Sharwanand: బంపర్ బ్లాక్‌బస్టర్ ఇస్తానని చెప్పాను.. ఇచ్చాను.. ప్రభాస్ అన్న ఐ లవ్ యూ.. మేమిద్దరం హీరోలమే: శర్వానంద్
Sharwanand: బైకర్ మూవీ సక్సెస్ మీట్‌లో శర్వానంద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బంపర్ బ్లాక్‌బస్టర్ ఇస్తానని ముందే చెప్పానని, ఇప్పుడు కొట్టామని అతడు అన్నాడు. అలాగే ప్రభాస్ కు కూడా థ్యాంక్స్ చెప్పాడు.
Sharwanand: శర్వానంద్ లీడ్ రోల్లో నటించిన మూవీ బైకర్. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం (ఏప్రిల్ 3) థియేటర్లలోకి రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు, మంచి కలెక్షన్లు రావడంతో తొలి రోజే మూవీ టీమ్ బంపర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో శర్వానంద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ అన్నకి థ్యాంక్స్
బైకర్ సినిమాకు మొదటి నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ అండగా ఉంటున్నాడు. మూవీ రిలీజ్ కు ముందు సోషల్ మీడియా ద్వారా బాగానే ప్రమోట్ చేశాడు. అయితే ఇంత చేసిన శర్వానంద్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదంటూ వచ్చిన విమర్శలకు తాజాగా అతడు సమాధానమిచ్చాడు. ఎవరేమనుకున్నా తనకు సంబంధం లేదని, తనకు ఎక్స్‌ప్రెస్ చేయడం రాదని, మనమేంటో మనకు తెలుసు అని అన్నాడు.
“ముందుగా ప్రభాస్ అన్నకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మేం ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగానే ఫస్ట్ ట్వీట్ ఆయనే వేశారు. మొన్న రిలీజ్ కు ముందు ఓ చిన్న యాడ్ లాగా చేశారు. ప్రభాస్ అన్న ఐలవ్యూ.. నా గుండెలో మీరు ఎప్పుడూ అక్కడ ఉంటారు. ఎవరేం అనుకున్నా నేను పట్టించుకోను. నాకు ఎక్స్‌ప్రెస్ చేయడం రాదు. మనమేంటో మనిద్దరికీ తెలుసు” అని శర్వానంద్ అన్నాడు.
బంపర్ బ్లాక్‌బస్టర్ ఇస్తామని ముందే చెప్పా
ఇక బైకర్ సినిమా గురించి కూడా శర్వానంద్ మాట్లాడాడు. సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ ఇస్తానని, ఇప్పుడు బంపర్ బ్లాక్‌బస్టర్ ఇస్తానని ముందే చెప్పి ఇచ్చానని అన్నాడు.
“ఈ సినిమాకు ఫస్ట్ హీరో మా ప్రొడ్యూసర్ వంశీ అన్న. యూవీ క్రియేషన్స్ లో నేను నాలుగు సినిమాలు చేశాను. అన్నీ హిట్టే. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు.. ఇప్పుడు బైకర్. అందుకే ఫస్ట్ హీరో ప్రొడ్యూసర్ అని అన్నాను. ఇక సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ ఇస్తానని చెప్పాను ఇచ్చాను. ఇప్పుడు బంపర్ బ్లాక్‌బస్టర్ ఇస్తానన్నాను. కొట్టాను. దీనికి కారణమైన ప్రేక్షకులు, మీడియా అందరికీ థ్యాంక్స్” అని శర్వానంద్ అన్నాడు.
ఈ సినిమాలో ఇద్దరం హీరోలమే
ఇక ఈ బైకర్ మూవీలో నటించిన రాజశేఖర్ గురించి కూడా శర్వా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సింప్లిసిటీ ఎలా ఉంటుందో ఆయన నుంచి నేర్చుకోవాలని అతడు అన్నాడు. బైకర్ సినిమాలో తాము ఇద్దరం హీరోలమే అని, సినిమా చూసిన తర్వాత అందరూ అదే అంటున్నారని కూడా శర్వానంద్ చెప్పాడు.
“మొన్న మీరు ఇది శర్వా సినిమా అని అన్నారు. కానీ ఇప్పుడు సినిమా చూసినవాళ్లు మాత్రం ఇది రాజశేఖర్ సినిమా, శర్వా సినిమా అనే అంటున్నారు. ఆయన ఇప్పటికీ మనందరికీ హీరోనే. ఇందులో మీరు నటించడం మాకు గౌరవం” అని శర్వానంద్ అన్నాడు.
బైకర్ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తొలి రోజు ఈ సినిమా ఇండియాలో రూ.2.1 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీకి సంగీత్ శోభన్ నటించిన రాకాస నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


