Serial Actress Alimony: భర్త నుంచి 10 కోట్ల భరణంపై సీరియల్ నటి ఆకాంక్ష క్లారిటీ- తల్లిని కావాలని లేదంటూ కామెంట్స్

Serial Actress Akanksha Chamola About 10 Cr Alimony: ప్రముఖ టీవీ నటుడు గౌరవ్ ఖన్నా నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన నటి ఆకాంక్ష చమోలా, తాజాగా రూ.10 కోట్ల భరణం వార్తలపై స్పందించారు. అలాగే, తనకు జీవితంలో తల్లిని కావాలని లేదని, అలాంటప్పుడు గౌరవ్‌ను ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పింది ఆకాంక్ష.

Published on: Sep 13, 2026, 08:17:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Serial Actress Akanksha Chamola About 10 Cr Alimony: రియాలిటీ ఓటీటీ షో 'లాక్ అప్ 2'లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు నటి ఆకాంక్ష చమోలా. హిందీ బుల్లితెరపై ‘అనుపమ’ సీరియల్ ద్వారా ఎంతో ప్రజాదరణ పొందిన గౌరవ్ ఖన్నాతో తన ఎనిమిదేళ్ల వివాహ బంధం ముగిసిపోతుందని ప్రకటిస్తూ ఆమె తీవ్ర చర్చకు తెరతీశారు.

భర్త నుంచి 10 కోట్ల భరణంపై సీరియల్ నటి ఆకాంక్ష క్లారిటీ- తల్లిని కావాలని లేదంటూ కామెంట్స్
భర్త నుంచి 10 కోట్ల భరణంపై సీరియల్ నటి ఆకాంక్ష క్లారిటీ- తల్లిని కావాలని లేదంటూ కామెంట్స్

విడాకుల వ్యవహారంలో

అయితే విడాకుల వ్యవహారంలో సీరియల్ హీరోయిన్ ఆకాంక్ష చమోలా ఏకంగా రూ.10 కోట్ల భరణం డిమాండ్ చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ రూమర్లపై ఆకాంక్ష చమోలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

రూ.10 కోట్ల భరణం వార్తలపై ఆకాంక్ష కామెంట్స్

తనపై వస్తున్న భరణం ప్రచారంపై ఆకాంక్ష స్పష్టత ఇచ్చారు. "నా దగ్గర నిజంగానే అంత డబ్బు ఉంటే ఇక్కడ ఎందుకు కూర్చుంటాను? అంత మొత్తంలో డబ్బు వచ్చి ఉంటే ఎప్పుడో ఈ దేశం విడిచి వెళ్లిపోయేదాన్ని" అని ఆకాంక్ష పేర్కొన్నారు. ఆ డబ్బుతో ప్రపంచమంతా చుట్టి వచ్చేదాన్నని, రకరకాల ప్రాంతాలను సందర్శిస్తూ గడిపేదాన్నని వ్యాఖ్యానించారు.

'లాక్ అప్ 2' వేదికగా విడాకుల గుట్టు

'లాక్ అప్ 2' షో తొలి ఎపిసోడ్‌లోనే గౌరవ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ఆకాంక్ష బయటపెట్టారు. ఈ ప్రకటన తమ కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఇరువైపుల బంధువులకు సమాధానం చెప్పుకోలేకపోయానని గౌరవ్ ఖన్నా షోలోకి అతిథిగా వచ్చినప్పుడు చెప్పారు. ఆ తర్వాత కూడా ఆకాంక్ష పలు సంచలన విషయాలను వెల్లడించారు. పెళ్లికి ముందే తాను బైసెక్సువల్ అని, ఇప్పుడు అసెక్షువల్‌గా మారానని చెప్పారు.

మాతృత్వపు ఆలోచనలు లేవు

తన వైవాహిక జీవితంలో వచ్చిన విభేదాలను వివరిస్తూ.. "చాలామంది పిల్లలను కని, వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికే పెళ్లి చేసుకుంటారు. కానీ నాకు మాత్రం తల్లిని కావాలనే ఆలోచన లేదు. గౌరవ్‌కి పిల్లలు అంటే చాలా ఇష్టం. అతను కోరుకోవడంలో తప్పులేదు. కానీ నేను అతనికి ఆ సంతోషాన్ని ఇవ్వలేనప్పుడు, అతనిని ఇబ్బంది పెట్టడం సరికాదనిపించింది" అని ఆకాంక్ష వివరించారు.

2016లో వైభవంగా వివాహం

2016 నవంబర్ 24న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆకాంక్ష, గౌరవ్ ఖన్నాల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఒక ఆడిషన్ సమయంలో పరిచయమైన వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకుని పెళ్లి పీటలెక్కారు. దంపతుల మధ్య ఉన్న భిన్నమైన ఆలోచనల కారణంగా ఇప్పుడు విడిపోతున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

Q1: ఆకాంక్ష చమోలా భర్త ఎవరు?

A1: ఆకాంక్ష చమోలా భర్త ప్రముఖ హిందీ టీవీ నటుడు గౌరవ్ ఖన్నా. ఈయన ‘అనుపమ’ ధారావాహిక ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్నారు.

Q2: ఆకాంక్ష చమోలా రూ.10 కోట్ల భరణం అడిగారనే వార్త నిజమేనా?

A2: లేదు, ఆ వార్తల్లో నిజం లేదని ఆకాంక్ష స్పష్టం చేశారు. తనకు అంత డబ్బు వస్తే ఎప్పుడో దేశం విడిచి విహారయాత్రలకు వెళ్లేదాన్నని సమాధానమిచ్చారు.

Q3: గౌరవ్ ఖన్నా, ఆకాంక్ష ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు?

A3: వీరిద్దరూ 2016 నవంబర్ 24న కాన్పూర్‌లో వైభవంగా వివాహం చేసుకున్నారు.

Q4: ఆకాంక్ష విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి?

A4: పిల్లలను కనడంపై ఇద్దరి ఆలోచనలు వేర్వేరుగా ఉండటమే ప్రధాన కారణమని, తనకు మాతృత్వపు ఆలోచనలు లేవని ఆకాంక్ష తెలిపారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More