...
...
Next Story

Serial Actors Marriage: 11 ఏళ్ల చిన్నదానితో 44 ఏళ్ల సీరియల్ నటుడి రెండో వివాహం- సీరియల్ నటీనటుల పెళ్లి ఫొటోలు వైరల్

Serial Actor Nandish Singh Sandhu Kavita Banerjee Marriage: బుల్లితెర నటుడు నందీశ్ సింగ్ సంధు 44 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకున్నారు. తనకంటే 11 ఏళ్లు చిన్నదైన మరో సీరియల్ నటి కవితా బెనర్జీ మెడలో నందీశ్ మూడు ముళ్లు వేశారు. నందీశ్ సింగ్ సంధు, కవితా బెనర్జీ పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Published on: Nov 15, 2026, 22:24:31 IST
Advertisement

Serial Actor Nandish Singh Sandhu Kavita Banerjee Marriage: బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు నందీశ్ సింగ్ సంధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన సహచర నటి కవితా బెనర్జీని ఆయన వివాహం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో నవంబర్ 14న నందీశ్ సింగ్, కవితా బెనర్జీ పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరిగింది.

11 ఏళ్ల చిన్నదానితో 44 ఏళ్ల సీరియల్ నటుడి రెండో వివాహం- సీరియల్ నటీనటుల పెళ్లి ఫొటోలు వైరల్
11 ఏళ్ల చిన్నదానితో 44 ఏళ్ల సీరియల్ నటుడి రెండో వివాహం- సీరియల్ నటీనటుల పెళ్లి ఫొటోలు వైరల్

అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో బెంగాలీ సంప్రదాయ పద్ధతిలో ఈ జంట ఒక్కటయ్యారు. అట్టహాసాలకు దూరంగా, సంప్రదాయ విలువలకు పెద్దపీట వేస్తూ వీరు తమ జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

బెంగాలీ సంప్రదాయంలో ఆకట్టుకున్న వేడుకలు

నవంబర్ 13నే హుగ్లీలో పెళ్లి సందడి మొదలైంది. తొలిరోజు నిశ్చితార్థంతో పాటు సంగీత్ వేడుకను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు డ్యాన్సులతో హోరెత్తించారు. మరుసటి రోజు అంటే నవంబర్ 14 ఉదయం హల్దీ వేడుక జరగగా, సాయంత్రం బెంగాలీ ఆచారాల ప్రకారం నందీశ్, కవిత పెళ్లి ప్రమాణాలు చేశారు.

ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి పీటలపై ఈ కొత్త జంట సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. వధువు కవితా బెనర్జీ ఎరుపు, క్రీమ్ రంగు కలగలిసిన బెనారసీ చీరలో అచ్చమైన బెంగాలీ పెళ్లికూతురిలా ముస్తాబయ్యారు.

నందీశ్ సైతం క్రీమ్ రంగు ధోతీ, కుర్తా ధరించి సంప్రదాయబద్ధంగా కనిపించారు. ఆధునిక హంగుల కంటే తమ మూలాలకు, సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూ వీరు ఎంచుకున్న వస్త్రధారణ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఏడాది క్రితమే రహస్యంగా నిశ్చితార్థం

ఆ తర్వాత నందీశ్ తమ నిశ్చితార్థపు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. "హాయ్ పార్ట్‌నర్.. రెడీ" అంటూ ఆయన ఆ ఫోటోలకు ఆసక్తికర క్యాప్షన్ జతచేశారు. కవిత సైతం తన నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ, దిష్టి తగలకుండా ఉండే ఎమోజీతో పాటు '05/09/2025' తేదీని స్టోరీగా పోస్ట్ చేశారు.

వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముందు తమకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నందీశ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కొత్త జీవితాన్ని ప్రారంభించే వేళ అభిమానులు, శ్రేయోభిలాషులు కురిపించిన ప్రేమ, ఆశీర్వాదాలు తమకు ఎంతో బలాన్ని ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు.

44 ఏళ్ల వయసులో నందీశ్ రెండో వివాహం

'ఉత్తరన్' వంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నందీశ్ సింగ్ సంధుకు ఇది రెండో వివాహం. ప్రస్తుతం 44 ఏళ్ల వయసున్న నందీశ్, గతంలో ప్రముఖ బుల్లితెర నటి రష్మీ దేశాయ్‌ను వివాహం చేసుకున్నారు.

షూటింగ్ సెట్స్‌లో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారడంతో 2012లో పెళ్లి చేసుకున్నారు. కానీ, మనస్పర్థల కారణంగా రెండేళ్లకే అంటే 2014లో వీరు విడిపోయారు. 2016లో వీరు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఒంటరిగా ఉన్న నందీశ్, ఇప్పుడు కవితతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.

11 ఏళ్లు చిన్న

నందీశ్ కంటే కవితా బెనర్జీ 11 ఏళ్లు చిన్నవారు. హిందీ టెలివిజన్ రంగంలో కవిత కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 'తేరీ మేరీ ఇక్ జింద్రీ', 'భాగ్యలక్ష్మి' వంటి ప్రజాదరణ పొందిన సీరియల్స్‌లో ఆమె కీలక పాత్రలు పోషించారు.

నందీశ్ సంధు, కవితా బెనర్జీ పెళ్లి
సీరియల్ నటీనటుల పెళ్లి వేడుక

సీరియల్ నటీనటులు

బుల్లితెరపై తమ నటనతో ఆకట్టుకున్న ఈ జంట.. నిజ జీవితంలోనూ ఆదర్శ దంపతులుగా నిలవాలని అభిమానులు, తోటి నటీనటులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks