చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.
మురళీ మోహన్, అనన్య నాగళ్ల థ్రిల్లర్ మూవీ ది బ్రేకింగ్ న్యూస్- ట్రైలర్ రిలీజ్ చేసిన సుమంత్- రిలీజ్ ఎప్పుడంటే?
Murali Mohan Ananya Nagalla The Breaking News: సీనియర్ నటుడు మురళీ మోహన్, యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ది బ్రేకింగ్ న్యూస్'. మీడియా రంగంలోని తెరవెనుక పరిణామాలు, ఉత్కంఠభరిత అంశాల నేపథ్యంలో పవన్ కడియాల తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు.
Murali Mohan Ananya Nagalla The Breaking News: తెలుగు వెండితెరపై వైవిధ్యమైన కథాంశాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ ఆదరణ లభిస్తుంటుంది. ఈ క్రమంలో వార్తా ప్రపంచంలోని తెరవెనుక పరిణామాలు, మీడియా రంగం నేపథ్యంలో రూపొందిన ఆసక్తికర థ్రిల్లర్ 'ది బ్రేకింగ్ న్యూస్' విడుదలకు సిద్ధమైంది.

ది బ్రేకింగ్ న్యూస్ రిలీజ్ డేట్
సీనియర్ నటుడు మురళీ మోహన్, టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ది బ్రేకింగ్ న్యూస్ చిత్రాన్ని డిసెంబర్ 11, 2026న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
మీడియా ప్రపంచం చుట్టూ ఉత్కంఠభరిత కథనం
ఓపెన్ స్కై క్రియేషన్స్ పతాకంపై హనుమంత రెడ్డి, ఉమా గుటూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు పవన్ కడియాల స్వయంగా కథ, కథనాలను అందిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. సాధారణంగా టాలీవుడ్లో మీడియా నేపథ్యంలో వచ్చే సినిమాలు సామాజిక అంశాలను ప్రశ్నిస్తూ ఉత్కంఠ రేకెత్తిస్తాయి.
'ది బ్రేకింగ్ న్యూస్' కూడా వార్తా విభాగాల్లో జరిగే అనూహ్య మలుపులు, నిజానిజాల వేట చుట్టూ సాగే గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంది. 'మల్లేశం', 'వకీల్ సాబ్', 'పొట్టేల్' వంటి చిత్రాలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల, ఈ సినిమాలో మరో బలమైన పాత్రలో కనిపించనున్నారు.
అనుభవజ్ఞుడైన మురళీ మోహన్ పాత్ర కథకు ప్రధాన బలంగా నిలవనుంది. వీరితో పాటు సోనియ నాయుడు, ఆర్.కె. నాయుడు, వాసుదేవ్, ప్రేమ్ కృష్ణ, రవి ప్రకాష్, వాహిని తదితరులు ఈ ది బ్రేకింగ్ న్యూస్ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
చిరంజీవి ఆశీస్సులు.. సుమంత్ చేతుల మీదుగా ట్రైలర్
ప్రారంభం నుంచే ది బ్రేకింగ్ న్యూస్ చిత్రానికి సినీ ప్రముఖుల మద్దతు లభించింది. సినిమా ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. తాజాగా నవంబర్ 20న టాలీవుడ్ హీరో సుమంత్ ది బ్రేకింగ్ న్యూస్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ది బ్రేకింగ్ న్యూస్ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన లభిస్తోంది. సన్నివేశాల్లోని ఉత్కంఠ, నేపథ్య సంగీతం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ ఈ చిత్రానికి బాణీలు, నేపథ్య సంగీతం అందించడం విశేషం. ఆయన సంగీతం థ్రిల్లర్ మూడ్‌ను మరింత ఎలివేట్ చేస్తుందని చిత్రవర్గాలు భావిస్తున్నాయి.
సాంకేతిక నిపుణుల సమష్టి కృషి
సాంకేతిక విభాగంలోనూ అనుభవజ్ఞులు ఈ సినిమా కోసం పనిచేశారు. సైనాథ్ ఛాయాగ్రహణం అందించగా, శిరీష్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. జి. పురుషోత్తం రాజు సౌండ్ డిజైనింగ్ అందించారు. రేఖ బైరి, నరేన్ కె సహ నిర్మాతలుగా వ్యవహరించగా, రమణ రెడ్డి తాటిరెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.
బి.ఎన్. గణేష్ భట్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా, సంజీవ్ ధరణి, సాయి యోగేష్ అసోసియేట్ డైరెక్టర్లుగా దర్శకుడికి సహకరించారు. శ్రీనివాస్ శాములేటి అసోసియేట్ ఎడిటర్‌గా, రాకేష్ పట్వారీ, రోహిన్ ఏటూరి, అర్చన టి.ఎన్. క్రియేటివ్ టీమ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
పటిష్టమైన కథతో
మిట్టు అరెట్టి పబ్లిసిటీ డిజైనర్‌గా, లూర్డు ఫిల్మ్ వీడియో ఎడిటర్‌గా, వీరబాబు పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు. మధుర ఆడియో ద్వారా ఈ చిత్రం ఆడియో హక్కులు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. పటిష్టమైన కథ, సమర్థవంతమైన తారాగణంతో డిసెంబర్ 11న థియేటర్లలో అడుగుపెడుతున్న 'ది బ్రేకింగ్ న్యూస్' ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

E-Paper
