...
...
Next Story

Venkatesh Maha: సత్యదేవ్ నెక్స్ట్ కమల్ హాసనా? రావు బహదూర్ దర్శకుడు వెంకటేష్ మహా షాకింగ్ కామెంట్స్..ఆడుకుంటున్న నెటిజన్లు

Venkatesh Maha: 'రావు బహదూర్' సినిమా ప్రమోషన్లలో దర్శకుడు వెంకటేష్ మహా, హీరో సత్యదేవ్ ఇస్తున్న స్టేట్మెంట్లు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా వెంకటేష్.. సత్యదేవ్‌ను కమల్ హాసన్‌తో పోల్చడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఈ కామెంట్లు కాంట్రవర్సీకి దారితీశాయి.

Published on: Jun 20, 2026, 21:51:29 IST
Advertisement

Venkatesh Maha: ఈ రోజుల్లో సినిమాను జనాలకు చేరేలా ఎంతగా ప్రమోట్ చేస్తే, అంతగా బెనిఫిట్ ఉంటుంది. అందుకే ఇటీవల మూవీ టీమ్స్ తమ ప్రమోషన్లను సంచలనంగా మారేలా ప్లాన్ చేస్తున్నాయి. ప్రమోషన్లు డిఫరెంట్ గా ఉంటే తప్పు లేదు, కానీ కాంట్రవర్సీలకు దారి తీస్తే మొదటికే మోసం వస్తుంది. తాజాగా ‘రావు బహదూర్’ డైరెక్టర్ కామెంట్లు అలాగే ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.

కమల్ హాసన్‌తో సత్యదేవ్‌కు పోలికా!

సత్యదేవ్ నెక్స్ట్ కమల్ హాసనా? రావు బహదూర్ దర్శకుడు వెంకటేష్ మహా షాకింగ్ కామెంట్స్
సత్యదేవ్ నెక్స్ట్ కమల్ హాసనా? రావు బహదూర్ దర్శకుడు వెంకటేష్ మహా షాకింగ్ కామెంట్స్

తాజాగా రావు బహదూర్ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్‌లో దర్శకుడు వెంకటేష్ మహా ఇచ్చిన స్టేట్మెంట్ అందరినీ షాక్‌కు గురిచేసింది. సత్యదేవ్‌ను ఏకంగా లోకనాయకుడు కమల్ హాసన్‌తో పోల్చడం టూమచ్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

"తన నటనను భర్తీ చేసే నటుడు వచ్చిన రోజు తాను రిటైరవుతానని కొన్నేళ్ల క్రితం కమల్ హాసన్ పేర్కొన్నట్లు ఎక్కడో విన్నా. ఈ జనరేషన్‌లో కమల్ హాసన్ స్థాయి పర్‌ఫార్మెన్స్ ఇచ్చే నటుడు ఒకడు వచ్చేశాడు. ఆ నటుడే సత్యదేవ్" అని వెంకటేష్ మహా గొప్పగా చెప్పాడు.

రిటైర్ కావొద్దంటూ

'రావు బహదూర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ఈ మూవీ ఈవెంట్‌లో హీరో సత్యదేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. "బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాల తర్వాత ఇతర పరిశ్రమల వాళ్లు మాట్లాడుకునే రేంజ్ సినిమా ఇది. బ్రేక్‌ఫాస్ట్‌లో కేరాఫ్ కంచరపాలెం సినిమాను ఇది తినేస్తుంది" అని సత్యదేవ్ ధీమాగా చెప్పాడు.

అసలుకే మోసం

సత్యదేవ్ టాలెంటెడ్ యాక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయి మెప్పించగల సామర్థ్యం అతనికి ఉంది. కానీ, దశాబ్దాల నటనా అనుభవం, వందలాది వైవిధ్యమైన పాత్రలతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే లెజెండ్‌గా నిలిచిన కమల్ హాసన్‌తో సత్యదేవ్‌ను పోల్చడం ముమ్మాటికీ ఓవర్ చేయడమే అనే కామెంట్లు వస్తున్నాయి.

ఇండస్ట్రీలోని మహామహులైన నటులను సైతం కమల్‌తో పోల్చాలంటే విశ్లేషకులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అలాంటిది కెరీర్‌లో ఇంకా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం చూస్తున్న సత్యదేవ్‌ను కమల్ హాసన్‌కు రీప్లేస్‌మెంట్ అనడం సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు కారణమవుతోంది. ప్రమోషన్ల కోసం అతిగా ఎలివేషన్లు ఇవ్వడం వల్ల సినిమాకు అసలుకే మోసం వస్తుందని అంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks