...
...
Next Story

Biker vs Raakaasaa: బాక్సాఫీస్ ఫైట్.. శర్వానంద్ బైకర్‌పై సంగీత్ శోభన్ రాకాస పైచేయి.. టికెట్ల అమ్మకాలు, కలెక్షన్లలో జోరు

Biker vs Raakaasaa: ఈ వారం థియేటర్లలో విడుదలైన శర్వానంద్ స్పోర్ట్స్ డ్రామా 'బైకర్', సంగీత్ శోభన్ హారర్ కామెడీ 'రాకాస' మధ్య గట్టి పోటీ నెలకొంది. విమర్శకుల ప్రశంసలు 'బైకర్'కు దక్కినప్పటికీ, వసూళ్ల పరంగా మొదటి రోజు 'రాకాసా' అనూహ్యమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

Published on: Apr 04, 2026 09:12 AM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Biker vs Raakaasaa: గుడ్ ఫ్రైడే సందర్భంగా బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు మొదలైంది. ఒకవైపు అనుభవం ఉన్న స్టార్ హీరో శర్వానంద్ 'బైకర్' (Biker) మూవీతో పలకరించగా.. మరోవైపు యువ నటుడు సంగీత్ శోభన్ 'రాకాస' (Raakaasaa)తో థియేటర్లలోకి వచ్చాడు. అయితే మొదటి రోజు బుకింగ్స్, టికెట్ సేల్స్, బాక్సాఫీస్ కలెక్షన్లు చూస్తుంటే చిన్న సినిమా అయిన 'రాకాస' పెద్ద సినిమాపై పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది.

రాకాస vs బైకర్ బాక్సాఫీస్ వసూళ్లు

Biker vs Raakaasaa: బాక్సాఫీస్ ఫైట్.. శర్వానంద్ బైకర్‌పై సంగీత్ శోభన్ రాకాస పైచేయి.. టికెట్ల అమ్మకాలు, కలెక్షన్లలో జోరు
Biker vs Raakaasaa: బాక్సాఫీస్ ఫైట్.. శర్వానంద్ బైకర్‌పై సంగీత్ శోభన్ రాకాస పైచేయి.. టికెట్ల అమ్మకాలు, కలెక్షన్లలో జోరు

తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్ల పరంగా చూస్తే బైకర్ పై రాకాస స్పష్టమైన ఆధిక్యం సాధించింది. బాక్సాఫీస్ ట్రాకర్ Sacnilk ప్రకారం చూస్తే.. రాకాస తొలిరోజు గ్రాస్ వసూళ్లు రూ.2.99 కోట్లుగా ఉన్నాయి. వీటిలో ఇండియా నెట్ కలెక్షన్లు రూ.2.6 కోట్లు కావడం విశేషం. ఓ చిన్న సినిమా ఇది నిజంగా భారీ ఓపెనింగే అని చెప్పాలి.

మరోవైపు బైకర్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు గ్రాస్ వసూళ్లు రూ.2.41 కోట్లుగా ఉన్నాయి. వీటిలో ఇండియా నెట్ వసూళ్లు రూ.2.10 కోట్లు. ఆ లెక్కన రాకాస కంటే బైకర్ చాలా వెనుకబడినట్లే. ముఖ్యంగా శర్వానంద్ కు ఉన్న ఫాలోయింగ్, సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి లాంటి హిట్ ఇచ్చిన తర్వాత వచ్చిన మూవీ అయినా కూడా బైకర్ అంతగా ప్రభావం చూపలేకపోయింది.

'రాకాస' జోరు.. బుక్ మై షోలో రికార్డు

హారర్ కామెడీ జానర్‌లో వచ్చిన 'రాకాస'కు విమర్శకుల నుంచి మంచి రివ్యూలు దక్కాయి. ఈ సినిమా మొదటి రోజే బుక్ మై షో (BookMyShow)లో ఏకంగా 62 వేల టికెట్లను విక్రయించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఒక చిన్న బడ్జెట్ సినిమాకు ఇది చాలా సాలిడ్ స్టార్ట్ అనే చెప్పాలి. హారర్ కామెడీలకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది.

అసలైన పరీక్ష ఇప్పుడు మొదలైంది. ఈ రెండు సినిమాలు తమ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లను చేరుకోవాలంటే వీకెండ్‌లో భారీ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. శని, ఆదివారాల్లో 'బైకర్' తన వసూళ్లను పెంచుకుని 'రాకాస'ను అధిగమిస్తుందా? లేదా సంగీత్ శోభన్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తాడా? అనేది చూడాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. 'రాకాస' మొదటి రోజు వసూళ్లు ఎంత?

'రాకాస' సినిమాకు తొలి రోజు రూ.2.6 కోట్ల నెట్ వసూలైంది. ఇక టికెట్ల పరంగా చూస్తే బుక్ మై షోలో 62 వేల టికెట్లు అమ్ముడయ్యాయి.

2. బైకర్ తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్లు ఎంత?

శర్వానంద్ నటించిన బైకర్ మూవీ తొలి రోజు రూ.2.10 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe