...
...
Next Story

Satyadev: ఇది తెలుగు సినిమాకు రాసిన లవ్ లెటర్.. మహేష్ బాబు సర్ ఇదే అన్నారు: రావు బహదూర్‌పై సత్యదేవ్

Satyadev: సత్యదేవ్ నటించిన రావు బహదూర్ మూవీ జులై 3న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. మంగళవారం (జూన్ 30) ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా సత్యదేవ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jun 30, 2026, 21:49:39 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Satyadev: టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరుగాంచిన సత్యదేవ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్'. ఈ సినిమా ఈ శుక్రవారం అంటే జులై 3న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

Satyadev: ఇది తెలుగు సినిమాకు రాసిన లవ్ లెటర్.. మహేష్ బాబు సర్ ఇదే అన్నారు: రావు బహదూర్‌పై సత్యదేవ్
Satyadev: ఇది తెలుగు సినిమాకు రాసిన లవ్ లెటర్.. మహేష్ బాబు సర్ ఇదే అన్నారు: రావు బహదూర్‌పై సత్యదేవ్

టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు తన పవర్‌ఫుల్ బేస్ వాయిస్‌తో వాయిస్ ఓవర్ ఇవ్వడం బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలిచింది.

మహేష్ బాబు సపోర్ట్‌పై సత్యదేవ్ కామెంట్స్ ఇలా..

రావు బహదూర్ మూవీ ట్రైలర్ లాంచ్ మీట్‌లో హీరో సత్యదేవ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ స్టేజ్ పైనే చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎంతలా సపోర్ట్ చేశాడో చెప్తూ ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు. "రావు బహదూర్ సినిమా అనేది తెలుగు సినిమాకు మేమంతా రాసుకున్న ఒక ఒక బ్యూటిఫుల్ లవ్ లెటర్ లాంటిది" అని సత్యదేవ్ చెప్పుకొచ్చాడు.

"మనం ఒక లవ్ లెటర్ రాసిన తర్వాత మనకు బాగా క్లోజ్ అయిన బెస్ట్ ఫ్రెండ్ దాన్ని చదివి.. ఎక్కడెక్కడ కరెక్షన్స్ చేయాలో పక్కాగా చెప్తాడు కదా. ఈ సినిమా విషయంలో మాకు ఆ హెల్ప్ చేసిన గ్రేట్ ఫ్రెండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఆయన ఈ ప్రాజెక్ట్‌ను ఓన్ చేసుకుని తన వాయిస్ ఓవర్‌తో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ఇది నిజంగానే తెలుగు సినిమాకు రాసిన లవ్ లెటర్ అని మహేష్ సర్ అన్నారు" అని సత్యదేవ్ ఎంతో హ్యాపీగా షేర్ చేసుకున్నాడు.

నా లైఫ్ ఇక ప్రీ అండ్ పోస్ట్ 'రావు బహదూర్'

గతంలో 'కేరాఫ్ కంచరపాలెం' లాంటి క్లాసిక్ ఫిల్మ్‌తో నేషనల్ లెవెల్‌లో అటెన్షన్ తెచ్చుకున్న వెంకటేష్ మహా ఈ కథను చాలా ఇంటెన్సిటీతో నడిపించినట్లు విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. సత్యదేవ్ సరసన దీపా థామస్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తుండగా, చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. జులై 3న రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe