టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ లీడ్ రోల్లో నటిస్తున్న మూవీ బైకర్. ఇదో స్పోర్ట్స్ డ్రామా. ఈ మధ్యే ఈ సినిమా నుంచి శర్వా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీ కోసం అతడు పూర్తిగా స్లిమ్ అండ్ ఫిట్ లుక్ లో పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బైకర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
బైకర్ ఓటీటీ డీల్ ఇలా..

శర్వానంద్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ బైకర్ మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు తెలిపింది. ఈ సినిమా కోసం ఆ ఓటీటీ భారీ మొత్తమే చెల్లించినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. ఈ బైకర్ మూవీ డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుంది.
అదే రోజు బాలకృష్ణ నటించిన అఖండ 2 కూడా రానుండటంతో దీనికి గట్టి పోటీ ఉండనుంది. బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టమే కానీ.. ఈ డిజిటల్ హక్కుల ద్వారానే మేకర్స్ మంచి మొత్తాన్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.
బైకర్ మూవీ గురించి..
శర్వానంద్ నటిస్తున్న ఈ బైకర్ మూవీ ఓ స్పోర్ట్స్ డ్రామా. ఓ భిన్నమైన కథతో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా కథాంశం ఒక రేసింగ్ లవర్ చుట్టూ తిరుగుతుంది. తెలుగు సినిమా రంగంలో ఇలాంటి యూనిక్ కంటెంట్ ఉన్న సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే ఈ కథనాన్ని తెరకెక్కించిన విధానంపైనే సినిమా విజయం పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే విడుదలైన బైక్ రేసింగ్ విజువల్స్, శర్వానంద్ లీన్ లుక్, అలాగే నిర్మాణ విలువలు అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి.
ప్రభాస్ హోమ్ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ ఈ 'బైకర్' సినిమాకు అండగా నిలవడంతో సినిమా బడ్జెట్ భారీగా ఉంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుండటం విశేషం. ఇక హీరోయిన్గా మాళవిక నాయర్ కనిపించనుంది.
{{/usCountry}}ప్రభాస్ హోమ్ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ ఈ 'బైకర్' సినిమాకు అండగా నిలవడంతో సినిమా బడ్జెట్ భారీగా ఉంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుండటం విశేషం. ఇక హీరోయిన్గా మాళవిక నాయర్ కనిపించనుంది.
{{/usCountry}}ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. టీజర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ.. "ఇండియాలో ఇప్పటివరకు వచ్చిన ఏ ఇతర రేసింగ్ సినిమా కంటే కూడా 'బైకర్' మరింత అద్భుతంగా ఉంటుంది" అని ధీమాగా చెప్పాడు. అతని మాటలు ఈ సినిమాపై మరింత హైప్‌ని పెంచాయి.
సినిమాపై ఉన్న ఈ భారీ హైప్‌కి తగినట్లుగా 'బైకర్' నిజంగా ఉంటుందో లేదో చూడాలి. ఏదేమైనా సినిమా పూర్తి కాకముందే దీని డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ రేసింగ్ ఎంటర్‌టైనర్‌ను జనవరి 2026 మొదటి వారంలో స్ట్రీమింగ్ చేయనుంది.