OTT Telugu: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు మూవీ- సీతమ్మవారికి బంగారు తాళి చేయించేందుకు పరితపించే పంతులు- హృద్యమైన సీన్లతో!

Today OTT Telugu Emotional Drama Seetha Ramulu: ఓటీటీలోకి ఇవాళ తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమా సీతా రాములు స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ నటుడు ఎల్‌బీ శ్రీరామ్, రాగ మాధురి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా సీతారాముల కల్యాణం చుట్టు సాగుతుంది. మరి సీతా రాములు ఓటీటీ రిలీజ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Mar 22, 2026, 10:03:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇప్పుడు తెలుగు కంటెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రతి జోనర్‌లో డిఫరెంట్ పాయింట్‌తో సరికొత్తగా తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. ప్రతి వారం ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాల్లో తెలుగు కంటెంట్‌వి మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు మూవీ- సీతమ్మవారికి బంగారు తాళి చేయించేందుకు పరితపించే పంతులు- హృద్యమైన సీన్లతో!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు మూవీ- సీతమ్మవారికి బంగారు తాళి చేయించేందుకు పరితపించే పంతులు- హృద్యమైన సీన్లతో!

హృద్యమైన సీన్లతో

ఇక ఈ వారం కూడా ఎన్నో తెలుగు సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. వాటిలో ఇవాళ తెలుగులో వచ్చిన మూవీ హృద్యమైన సీన్లతో, మనసును కదిలించే డైలాగ్స్‌తో తెరకెక్కింది. ఆ సినిమానే సీతా రాములు. తెలుగులో ఫ్యామిలీ డివోషనల్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.

ఎల్‌బీ శ్రీరామ్ ప్రధాన పాత్రలో

సీతా రాములు సినిమాలో ప్రముఖ తెలుగు నటుడు ఎల్‌బీ శ్రీరామ్, నటి రాగ మాధురి ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా అంతా వీరిద్దరి చుట్టూనే సాగుతుంది. ఈ ఇద్దరితోపాటు మహదేవ్, హేమంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

వర ముళ్లపూడి దర్శకత్వం

వర్మ డ్రీమ్ క్రియేషన్, సుచేత డ్రీమ్‌వర్క్ ప్రొడక్షన్ బ్యానర్స్‌పై సీతా రాములు సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు రాఘవేంద్ర వర్మ, రామ్ విశ్వాస్ హనుర్కర్ నిర్మాతలుగా ఉన్నారు. వర ముళ్లపూడి సీతా రాములు సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే, సాయి మధుకర్ స్వరాలు సమకూర్చారు.

అచ్చ తెలుగు కంటెంట్‌తో

రవి బయ్యారపు రచించిన ఈ సినిమాకు రాఘవేంద్ర వర్మ ఎడిటింగ్ వర్క్ చేశారు. అచ్చ తెలుగు కంటెంట్‌తో తెరకెక్కిన సీతా రాములు సినిమాలో బాగా వయసైన పంతులు సీతారామ శాస్త్రి (ఎల్‌బీ శ్రీరామ్) ఉంటాడు. ఊరిలోని సీతా రాముల గుడికి ఆయనే పూజలు చేస్తుంటారు. ఆయనకు ఒక కుమారుడు. సిటీలో ఉంటాడు.

తులం బంగారం 1300

అయితే, శ్రీరామనవమి పండుగ సమీపిస్తుండటంతో సీతమ్మవారికి బంగారు తాళి చేయించి సీతారాములకు వివాహం జరిపించాలని నిర్ణయించుకుంటాడు పంతులు. కానీ, పేదవాడైన సీతరామ శాస్త్రి దగ్గర అంత డబ్బు ఉండదు. తాళికి తులంకిపైగా బంగారం కావాల్సి వస్తుంది. దానికి రూ. 1300 ఖర్చు అవుతుందని తాళి చేసే వ్యక్తి చెబుతాడు.

పట్టించుకోని కొడుకు

సీతమ్మ తల్లికి బంగారు తాళి చేయించాలని ఊరిలో ప్రతి ఒక్కరిని అడుగుతాడు. కానీ, ఏ ఒక్కరు కూడా సహాయం చేయరు. ఆఖరికి కొడుకు కూడా పట్టించుకోడు. మరోవైపు పంతులు భార్య అనారోగ్యం పాలవుతుంది. ఓ వైపు భార్య, మరోవైపు సీతమ్మవారికి బంగారు తాళి రెండింటి మధ్య పంతులు ఏం చేశాడన్నదే సీతా రాములు కథ.

సీతా రాములు ఓటీటీ స్ట్రీమింగ్

మనసును మెలిపెట్టే డైలాగ్స్, కన్నీళ్లు తెప్పించే ఎల్‌బీ శ్రీరామ్ నటనతో ఈ సినిమా సాగినట్లు సీతా రాములు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. చక్కటి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన సీతా రాములు ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది.

ఈటీవీ విన్ ఓటీటీలో

ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో మార్చి 22న సీతా రాములు ఓటీటీ రిలీజ్ అయింది. ప్రతివారం ఈటీవీ విన్ ఓటీటీ వీక్లీ సిరీస్ కథా సుధలో భాగంగా సీతా రాములు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అచ్చమైన తెలుగు కంటెంట్, డ్రామాలు ఇష్టపడేవారు ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారం అవుతున్న సీతా రాములు సినిమాను ఎంచక్కా వీక్షించేయవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More