Shah Rukh Khan: రూ.2490 కోట్ల సంపద కోల్పోయిన షారుఖ్ ఖాన్.. అయినా రూ.10 వేల కోట్లపైనే.. ఇండియాలో రిచెస్ట్ యాక్టర్
Shah Rukh Khan: ఇండియాలో రిచెస్ట్ యాక్టర్ గా మరోసారి షారుఖ్ ఖాన్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అయితే గతేడాదితో పోలిస్తేఈసారి సంపద విలువ భారీగా తగ్గడం గమనార్హం. మరోవైపు అమితాబ్ ఆస్తి అనూహ్యంగా భారీగా పెరిగి రెండో స్థానానికి చేరుకున్నారు.
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆస్తి ఒకే సంవత్సరంలో ఏకంగా రూ. 2,490 కోట్లు పడిపోయినా, ఇండియాలోనే అత్యంత సంపన్న నటుడిగా తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 ప్రకారం ఆయన మొత్తం నెట్ వర్త్ రూ. 10,000 కోట్లుగా నమోదైంది. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ కంటే షారుఖ్ చాలా ముందంజలో నిలిచారు.

షారుఖ్ ఆస్తి రూ. 2,490 కోట్లు ఎందుకు తగ్గింది?
2025 హురున్ రిచ్ లిస్ట్‌లో షారుఖ్ నెట్ వర్త్ రూ. 12,490 కోట్లుగా ప్రకటించారు. కానీ ఈ ఏడాది వెలువడిన 2026 జాబితాలో అది రూ. 10,000 కోట్లకు పడిపోవడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
సినిమాల ద్వారా వచ్చే రెమ్యూనరేషన్‌తో పాటు ఆయన వ్యాపారాలు, ముఖ్యంగా 'రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్', ఐపీఎల్ టీమ్ 'కోల్‌కతా నైట్ రైడర్స్' (KKR) షేర్ మార్కెట్ వ్యాల్యుయేషన్లలో మార్పుల వల్లే ఈ హెచ్చుతగ్గులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అంతకుముందు వచ్చిన హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో షారుఖ్ ఆస్తి రూ. 10,800 కోట్లుగా అంచనా వేశారు.
హురున్ ఇండియా రిచెస్ట్ యాక్టర్స్
- షారుఖ్ ఖాన్ (రూ.10,000 కోట్లకుపైనే)
- నెట్ వర్త్ మార్పు: రూ. 2,490 కోట్లు తగ్గిన సంపద
- ప్రధాన ఆస్తులు: రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్
- అమితాబ్ బచ్చన్ (రూ.4,000 కోట్లు - గతేడాది కంటే రూ. 2370 కోట్లు పెరిగిన సంపద)
- సల్మాన్ ఖాన్ (రూ. 3 వేల కోట్లు)
- హృతిక్ రోషన్ (రూ.2500 కోట్లు)
అమితాబ్ బచ్చన్ మైండ్ బ్లోయింగ్ జంప్.. సల్మాన్, హృతిక్ నెట్ వర్త్ ఇవే
ఈ రిచ్ లిస్ట్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన ఆస్తి రూ. 4,000 కోట్లుగా నమోదైంది. 2025లో అమితాబ్ నెట్ వర్త్ రూ. 1,630 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది అనూహ్యంగా భారీ జంప్ సాధించడం విశేషం. దశాబ్దాలుగా చేస్తున్న సినిమాలు, భారీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఫ్యామిలీ ఆఫీస్ అసెట్స్ బిగ్ బీ ఆస్తి పెరగడానికి కారణమయ్యాయి.
బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ రూ. 3,000 కోట్ల ఆస్తితో ఈ జాబితాలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ ఆస్తి 2025లో ఉన్న రూ. 2,160 కోట్ల నుంచి రూ. 2,500 కోట్లకు పెరిగింది. అతని సొంత ఫిట్‌నెస్ బ్రాండ్ 'HRX' బిజినెస్ సక్సెస్ కూడా దీనికి ప్రధాన కారణం.
జూహీ చావ్లా, కరణ్ జోహార్ అవుట్.. ప్రొడ్యూసర్లలో అగ్రస్థానం ఎవరిది?
2025 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో మెరిసిన జూహీ చావ్లా, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈసారి 2026 లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయారు. గత ఏడాది జూహీ చావ్లా ఆస్తి రూ. 7,790 కోట్లుగా, కరణ్ జోహార్ ఆస్తి రూ. 1,880 కోట్లుగా ఉంది.
సినిమా ప్రొడక్షన్ బిజినెస్ సైడ్ చూస్తే.. 'రామాయణం' మూవీ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా తండ్రి నరేష్ మల్హోత్రా ఏకంగా రూ. 16,000 కోట్ల ఆస్తితో టాప్‌లో నిలిచారు. వీరితో పాటు ప్రొడ్యూసర్లు భూషణ్ కుమార్, రోనీ స్క్రూవాలా, కళానిధి మారన్ కూడా ఈ ధనవంతుల జాబితాలో స్థానం సాధించారు.
కింగ్ తో వస్తున్న షారుఖ్ ఖాన్
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రం 'కింగ్' రిలీజ్ కోసం సిద్ధమవుతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పదుకోన్, రాణీ ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, సుహానా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాను డిసెంబర్ 24, 2026న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ 'అవెంజర్స్: డూమ్స్‌డే', 'డ్యూన్ పార్ట్ 3' రిలీజ్ డేట్ల మధ్యలో షారుఖ్ 'కింగ్' రాబోతుండటంతో గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


