Rajasekhar: యాంగ్రీ యంగ్ మెన్ క్యారెక్టర్లతో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో రాజశేఖర్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. మూవీస్ లో కీ రోల్స్ చేస్తున్నారు. తాజాగా బైకర్ మూవీలో హీరో తండ్రిగా అదరగొట్టారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తన పెళ్లి, సినిమాల గురించి చెప్పుకొచ్చారు.
శ్రీదేవి సంబంధం

జీవితను రాజశేఖర్ ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన రాజశేఖర్ తన పెళ్లికి ముందు జరిగిన సంగతులను గుర్తు చేసుకున్నారు. అప్పుడు హీరోయిన్ శ్రీదేవి సంబంధం కూడా వచ్చిందని, ఇంట్లోవాళ్లు ఆమెను పెళ్లి చేసుకోమన్నారని రాజశేఖర్ పేర్కొన్నారు.
సింగిల్ గా ఉంటానని
‘‘జీవిత నాకు ప్రపోజ్ చేసేలా చేశా. ఇంట్లో జీవిత విషయం చెప్పా. కానీ మా అమ్మ నాకు మరో సంబంధం చూసింది. ఆ అమ్మాయితో పాటు జీవితను గుడికి రమ్మన్నా. అక్కడ వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్లు స్కూల్ ఫ్రెండ్స్ అంట’’ అని రాజశేఖర్ తెలిపారు.
‘‘శ్రీదేవి సంబంధం వచ్చింది. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమన్నారు. ఈ విషయం జీవితకు చెప్పా. ‘మీకు ఇష్టముంటే చేసుకోండి. కానీ నేను మాత్రం ఇంకొకరిని పెళ్లి చేసుకోను. ఎప్పటికీ సింగిల్ గా ఉండిపోతా’ అని అప్పుడు జీవిత చెప్పింది’’ అని రాజశేఖర్ చెప్పారు.
డాక్టర్ కావాలని
రాజశేఖర్ నిజంగానే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారు. వాళ్ల ఇంట్లో రాజశేఖర్ ను డాక్టర్ చేయాలని ఉండేది. కానీ రాజశేఖర్ ఏమో యాక్టర్ అవుతానని చెప్పారు. దీంతో అతణ్ని ఇంట్లో నుంచి బయటకు పొమ్మన్నారు. చేసేదేం లేక యాక్టింగ్ పై ఇష్టంతో రాజశేఖర్ బయటకు వచ్చేశారు. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ వెల్లడించారు.
ఆ సినిమాలు చేసి ఉంటే
రాజశేఖర్ తన కెరీర్ లో డిఫరెంట్ క్యారెక్టర్లు ప్లే చేశారు. ముఖ్యంగా పోలీస్ పాత్రలు ఇరగదీశారు. అయితే చంటి, జెంటిల్మెన్ సినిమాలను రాజశేఖర్ చేయాల్సిందంటా. కానీ ఆ మూవీస్ చేయలేకపోయానని రాజశేఖర్ చెప్పారు. చంటి మూవీ కోసం చెన్నై నుంచి వచ్చే లోపు, వెంకటేష్ ఆ సినిమా చూసి కొనేశారని రాజశేఖర్ అన్నారు.
సునీల్ నారాయణ్
{{/usCountry}}రాజశేఖర్ తన కెరీర్ లో డిఫరెంట్ క్యారెక్టర్లు ప్లే చేశారు. ముఖ్యంగా పోలీస్ పాత్రలు ఇరగదీశారు. అయితే చంటి, జెంటిల్మెన్ సినిమాలను రాజశేఖర్ చేయాల్సిందంటా. కానీ ఆ మూవీస్ చేయలేకపోయానని రాజశేఖర్ చెప్పారు. చంటి మూవీ కోసం చెన్నై నుంచి వచ్చే లోపు, వెంకటేష్ ఆ సినిమా చూసి కొనేశారని రాజశేఖర్ అన్నారు.
సునీల్ నారాయణ్
{{/usCountry}}శర్వానంద్ హీరోగా వచ్చిన బైకర్ మూవీలో రాజశేఖర్ అదరగొట్టారు. హీరో తండ్రి, ఒకప్పటి రేసర్ అయిన సునీల్ నారాయణ అనే క్యారెక్టర్ ప్లే చేశారు. కొడుకును ఛాంపియన్ గా తీర్చదిద్దాలనే కలతో, స్వయంగా శిక్షణ ఇస్తాడు ఆ తండ్రి. ఇప్పుడీ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.