Secret Soldier Movie Oye Oye Song Released: టాలీవుడ్‌లో ఇటీవల వైవిధ్యమైన కాన్సెప్ట్ చిత్రాలకు, స్పై థ్రిల్లర్ కథాంశాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అదే బాటలో సస్పెన్స్, యాక్షన్, హ్యూమర్ ఎలిమెంట్స్ కలగలిపి తెరకెక్కించిన వినూత్న చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’.
హీరోలుగా నిహాల్, సూర్య

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రమోషన్లు ప్రస్తుతం జోరందుకున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకుంటున్న ఈ సీక్రెట్ సోల్జర్ మూవీ నుంచి తాజాగా 'ఓయ్ ఓయ్' అనే ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
శ్రోతలను ఆకట్టుకుంటున్న 'ఓయ్ ఓయ్' సాంగ్!
సీక్రెట్ సోల్జర్ సినిమా నుంచి విడుదలైన 'ఓయ్ ఓయ్' పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంగీత దర్శకుడు కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ పాటకు అత్యంత క్యాచీ ట్యూన్ అందించడమే కాకుండా, స్వయంగా తన గాత్రంతో ఆలపించి ఎనర్జీ నింపారు.
ప్రముఖ గీత రచయిత రెహమాన్ అందించిన సాహిత్యం పాటలోని ప్రతి పదాన్ని అర్థవంతంగా నిలబెట్టింది. పాత్రల స్వభావాన్ని, కథలోని మూడ్‌ను ప్రతిబింబించేలా ఈ పాట చిత్రీకరణ సాగింది. "పాట శ్రోతలను అలరించడంతో పాటు సినిమాలో పాత్రలపై ఆసక్తిని పెంచేలా రూపొందించాం" అని మేకర్స్ తెలిపారు.
యాక్షన్, ఫన్ సమ్మేళనంగా 'సీక్రెట్ సోల్జర్'
సాధారణంగా స్పై సినిమాలు అంటే సీరియస్ టోన్‌లో సాగుతుంటాయి. కానీ ‘సీక్రెట్ సోల్జర్’ చిత్రాన్ని హ్యూమర్, థ్రిల్ మేళవించి రూపుదిద్దినట్లు టీజర్, ట్రైలర్లు చూస్తే తెలుస్తోంది. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత బండ్కమూరి, తులసి వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు.
బలమైన సాంకేతిక వర్గం.. సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్
సీక్రెట్ సోల్జర్ సినిమాకి పరిశ్రమలోని సీనియర్ సాంకేతిక నిపుణులు పనిచేయడం విశేషం. సురేష్ రగుతు ఛాయాగ్రహణం అందించగా, సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
{{/usCountry}}సీక్రెట్ సోల్జర్ సినిమాకి పరిశ్రమలోని సీనియర్ సాంకేతిక నిపుణులు పనిచేయడం విశేషం. సురేష్ రగుతు ఛాయాగ్రహణం అందించగా, సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
{{/usCountry}}ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే సినీ ప్రియుల్లో మంచి బజ్ క్రియేట్ చేసిన ‘సీక్రెట్ సోల్జర్’ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల నిర్వహించిన సీక్రెట్ సోల్జర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సూర్య శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సూర్య శ్రీనివాస్ కామెంట్స్
సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఇంతకంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు చాలా మంచి కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చాలా మంచి కథ ఉన్న సినిమా అనిపించింది" అని అన్నాడు.
"ఈ క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ నాకు చాలా నచ్చింది. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ధైర్యానికి అసలు అర్థం తెలిసింది. అలా పృథ్వీ క్యారెక్టర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా టీమ్ అందరికీ థ్యాంక్యూ వెరీ మచ్. ఈ సినిమాలో యాక్షన్, హ్యూమర్ అన్నిటికంటే మించి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ ఈ సినిమాని గట్టిగా నిలబెడుతుంది" అని ధీమా వ్యక్తం చేశాడు హీరో సూర్య శ్రీనివాస్.