తెలుగులో ఆది సాయికుమార్ నటించిన మిస్టిక్ థ్రిల్లర్ మూవీ శంబాల. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైంది. ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ సినిమాకు ఐఎండీబీలో 8.1 రేటింగ్ నమోదైంది. ఇప్పుడీ మూవీ జనవరి 22 నుంచి ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. మరి ఆ విశేషాలేంటో ఇక్కడ చూడండి.
శంబాల ఓటీటీ రిలీజ్ డేట్

ఆది సాయికుమార్ ఓ యువ సైంటిస్ట్ పాత్రలో నటించిన మూవీ శంబాల. ఈ సినిమాను జనవరి 22 నుంచి ఆహా వీడియో ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. అంతేకాదు ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు 24 గంటలు ముందుగానే అంటే జనవరి 21 నుంచే చూడొచ్చు.
“అపోహలు సజీవంగా మారే, విధి గర్జించే ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెట్టండి. ఆది సాయికుమార్ శంబాల జనవరి 22న ఆహాలో ప్రీమియర్ అవుతుంది. ఆహా గోల్డ్ యూజర్స్ కు 24 గంటల ముందే యాక్సెస్” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
శంబాల మూవీ గురించి..
ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్, స్వాసిక విజయన్, మధు నందన్, ఇంద్రనీల్, రవివర్మ, మీసాల లక్ష్మణ్ లాంటి వాళ్లు నటించిన ఈ శంబాల మూవీని యగంధర్ ముని డైరెక్ట్ చేశాడు. క్రిస్మస్ సందర్భంగా గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైంది. హారర్, మిస్టరీ, థ్రిల్లర్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ శంబాల తెరకెక్కింది.
ఈ శంబాల మూవీ కథ 1980వ దశకంలో జరుగుతుంది. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న శంబాల గ్రామంలో ఓ ఉల్క పడటంతో పరిస్థితులన్నీ మారుతాయి. ఊరి జనం హత్యలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెడతారు. దాంతో ఊరికి బండ భూతం పట్టిందని జనం అనుకుంటారు. రాము దగ్గర ఉన్న ఆవుకు పాలు పితికితే రక్తం వస్తుందని దాన్ని చంపాలనుకుంటారు ప్రజలు.
ఈ క్రమంలోనే ఉల్కని పరిశోధించేందుకు విక్రమ్ (ఆది)ని ప్రభుత్వం పంపిస్తుంది. విక్రమ్ ఊర్లోకి వచ్చిన తరువాత ఊరిని ఎదురించి ఆ ఆవుని రక్షిస్తాడు. కానీ రాము అతి కిరాతకంగా మారి చాలా మందిని హత్యలు చేసి, ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఊరి జనం ఇలాగే చేస్తుంటారు.
{{/usCountry}}ఈ క్రమంలోనే ఉల్కని పరిశోధించేందుకు విక్రమ్ (ఆది)ని ప్రభుత్వం పంపిస్తుంది. విక్రమ్ ఊర్లోకి వచ్చిన తరువాత ఊరిని ఎదురించి ఆ ఆవుని రక్షిస్తాడు. కానీ రాము అతి కిరాతకంగా మారి చాలా మందిని హత్యలు చేసి, ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఊరి జనం ఇలాగే చేస్తుంటారు.
{{/usCountry}}అసలు ఊరి జనం ఎందుకు అలా ప్రవర్తిస్తుంటారు? వాటికి ఆ ఉల్క (బండ భూతానికి)కి సంబంధం ఉంటుందా? ఉల్క ఎలా పడింది? దాని నేపథ్యం ఏంటీ? విక్రమ్ ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడా అనేదే ఈ శంబాల మూవీ స్టోరీ.
ఈ సినిమాలో ప్రేక్షకుడికి వెన్నులో వణుకు పుట్టించే సీన్స్, ఉత్కంఠభరితమైన ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్‌లు సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. క్లైమ్యాక్స్ కూడా ఆసక్తి రేపేలా ఉంది. హారర్, మిస్టిక్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లు ఈ సినిమాను ఆహా వీడియో ఓటీటీలో చూడొచ్చు.