...
...
Next Story

Rajinikanth Shah Rukh Khan: జైలర్ 2లో రజనీకాంత్, షారుక్ ఖాన్.. కన్ఫమ్ చేసిన మోహన్‌లాల్ స్టైలిస్ట్.. పోస్ట్ వైరల్

సూపర్ స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న 'జైలర్ 2' (Jailer 2) చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (Rajinikanth Shah Rukh Khan) నటించనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. మోహన్ లాల్ స్టైలిస్ట్ చేసిన ఒక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.

Published on: Mar 5, 2026, 18:28:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

రజనీకాంత్ నటించిన జైలర్ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు తిరగరాసిందో మనకు తెలుసు. 2023లో వచ్చిన ఈ 'జైలర్' సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమాలో ఇప్పటికే మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి దిగ్గజ తారలు భాగం కాగా.. ఇప్పుడు భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ కొలాబరేషన్ జరగబోతోందని సమాచారం. షారుక్ ఖాన్ ఈ సినిమాలో ఒక కీలకమైన క్యామియో రోల్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

వైరల్ పోస్ట్ వెనుక కథ

Rajinikanth Shah Rukh Khan: జైలర్ 2లో రజనీకాంత్, షారుక్ ఖాన్.. కన్ఫమ్ చేసిన మోహన్‌లాల్ స్టైలిస్ట్.. పోస్ట్ వైరల్
Rajinikanth Shah Rukh Khan: జైలర్ 2లో రజనీకాంత్, షారుక్ ఖాన్.. కన్ఫమ్ చేసిన మోహన్‌లాల్ స్టైలిస్ట్.. పోస్ట్ వైరల్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్టైలిస్ట్ జిషాద్ షంసుద్దీన్ షేర్ చేసిన ఒక ఏఐ (AI) ఫోటో ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. ఆ ఫోటోలో షారుక్ ఖాన్ కారు నడుపుతుండగా, పక్కన మోహన్ లాల్.. వెనుక సీట్లో రజనీకాంత్, శివరాజ్ కుమార్ కూర్చుని ఉన్నారు. ఈ ఫోటోను రీ-షేర్ చేస్తూ జిషాద్ “కచ్చితంగా ఉంటుంది (Kandippa irukkum)” అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో షారుక్ ఖాన్ జైలర్ సీక్వెల్‌లో ఉండటం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు.

మిథున్ చక్రవర్తి హింట్

గతేడాది డిసెంబర్‌లో సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నా తదుపరి సినిమా జైలర్ 2. ఇందులో రజనీకాంత్, మోహన్ లాల్, షారుక్ ఖాన్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్ వంటి వారందరూ నా పాత్రకు వ్యతిరేకంగా పోరాడుతారు" అని పేర్కొన్నాడు.

అతని మాటలను బట్టి చూస్తే మిథున్ ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారని, షారుక్ ఖాన్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది.

తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో రజనీ - షారుఖ్

విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వేసవి చివరలో 'జైలర్ 2' థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. సన్ పిక్చర్స్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe