Serial TRP: మళ్లీ టాప్ లేపిన కార్తీక దీపం 2.. జస్ట్ 0.01 తేడాతో సెకండ్ ప్లేస్ లో ఆ సీరియల్.. 24వ వారం సీరియల్ రేటింగ్స్

Serial TRP: ఫ్యామిలీ ఆడియన్స్ ను తెగ ఎంటర్ టైన్ చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ మళ్లీ టాప్ లోకి దూసుకొచ్చింది. 24వ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ లో ఈ బ్లాక్ బస్టర్ సీరియల్ అత్యధిక రేటింగ్ దక్కించుకుంది. పూర్తి లిస్ట్ పై ఓ లుక్కేయండి. 

Published on: Jun 27, 2026, 18:33:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Serial TRP: తెలుగు టీవీ సీరియల్స్ లో కార్తీక దీపం 2 సీరియల్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. కార్తీక దీపం సీరియల్ కు వచ్చిన విపరీతమైన సక్సెస్ కారణంగా ఇప్పుడు సీక్వెల్ కూడా కొనసాగుతోంది. ఈ కార్తీక దీపం 2 సీరియల్ కూడా తెలుగు ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంటోంది. సీరియల్ టీవీ టీర్పీ రేటింగ్ లో కార్తీక దీపం 2 దూసుకెళ్లడమే ఇందుకు నిదర్శనం.

మళ్లీ టాప్ లేపిన కార్తీక దీపం 2.. జస్ట్ 0.01 తేడాతో సెకండ్ ప్లేస్ లో ఆ సీరియల్ (x/starmaa)
మళ్లీ టాప్ లేపిన కార్తీక దీపం 2.. జస్ట్ 0.01 తేడాతో సెకండ్ ప్లేస్ లో ఆ సీరియల్ (x/starmaa)

టాప్ లేపిన కార్తీక దీపం 2

కార్తీక దీపం 2 సీరియల్ ఇప్పటికే 700 ఎపిసోడ్లు దాటింది. ఈ సీరియల్ మెజారిటీ వారాలు టీఆర్పీ రేటింగ్ లో టాప్ లోనే కొనసాగుతోంది. మధ్యలో కాస్త తడబడ్డా ఈ మెగా సీరియల్ ఎప్పటికప్పుడూ పుంజుకుంటోంది. తాజాగా 24వ వారం బార్క్ రేటింగ్ లో కార్తీక దీపం 2 సీరియల్ మళ్లీ టాప్ లోకి వచ్చింది.

నంబర్ వన్ సీరియల్

జూన్ 12 నుంచి జూన్ 19 వరకు బార్క్ రిలీజ్ చేసిన టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ లో కార్తీక దీపం నంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. అర్బన్ ప్లస్ రూరల్ కలిపి ఈ సీరియల్ కు 11.38 రేటింగ్ వచ్చింది. జస్ట్ 0.01 రేటింగ్ తేడాతో గుండె నిండా గుడి గంటలు సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అదే కేవలం అర్బన్ మాత్రమే తీసుకుంటే గుండె నిండా గుడి గంటలు సీరియల్ 11.08 రేటింగ్ తో టాప్ లో ఉంది. కార్తీక దీపం 9.32తో ఉంది.

స్టార్ మా సీరియల్స్ రేటింగ్

  1. కార్తీక దీపం 2- 11.38 (U+R)
  2. గుండె నిండా గుడి గంటలు- 11.37 (U+R)
  3. ఇంటింటి రామాయణం- 10.27 (U+R)
  4. ఇల్లు ఇల్లాలు పిల్లలు- 10.05 (U+R)
  5. పొదరిల్లు- 9.27 (U+R)

దీప సీఈఓ

గత వారం కార్తీక దీపం 2 సీరియల్స్ లో అదిరిపోయే ట్విస్ట్స్ అండ్ టర్న్స్ నెలకొన్నాయి. సీఈఓ పోస్టు కోసం జ్యోత్స్న ఎన్ని కుట్రలు వేసినా చివరకు దీపే గెలిచింది. అన్ని పరీక్షలు దాటుకుని రెస్టారెంట్ బ్రాంచ్ ను లాభాల్లోకి తీసుకొచ్చిన దీపను శివ నారాయణ సీఈఓగా నియమించాడు. దీంతో జ్యో పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుకలా మారింది.

ఈ సీరియల్స్ కూడా

కార్తీక దీపం 2, గుండె నిండా గుడి గంటలతో పాటు ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఇంటింటి రామాయణం, పొదరిల్లు సీరియల్స్ కూడా మంచి రేటింగ్ తో సాగిపోతున్నాయి. ఓవరాల్ గా టీవీ ఛానెల్స్ సీరియల్స్ రేటింగ్ లో తిరుగులేని ఆధిపత్యంతో స్టార్ మా దూసుకెళ్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More