Trailer: ఆకాశంలో ఒక తార ట్రైలర్ ప్రారంభం నుంచే దర్శకుడు పవన్ సాధినేని సినిమా మెయిన్ ప్లాట్‌పై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. పల్లెటూరి వాతావరణం, ఆస్ట్రోనాట్ కావాలనే ఒక సాధారణ యువతి (సాత్విక) అసాధారణ కల, ఆ కలకు తన కుటుంబమే అడ్డుపడటం.. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు అండగా నిలిచే భర్త.. ఇలా ప్రతి ఫ్రేమ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా కట్ చేశారు.

మ్యాజిక్ చేసిన దుల్కర్
దుల్కర్ సల్మాన్ మరోసారి తన డీసెంట్ అండ్ నేచురల్ యాక్టింగ్‌తో మ్యాజిక్ చేశాడు. ఆకాశంలో ఒక తార సినిమాలో భార్య లక్ష్యం కోసం సమాజాన్ని ఎదిరించే 'గ్రీన్ ఫ్లాగ్' భర్త కృష్ణ పాత్రలో జీవించేశాడు. ఇక ఈ సినిమాతో పరిచయమవుతున్న తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. కళ్లలోని అమాయకత్వం, లక్ష్యం చేరుకోవాలనే కసిని ట్రైలర్లోనే అద్భుతంగా పండించింది.
అదిరిపోయిన శృతి హాసన్ క్యారెక్టరైజేషన్
ఆకాశంలో ఒక తార ట్రైలర్లో అందరినీ షాక్‌కు గురిచేసి, క్యూరియాసిటీ పెంచింది మాత్రం స్టార్ హీరోయిన్ శృతి హాసన్. ఆమె ఎంట్రీ ఇచ్చే తీరు, సిగరెట్ తాగుతూ కనిపించే బోల్డ్ అవతార్ సర్ ప్రైజింగ్ గా ఉంది. సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ కోర్ కు రోహిణిగా ఆమె పాత్రే అత్యంత కీలకం కానుందని ట్రైలర్ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది. ఆమె క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్రధాన బలం కానుంది.
టాప్ క్లాస్ విజువల్స్
ఆకాశంలో ఒక తార సినిమా ట్రైలర్ లో విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. సుజిత్ సారంగ్ కెమెరా వర్క్ పల్లెటూరి అందాలతో పాటు, ఎమోషనల్ సీన్స్ కు తగ్గట్లుగా అద్భుతమైన లైటింగ్ తో ఆకట్టుకుంది. అన్నింటికీ మించి జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు ప్రాణం పోసింది.
గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా లాంటి బడా సంస్థలు ఈ ప్రాజెక్ట్ తో ముడిపడి ఉండటంతో నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదు. పైగా రిలీజ్ కు నాలుగు రోజుల ముందు ట్రైలర్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. మూవీపై అంచనాలను మరింత పెంచేశారు.
గూస్ బంప్స్
ఓవరాల్ గా చూసుకుంటే 'ఆకాశంలో ఒక తార' ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఈ కథకు ఫిదా అవ్వడం, గూస్ బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ ఉండటంతో.. నవంబర్ 20న థియేటర్లలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


