Scene OTT Release Date: ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘సీన్’.. 2026లో సూర్య ఖాతాలో చేరిన మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవి. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో దూసుకెళ్తున్న ఆయన రీసెంట్ గా ‘సీన్’తో థియేటర్లో అదరగొట్టారు. ఇప్పుడీ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది.
సీన్ ఓటీటీ రిలీజ్ డేట్

సూర్య డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించిన మూవీ ‘సీన్’. ఇందులో ఆయన కంటి చూపు లేని పోలీస్ ఆఫీసర్ గా నటించారు. థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసి, రికార్డులు బ్రేక్ చేసిన ఈ సీన్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
తెలుగులోనూ
సూర్య ‘సీన్’ మూవీ తెలుగులోనూ ఓటీటీలోకి రాబోతుంది. డిసెంబర్ 4 నుంచి సీన్ సినిమా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలిసింది. దీనిపై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి అఫీషియల్ అప్డేట్ రానుంది.
రూ.250 కోట్లకు పైగా
నవంబర్ 6న థియేటర్లలో రిలీజైన సీన్ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.265 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ బడ్జెట్ కేవలం రూ.30 కోట్లేననే టాక్ వినిపిస్తోంది. ఈ రకంగా చూసుకుంటే సీన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిందని చెప్పొచ్చు.
నజ్రియా, నస్లెన్
సూర్య హీరోగా నటించిన సీన్ మూవీలో నజ్రియా నజీమ్ హీరోయిన్. ఆమె దాదాపు 12 ఏళ్ల తర్వాత తమిళంలో చేసిన సినిమా ఇది. ఇక ప్రేమలు సినిమాతో హీరోగా అదరగొట్టిన నస్లెన్.. ఈ సీన్ మూవీలో సైకో కిల్లర్ గా విలన్ రోల్ ప్లే చేయడం విశేషం. తమిళంలో ఇదే అతనికి ఫస్ట్ మూవీ.
స్టోరీ ఇదే
{{/usCountry}}సూర్య హీరోగా నటించిన సీన్ మూవీలో నజ్రియా నజీమ్ హీరోయిన్. ఆమె దాదాపు 12 ఏళ్ల తర్వాత తమిళంలో చేసిన సినిమా ఇది. ఇక ప్రేమలు సినిమాతో హీరోగా అదరగొట్టిన నస్లెన్.. ఈ సీన్ మూవీలో సైకో కిల్లర్ గా విలన్ రోల్ ప్లే చేయడం విశేషం. తమిళంలో ఇదే అతనికి ఫస్ట్ మూవీ.
స్టోరీ ఇదే
{{/usCountry}}డీఎస్పీ ఇన్బరాజ్ (సూర్య) చుట్టూ తిరిగే కథతో సీన్ మూవీ తెరకెక్కించారు. కంటి చూపు పోయిందే కారణంతో ఇన్బరాజ్ తన ఉద్యోగానికి రిజైన్ చేస్తాడు. మరోవైపు నగరంలో సైకో కిల్లర్ ఈశ్వరన్ (నస్లెన్) వరుస హత్యలతో భయపెడుతుంటాడు. ఈ సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు చూపు లేని ఇన్బరాజ్ రంగంలోకి దిగుతాడు. తనకో టీమ్ తయారు చేసుకుంటాడు.
లేటెస్ట్ టెక్నాలజీని వాడి ఈశ్వరన్ ను ఇన్బరాజ్ ఎలా పట్టుకున్నాడు? అసలు ఈశ్వరన్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అనే విషయాలు ఈ క్రైమ్ థ్రిల్లర్ సీన్ మూవీలో చూడాల్సిందే.
ABOUT THE AUTHOR
చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.