Bigg Boss Buzz Shalini: గేమ్ ముందే మార్చాల్సింది- ఇక్కడిదాకా తెచ్చుకున్నా- బిగ్ బాస్ బజ్ లో ఏడ్చేసిన శాలిని- శివాజీ షాక్

Bigg Boss Buzz Shalini: ఫైర్ ప్లేయర్ అంటూ బిగ్ బాస్ తెలుగు 10 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శాలిని.. చివరకు కన్నీళ్లతో ఎలిమినేట్ అయింది. ఏడో వారంలో తన జర్నీ ముగిసింది. ఎలిమినేట్ అయిన తర్వాత శివాజీతో బిగ్ బాస్ బజ్ లో శాలిని ఏడ్చేసింది. ఆమె ఫుల్ ఎమోషనల్ అయింది. 

Published on: Oct 26, 2026, 09:35:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss Buzz Shalini: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో శాలిని జర్నీనే డిఫరెంట్ గా సాగింది. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన శాలిని ఏడో వారంలో ఎలిమినేట్ అయింది. ఆరో వారం వీకెండ్ లోనే ఎవిక్ట్ అయి, సీక్రెట్ రూమ్ లోకి వెళ్లింది శాలిని. తిరిగి హౌస్ లోకి అడుగుపెట్టింది.

గేమ్ ముందే మార్చాల్సింది- ఇక్కడిదాకా తెచ్చుకున్నా- బిగ్ బాస్ బజ్ లో ఏడ్చేసిన శాలిని- శివాజీ షాక్ (youtube/starmaa)
గేమ్ ముందే మార్చాల్సింది- ఇక్కడిదాకా తెచ్చుకున్నా- బిగ్ బాస్ బజ్ లో ఏడ్చేసిన శాలిని- శివాజీ షాక్ (youtube/starmaa)

బిగ్ బాస్ శాలిని ఎలిమినేట్

బిగ్ బాస్ తెలుగు 10 నుంచి శాలిని ఎలిమినేట్ అయింది. సీక్రెట్ రూమ్ నుంచి తిరిగి హౌస్ లోకి వచ్చినా శాలిని గేమ్ మాత్రం మారలేదు. ఎంతసేపు రోహిత్ చుట్టూ తిరగడం, ఇతర కంటెస్టెంట్లపై అరవడం తప్పా శాలిని చేసిందేమీ లేదనే ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో శాలిని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎగ్జిట్ అవక తప్పలేదు.

బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన శాలినిని బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో హోస్ట్ శివాజీ సంచలన ప్రశ్నలతో ఆటాడుకున్నాడు. డెవిల్ శాలిని అంటూ పిలిచిన శివాజీ.. ఆమెను దిమ్మతిరిగే ప్రశ్నలు అడిగాడు. ఎదుటివాళ్లు మాట్లాడేటప్పుడు శాలిని ఎలా అరుస్తుందో అలాగే శివాజీ గట్టిగా అరిచాడు. హౌస్ లో ఎఫ్, ఎమ్, డీ వర్డ్స్ వాడటంపైనా శాలినిని ప్రశ్నించాడు.

సీక్రెట్ రూమ్

బిగ్ బాస్ హౌస్ లోకి సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత శాలిని ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హిస్టరీ చూస్తే సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన కంటెస్టెంట్లలో ఒకరు విన్నర్ అయ్యారు, మరొకరు రన్నరప్ అయ్యారు అని రాహుల్ సిప్లిగంజ్, అఖిల్ గురించి శివాజీ చెప్పాడు. హౌస్ లో నిద్రపోయే టైమ్ మినహా మిగతా సమయమంతా రోహిత్ తోనే ఉన్నావని శాలినితో శివాజీ అన్నాడు.

ఏడ్చేసిన శాలిని

బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో భాగంగా శివాజీతో మాట్లాడుతూ శాలిని ఏడ్చేసింది. ‘‘గేమ్ ముందే మార్చాల్సిందే. ఇక్కడిదాకా తెచ్చుకున్నా’’ అని చెప్తూ శాలిని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమయంలో శాలినిని చూసి శివాజీ షాక్ అయ్యాడు.

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ నుంచి ఏడో వారంలో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. దక్షి, శాలిని హౌస్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దక్షి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయింది. శాలిని ఏమో ఏడు వారాలు ఉంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో మరోసారి 8వ వారంలో నామినేషన్ హీట్ మొదలు కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More