...
...
Next Story

ఈ పులులను ఆ దేవుడైనా కాపాడగలడా? బ్లాక్‌బస్టర్ తెలుగు కామెడీ వెబ్ సిరీస్ మూడో సీజన్ హైప్ మామూలుగా లేదుగా..

Save The Tigers Season 3: తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్స్' మూడో సీజన్ త్వరలో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. భార్యల చేతిలో నలిగిపోతున్న భర్తలను కాపాడేందుకు ఈసారి స్వర్గం నుంచి దేవుడే వస్తున్నాడంటూ మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.

Published on: May 26, 2026, 19:19:03 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Save The Tigers Season 3: తెలుగు ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఫ్రాంచైజీలలో 'సేవ్ ద టైగర్స్' ముందు వరుసలో ఉంటుంది. పెళ్లయిన తర్వాత భర్తలు పడే కష్టాలు, భార్యాభర్తల మధ్య జరిగే సరదా గొడవలు నేపథ్యంలో వచ్చిన ఈ కామెడీ సిరీస్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది.

ఈ పులులను ఆ దేవుడైనా కాపాడగలడా? బ్లాక్‌బస్టర్ తెలుగు కామెడీ వెబ్ సిరీస్ మూడో సీజన్ హైప్ మామూలుగా లేదుగా..
ఈ పులులను ఆ దేవుడైనా కాపాడగలడా? బ్లాక్‌బస్టర్ తెలుగు కామెడీ వెబ్ సిరీస్ మూడో సీజన్ హైప్ మామూలుగా లేదుగా..

మొదటి రెండు సీజన్లు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించాయి. ఇప్పుడు ఈ నవ్వుల ప్రయాణం మరో అడుగు ముందుకు వేస్తోంది. 'సేవ్ ద టైగర్స్ 3' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సేవ్ ద టైగర్స్ సీజన్ 3 ఫుల్ హైప్

సేవ్ ద టైగర్స్ మూడో సీజన్ త్వరలో అంటూ చాలా ముందు నుంచే విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. మూడు రోజుల కిందటే ఓ స్పెషల్ పోస్టర్ తీసుకు రాగా.. తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు.

"పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయిస్తారని అందరూ అంటారు.. కానీ భూమి మీద వాటిని నెట్టుకురావడం ఎలా? అందుకే ఆ స్వర్గలోక పాలకుడే ఒక ప్రత్యేకమైన మిషన్‌తో కిందకు దిగివస్తున్నాడు. మరి సమయం మించిపోకముందే ఆ దేవుడు ఈ టైగర్స్‌ను (భర్తలను) కాపాడతాడా!" అని మేకర్స్ జియోహాట్‌స్టార్ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.

వెన్నెల కిశోర్ దేవుడిగా..

ఈ చిన్న క్యాప్షన్ చూస్తుంటే సేవ్ ద టైగర్స్ మూడో సీజన్‌లో వినోదంతో పాటు ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా జోడించినట్లు స్పష్టమవుతోంది. భార్యల చేతిలో నలిగిపోతున్న ఆ ముగ్గురు భర్తలను ఆదుకునేందుకు సాక్షాత్తూ దేవుడే దిగిరావడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతేకాదు ఆ దేవుడి పాత్రలో వెన్నెల కిశోర్ కనిపించబోతుండటంతో ఈసారి కామెడీ డోసు మరింత పెరగనున్నట్లు తేలిపోయింది.

ఇప్పటికే వచ్చిన రెండు సీజన్లు చూసి పెళ్లయిన మగవాళ్లందరూ సిరీస్‌లోని పాత్రలకు తమను తాము రిలేట్ చేసుకున్నారు. రోజువారీ ఒత్తిళ్లతో సతమతమయ్యే ప్రేక్షకులకు ఒక మంచి స్ట్రెస్ బస్టర్‌గా ఈ సిరీస్ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఏకంగా దేవుడే స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో వినోదం ఏ స్థాయిలో ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ ప్రీమియర్ తేదీని మేకర్స్ వెల్లడించనున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

'సేవ్ ద టైగర్స్ 3' ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది?

ఈ సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ మూడో సీజన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar)లో స్ట్రీమింగ్ కానుంది.

సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్‌లో ప్రధాన నటులు ఎవరు?

ప్రియదర్శి, అభినవ్ గోమటం, సుజాత, రోహిణి, దేవయాని శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సేవ్ ద టైగర్స్ మూడో సీజన్ ప్రత్యేకత ఏమిటి?

భార్యల నుంచి భర్తలను కాపాడేందుకు ఏకంగా దేవుడే (వెన్నెల కిశోర్) భూమి మీదకు రావడం అనే ఫాంటసీ కామెడీ నేపథ్యంలో ఈ కొత్త సీజన్ సాగనుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe