...
...
Next Story

Satyadev: షాకింగ్- హీరోకు తెలియకుండానే ఓటీటీలోకి మూవీ- ఆరు రోజులకే స్ట్రీమింగ్- హార్ట్ బ్రేక్- సత్యదేవ్ సంచలన కామెంట్లు

Satyadev: తెలుగు సినిమాలు నాలుగు వారాల థియేట్రికల్ విండో తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని మూవీస్ అయితే ముందుగానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ ఆరు రోజుల్లోనే ఓటీటీలోకి, అది కూడా హీరోకు తెలియకుండా రిలీజ్ అయిన మూవీ గురించి తెలుసా? దీనిపై హీరో సత్యదేవ్ సంచలన కామెంట్లు చేశాడు.

Published on: May 31, 2026, 06:41:15 IST
Advertisement

Satyadev: ఏదైనా మూవీ ఓటీటీలోకి వస్తుందంటే, ఆ హీరో దాని డిజిటల్ రిలీజ్ ను ప్రమోట్ చేస్తాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. కానీ ఇక్కడ మాత్రం కనీసం హీరోకు కూడా తెలియకుండా ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన తర్వాత కేవలం ఆరు రోజులకే డిజిట్ డెబ్యూ చేసింది. ఆ మూవీ పేరు ‘కృష్ణ‌మ్మ‌’. దాని హీరో సత్యదేవ్. తాజాగా ఈ విషయంపై సత్యదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఆరు రోజుల్లోనే ఓటీటీలోకి

ఆరు రోజులకే మూవీ ఓటీటీ రిలీజ్ పై సత్యదేవ్ సంచలన కామెంట్లు (x)
ఆరు రోజులకే మూవీ ఓటీటీ రిలీజ్ పై సత్యదేవ్ సంచలన కామెంట్లు (x)

తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో హీరో సత్యదేవ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కృష్ణ‌మ్మ‌ ఓటీటీ రిలీజ్ పై అతను సెన్సేషనల్ కామెంట్లు చేశాడు. తన సినిమా విడుదలైన ఆరు రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన విషయం స్వయంగా ఆ హీరోకే తెలియకపోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ' సినిమా కేవలం ఆరు రోజుల్లోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేయడం, ఆ విషయం కనీసం ఆయనకు ముందే తెలియకపోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

సత్యదేవ్ కామెంట్లు

ఈ వ్యవహారంపై సత్యదేవ్ స్పందిస్తూ తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశాడు. "కృష్ణ‌మ్మ‌ పెద్ద ఫ్రైడే మూవీ కావాల్సింది. కొరటాల శివ ప్రజెంట్ చేశారు. కానీ ఈ మూవీ ఫ్రైడ్ రిలీజ్ అయి నెక్ట్స్ గురువారం ఓటీటీలోకి వచ్చేసింది. నాకు ఆ విషయం తెలియదు. మేకర్స్ అలా మాట్లాడుకున్నారు. నా కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ లో అది ఒకటి. చాలా తక్కువ మంది చూశారు’’ అని సత్యదేవ్ షాకింగ్ విషయం చెప్పాడు.

హార్ట్ బ్రేక్

‘‘నేనేం సినిమా బాగా ఆడుతుందని పోస్ట్ పెట్టా. ఎవరో మెసేజ్ పెట్టారు. నాకు తెలియదు. నేనేమో మూవీని థియేటర్లలో చూడండని ప్రమోట్ చేస్తున్నా. ‘ఏంటన్నా వెధవల్లా కనిపిస్తున్నామా? కామెడీ చేస్తున్నావా? ఎందుకు డబ్బులు బొక్క. వెళ్లి ఓటీటీలో చూసుకో. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది’ అని ఓ ఫ్యాన్ స్క్రీన్ షాట్ పంపించాడు. అది చూసి గుండె బద్దలైంది’’ అని సత్యదేవ్ సంచలన కామెంట్లు చేశాడు.

వివాదం ఏంటంటే?

వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా 'కృష్ణమ్మ'. ఈ చిత్రానికి వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహించగా, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను సమర్పించారు. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

థియేటర్లలో విడుదలైన కొద్ది రోజుల్లోనే, అంటే కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కృష్ణ‌మ్మ‌ సినిమా స్ట్రీమింగ్ కావడం మొదలైంది. మే 10, 2024న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. మే 17న ఓటీటీలోకి వచ్చేసింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ' సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది?

సమాధానం: ఈ చిత్రం ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.

ప్రశ్న: 'కృష్ణమ్మ' సినిమా థియేటర్లలో విడుదలైన ఎన్ని రోజులకు ఓటీటీలోకి వచ్చింది?

సమాధానం: ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ అయిన కేవలం ఆరు రోజులకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ప్రశ్న: ఈ సినిమా ఓటీటీ విడుదలపై సత్యదేవ్‌కు ఎవరు సమాచారం ఇచ్చారు?

సమాధానం: చిత్ర బృందం లేదా నిర్మాతల నుంచి సత్యదేవ్‌కు ఎలాంటి సమాచారం అందలేదు. ఒక అభిమాని చెప్పడం ద్వారానే తన సినిమా ఓటీటీలోకి వచ్చినట్లు తెలుసుకున్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe