OTT: 44 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటీటీలోకి కమల్ హాసన్, శ్రీదేవి క్లాసిక్ మూవీ.. ఇక్కడ చూసేయండి
OTT: భారతీయ సినీ చరిత్రలో అద్భుత కావ్యంగా నిలిచిపోయిన 'వసంత కోకిల' (తమిళంలో మూండ్రం పిరై) ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతోంది. 44 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
OTT: వసంత కోకిల.. తమిళంలోనే కాదు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ అయిన సినిమా ఇది. అయితే 44 ఏళ్ల కిందట థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికీ ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరపడింది. బాలూ మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన దృశ్యకావ్యం 'మూండ్రం పిరై' (తెలుగులో 'వసంత కోకిల') డిజిటల్ ప్రిమియర్‌కు సర్వం సిద్ధమైంది. సత్యజ్యోతి ఫిల్మ్స్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

రేపటి నుంచే స్ట్రీమింగ్
కమల్ హాసన్, శ్రీదేవి నటించిన మూవీ వసంత కోకిల. 1982లో థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు 44 సంవత్సరాల తర్వాత ఈ మూవీ తమిళ ఒరిజినల్ మూండ్రం పిరై మొదటిసారిగా ఓటీటీ వేదికపై అలరించనుంది. రేపటి నుంచి అంటే శుక్రవారం మే 1 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
తాజాగా ఈ సినిమాను హై-క్వాలిటీ విజువల్స్‌తో రీ-మాస్టర్ చేశారు. పాత తరం ప్రేక్షకులకు నోస్టాల్జియాను పంచడమే కాకుండా, నేటి తరం సినీ ప్రేమికులకు ఒక గొప్ప సినిమాను చూసే అవకాశం లభించింది.
తెలుగు ప్రేక్షకులకు నిరాశేనా?
అయితే ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం తమిళ వెర్షన్‌లోనే అందుబాటులోకి వస్తున్నట్లు సమాచారం. తెలుగులో 'వసంత కోకిల'గా ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇక్కడి ప్రేక్షకులకు కమల్ - శ్రీదేవిల అభినయం, ఇళయరాజా సంగీతం అంటే విపరీతమైన క్రేజ్.
కానీ ప్రస్తుతానికి కేవలం తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కానుండటం తెలుగు ఫ్యాన్స్‌ను కొంత నిరాశకు గురిచేసే విషయమే. భవిష్యత్తులో తెలుగు ఆడియోను కూడా జత చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
అవార్డుల పంట పండించిన అద్భుతం
ఒక సామాన్య ఉపాధ్యాయుడు (చీను), మానసిక స్థితి సరిగ్గా లేని యువతి (భాగ్యలక్ష్మి) మధ్య సాగే సున్నితమైన భావోద్వేగాల ప్రయాణమే ఈ సినిమా. ఈ చిత్రంలో అద్భుతమైన నటనకు గాను కమల్ హాసన్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు.
దర్శకుడు బాలూ మహేంద్ర తన అద్భుతమైన విజువల్స్‌తో ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో నేషనల్ అవార్డు అందుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో కమల్ హాసన్ నటన ఇప్పటికీ ఎంతో మంది నటులకు ఒక పాఠం లాంటిది. ఇళయరాజా అందించిన సంగీతం, పాటలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సినిమా అంటే కేవలం ఓ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. అదొక అనుభూతి అని నమ్మే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం ఇది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. వసంత కోకిల (మూండ్రం పిరై) ఏ ఓటీటీలో విడుదలవుతోంది?
ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ కానుంది.
2. వసంత కోకిక సినిమా ఏ భాషలో అందుబాటులో ఉంటుంది?
ప్రస్తుతానికి ఒరిజినల్ తమిళ వెర్షన్ (Moondram Pirai) మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.
3. వసంత కోకిల సినిమాకు ఎన్ని జాతీయ అవార్డులు వచ్చాయి?
ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు లభించాయి. కమల్ హాసన్‌కు ఉత్తమ నటుడిగా, బాలూ మహేంద్రకు ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా అవార్డులు దక్కాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


