...
...
Next Story

Meena: రూ.10 కోట్లతో నిర్మాణం.. రూ.100 కోట్లకు అమ్మకం.. సీనియర్ నటి మీనా ప్యాలెస్ కథ ఇదే.. నిజంగానే డీల్ జరిగిందా?

Meena: సీనియర్ నటి మీనా ఇల్లు విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్యాలెస్ లాంటి ఆమె బంగ్లాను రూ.100 కోట్లకు అమ్మారని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీని వెనుక ఉన్న కథ, అసలు నిజంగా డీల్ జరిగిందా? లేదా? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Apr 24, 2026, 12:36:01 IST
Advertisement

Meena: ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన నటి మీనా. తెలుగులోనూ అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేసింది. ఇప్పుడు కథా బలమున్న క్యారెక్టర్లు ఎంపిక చేసుకుంటూ, సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే చేస్తోంది. అయితే ఈ మధ్య మీనా ఇల్లు గురించి తెగ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రూ.10 కోట్ల ఇల్లును రూ.100 కోట్లకు అమ్మిందనే టాపిక్ తెగ వైరల్ అయింది.

మీనా ఇల్లు

మీనా (x/ActressMeena_)
మీనా (x/ActressMeena_)

సీనియర్ నటి మీనాకు చెన్నైలోని సైదాపేట శ్రీరామ్ కాలనీలో ఓ పెద్ద బంగ్లా ఉంది. ప్యాలెస్ లా ఉన్న ఈ ఇల్లు గురించి ఇప్పుడు వార్తలు తెగ వైరల్ గా మారాయి. 20 ఏళ్ల క్రితమే మీనా ఎంతో ఇష్టంగా ఈ ఇల్లు కట్టించుకుంది. కేరళ సంప్రదాయ శైలిలో రాజభవనంలా ఈ ఇంటిని తీర్చిదిద్దుకుంది. ఇందుకు అప్పట్లో సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేసిందని తెలిసింది.

రూ.100 కోట్లకు

రూ.10 కోట్లతో ఖర్చుతో మీనా దగ్గరుండి మరీ కట్టించుకున్న ఇల్లును ఇప్పుడు ఆమె రూ.100 కోట్లకు అమ్మిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రూ.10 కోట్లు పెడితే రూ.100 కోట్లు వచ్చాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ ఎన్ఆర్ఐ జోడీ ఈ బంగ్లాపై మనసు పడిందని, అందుకే రూ.100 కోట్లు అయినా ఓకే అన్నారనే వార్తలు వచ్చాయి.

ఎలాంటి డీల్ జరగలేదని

తన ఇల్లు అమ్మకం గురించి మీనా ఇంతవరకూ స్పందించలేదు. అయితే మీనా సన్నిహితులు మాత్రం దీనిపై ఓ క్లారిటీనిచ్చారు. మీనా ఇల్లు అమ్మిందనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని, ఇది కేవలం పుకారు మాత్రమే అని కొట్టిపారేశారు. మీనాకు కేవలం అది ఒక బిల్డింగ్ మాత్రమే కాదని, అంతకు మించిన ఎమోషన్ అని తెలిపారు.

తెలుగులో చంటి, సుందరకాండ, సూర్యవంశం, ముఠా మేస్త్రి, బొబ్బిలి సింహం, అల్లరి అల్లుడు, సీతారామయ్య గారి మనవరాలు తదితర సినిమాలతో మీనా అలరించింది. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ సీనియర్ నటి తిరిగి దృశ్యంతో అదరగొట్టింది. దృశ్యం 2లోనూ తన నటనతో మెప్పించింది. ఇప్పుడు దృశ్యం 3తో త్వరలో ఆడియన్స్ ను పలకరించబోతుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks